మళ్ళీ పట్టాలెక్కిన ‘గాతిమాన్ ఎక్స్‌ప్రెస్’.. టైమింగ్ & ఫుల్ డీటైల్స్

భారతదేశంలో మొట్టమొదటి హై స్పీడ్ ట్రైన్ అయిన "గాతిమాన్ ఎక్స్‌ప్రెస్" దాదాపు ఒక సంవత్సరం విరామం తర్వాత తిరిగి తన కార్యకలాపాలు ప్రారంభించినట్లు సమాచారం అందింది. ఈ ట్రైన్ దేశంలో ఉన్న ప్రముఖ ట్రైన్లలో ఒకటి. అంతే కాదు ఇది వేగవంతమైన ట్రైన్ కూడా.

గత సంవత్సరం భారతదేశంలో ప్రవేశించిన కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ట్రైన్ సర్వీసులన్నీ నిలిపివేయడం జరిగింది. అయితే తర్వాత కొంత ఈ వైరస్ సంక్రమణ తగ్గిన తర్వాత మెల్ల మెల్లగా ట్రైన్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కానీ కొన్ని ట్రైన్లు ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఈ కరోనా సమయంలో భారత మధ్య రైల్వే విభాగం తిరిగి గాతిమాన్ ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించింది.

గాతిమాన్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సర్వీస్ తిరిగి ప్రారంభమై 2021 జూన్ 30 వరకు నడుస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అధికారికంగా తెలిపింది. దీని గురించి కేంద్ర రైల్వే మంత్రి 'పియూష్ గోయల్' సమాచారం అందించారు.

MOST READ:భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

భారతదేశంలో ఎక్కువ పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి అనుకూలంగా పర్యాటకుల సౌలభ్యం కోసం రైల్వే విభాగం తన గాతిమాన్ ట్రైన్ సర్వీసును తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం గాతిమాన్ ఎక్స్‌ప్రెస్ యొక్క టైమింగ్ అందులోని సౌకర్యాలు వంటి వాటి గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

గాతిమాన్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్:

గాతిమాన్ ట్రైన్ వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ఈ రైలు హజ్రత్ నిజాముద్దీన్ (ఎన్‌జెడ్ఎం) రైల్వే స్టేషన్ నుండి ఝాన్సీ జంక్షన్ వరకు నడుస్తుంది. ఈ ట్రైన్ వెళ్లే మార్గం మొత్తం పొడవు 403 కి.మీ వరకు ఉంటుంది.

MOST READ:టెస్టింగ్ దశలో ఉన్న సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్; ఒక చార్జితో 240 కి.మీ మైలేజ్

ఈ ట్రైన్ ఉదయం 8.10 గంటలకు నిజాముద్దీన్ నుండి బయలుదేరి ఉదయం 09.50 గంటలకు ఆగ్రాకు చేరుకుంటుంది, గ్వాలియర్ ఉదయం 11.13 గంటలకు చేరుకుని చివరికి మధ్యాహ్నం 12.35 గంటలకు ఝాన్సీ స్టేషన్ చేరుకుంటుంది. గాతిమాన్ రైలు నాలుగు గంటల్లో 403 కి.మీ ప్రయాణిస్తుంది.

గాతిమాన్ ఎక్స్‌ప్రెస్ యొక్క ప్రత్యేక లక్షణాలు:

గాతిమాన్ ఎక్స్‌ప్రెస్ గంటకు గరిష్టంగా 160 కి.మీ వేగంతో నడుస్తుంది. దీనివల్ల ఈ రైలు దేశంలో అత్యంత వేగవంతమైనదిగా గుర్తింపు పొందింది. ఆగ్రా మరియు ఝాన్సీ జంక్షన్ కొద్దిగా బలహీనంగా ఉన్నందున గాతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో గంటకు 130 కి.మీ వేగంతో నడుస్తుంది.

MOST READ:9 సంవత్సరాల రికార్డ్ తిరిగిరాసిన మార్చి 2021 టాటా మోటార్స్ సేల్స్

ఈ ట్రైన్ చాలా సురక్షితంగా ఉందని అధికారికంగా ధృవీకరించబడి 2014 అక్టోబర్ నెలలో సర్టిఫికేట్ కూడా జారీ చేయబడింది. అంతకుముందు ఈ రైలు హజ్రత్ నిజాముద్దీన్ నుండి ఆగ్రాకు మాత్రమే ప్రయాణించేది. 2018 లో ఈ మార్గాన్ని గ్వాలియర్ వరకు విస్తరించారు.

ఈ రైలులో చాలా సౌకర్యవంతమైన సీట్లు మరియు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు, ఒక సంవత్సరం విరామం తరువాత దీని ప్రయాణం కొనసాగుతుంది. ఈ తరిం లో చెప్పుకోదగిన స్పెషాలిటీ ఏంటంటే, విమానంలో ఎయిర్ హోస్టెస్ తరహాలోనే ఈ ట్రైన్ లో కూడా ట్రైన్ హోస్టెస్ వుంటారు.

MOST READ:ట్రాఫిక్ సిగ్నల్‌లో మైఖేల్ జాక్సన్ మూన్‌వాక్ చేసిన యువకుడు [వీడియో]

Most Read Articles

English summary
Gatiman Express Train Operations Restarted. Read in Telugu.
Story first published: Friday, April 2, 2021, 11:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X