గర్వారే హై-టెక్ ఫిల్మ్స్ నుంచి సన్-రూఫ్, మూన్-రూఫ్,రూఫ్-టాప్ ఫిల్మ్ కిట్స్ విడుదల
ఆటోమోటివ్ పెయింట్ ప్రొటెక్షన్ & సేఫ్టీ గ్లేజింగ్ ఫిల్మ్‌లలో అగ్రగామిగా ఉన్న గర్వారే హై-టెక్ ఫిల్మ్స్ సరికొత్త అప్‌డేట్‌తో వచ్చింది. వాహనాల కోసం ఈ సంస్థ సన్-రూఫ్ & మూన్-రూఫ్ ఫిల్మ్ కిట్‌లు & రూఫ్-టాప్ ఫిల్మ్‌లను తీసుకువస్తుంది. మార్కెట్‌లో ఈ ఉత్పత్తులను తీసుకువస్తున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ విభాగంలో టాప్‌గా ఉన్న గర్వారే హై-టెక్ ఫిల్మ్స్.. కస్టమర్లకు మరింత సేవలు అందించాలనే ఉద్దేశంతో నాణ్యతపై దృష్టి సారించినట్లు పేర్కొంది. ఈ సంస్థ నుంచి వస్తున్న ఆటోమోటివ్ సన్-రూఫ్-మూన్-రూఫ్ ఫిల్మ్ కిట్‌లు ప్రపంచంలోనే మొట్టమొదటి సన్-కంట్రోల్ రూఫ్‌టాప్ ఫిల్మ్స్‌గా సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ ఔత్సాహికుల అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీతో వీటిని రూపొందింటినట్లు పేర్కొంది.

కస్టమర్ వాహనాల అందంగా తీర్చిదిద్దడం మరియు ఎక్కువ రోజులు రూఫ్‌లు నిలిచేలా అత్యుత్తమ ప్రొటెక్షన్‌ని కల్పించడమే తమ ధ్యేయమని శ్రీ దీపక్ జోషి, డైరెక్టర్ - సేల్స్ & మార్కెటింగ్‌లో Garware Hi-Tech తెలిపారు. మా ప్రయాణంలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని.. భవిష్యత్తులోనూ మంచి ప్రొడక్ట్స్‌ని తీసుకువచ్చేందుకు ఇది ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు తీవ్ర ఎండతో ఇబ్బందులు ఉంటాయని.. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మా ఉత్పత్తుల వేడిమిని సైతం తట్టుకునేలా ఉపయోగపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విభాగంలో రాబోయే రోజుల్లో ఇది చాలా కీలకమని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఈ ప్రొడక్ట్స్‌పై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

గర్వారే హై-టెక్ ఫిల్మ్స్ హై టెక్నాలజీతో కూడిన ఆటోమోటివ్ మరియు ఆర్కిటెక్చరల్ ప్రొటెక్షన్ ఫిల్మ్‌లను తయారు చేస్తుంది. 90 సంవత్సరాలకు పైగా ఈ విభాగంలో సంస్థ అగ్రగామీగా ఉంది. గార్వేర్ హై-టెక్ ఫిల్మ్స్ పోర్ట్‌ఫోలియోలో ఆటోమోటివ్ పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్‌లు భారీగా పేరు సంపాదించాయి. సేఫ్టీ గ్లేజింగ్ ఫిల్మ్‌లు, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫిల్మ్‌లు, డెకరేటివ్ ఫిల్మ్‌లు కూడా ఉన్నాయి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








