హబ్బీకి అదిరిపోయే కానుకిచ్చిన జెనీలియా

జెనీలియా పెళ్లయ్యాక మీడియాలో ఆమె పేరు దాదాపు కనుమరుగయ్యింది. అయితే, తన భర్త పుట్టిన రోజు సందర్భంగా ఇండియన్స్ డ్రీమ్ కార్ అయిన టెస్లా ఎలక్ట్రిక్ కారును రితేష్‌కు బహుకరించింది.

By Anil

2003లో సినిమా ప్రపంచానికి పరిచయమైన జెనీలియా డిసౌజా అతి కొద్ది కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో మంచి ఆదరణ పొందింది. బాలీవుడ్ నుండి కెరీర్ ప్రారంభించిన జెనీలియా తెలుగులో బొమ్మరిల్లు చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

జెనీలియా రితేష్ దేశ్‌ముఖ్ టెస్లా ఎలక్ట్రిక్ కారు

నువ్వేకావాలి చిత్రాన్ని హిందీలోకి అనువాదించిన తుజే మేరీ కసమ్ సినిమా ద్వారా జెనీలియా కెరీర్ స్టార్ట్ చేసింది. తన తొలి సినిమాలో హీరోగా నటించిన రితేష్ దేశ్‌ముఖ్‌ను 2012లో వివాహమాడి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

జెనీలియా రితేష్ దేశ్‌ముఖ్ టెస్లా ఎలక్ట్రిక్ కారు

వారిద్దరూ కలయికకు ఐదేళ్లు పూర్తయ్యాయి. జెనీలియా పెళ్లయ్యాక మీడియాలో ఆమె పేరు దాదాపు కనుమరుగయ్యింది. అయితే, తన భర్త పుట్టిన రోజు సందర్భంగా ఇండియన్స్ డ్రీమ్ కార్ అయిన టెస్లా ఎలక్ట్రిక్ కారును రితేష్‌కు బహుకరించింది. దీంతో మన హాసిని మళ్లీ వార్తల్లో నిలిచింది.

ఈ కారుతో ఇప్పుడు ఇండియాలో రెండు టెస్లా కార్లు ఉన్నాయి. ఇదే నెలలోనే ఓ బిజినెస్ మ్యాన్ భారతదేశపు తొలి టెస్లా కారును కొనుగోలు చేశాడు.

జెనీలియా తన హబ్బీకు టెస్లా కారును గిఫ్టుగా ఇస్తూ, చేసిన ట్వీట్‌తో ట్విట్టర్‌లో రితేశ్ దేశ్‌ముఖ్‌ను విష్ చేస్తూ ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు ట్వీట్ల మోత మోగించారు.

జెనీలియా రితేష్ దేశ్‌ముఖ్ టెస్లా ఎలక్ట్రిక్ కారు

11 సంవత్సరాల సినీ ప్రయాణంలో జెనెలీయో బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎన్నో చిత్రాల్లో నటించింది. హిందీ, తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ భాషలలో ప్రముఖ హీరోల సరసన నటించి దక్షిణాది అభిమానులను మెప్పించింది.

Recommended Video

Horrifying Footage Of A Cargo Truck Going In Reverse, Without A Driver - DriveSpark
జెనీలియా రితేష్ దేశ్‌ముఖ్ టెస్లా ఎలక్ట్రిక్ కారు

జెనీలియా-రితేష్ దేశ్‌ముఖ్‌ల ప్రేమకు ప్రతిరూపంగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రితేశ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ విలాస్ రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు. హిందీ మరియు మరాఠీ చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నాడు, ఇతనొక ఆర్కిటెక్ట్ కూడా.

జెనీలియా రితేష్ దేశ్‌ముఖ్ టెస్లా ఎలక్ట్రిక్ కారు

40 వ పుట్టిన రోజు వేడుకు జరుపుకున్న రితేష్ ఇప్పుడు ఇండియా యొక్క రెండవ టెస్లా మోడల్ ఎక్స్ ఓనర్. ఈ మధ్యనే ఎస్సార్ గ్రూప్ సిఇఒ ప్రశాంత్ రుయా భారతదేశపు మొదటి టెస్లా మోడల్ ఎక్స్ కారును ముంబాయ్‌లో రిజిస్టర్ చేయించుకున్నాడు.

జెనీలియా రితేష్ దేశ్‌ముఖ్ టెస్లా ఎలక్ట్రిక్ కారు

జెనీలియా తన గిఫ్టుతో నలభైయేళ్ల వయస్సున్న నన్ను 20 ఏళ్ల కుర్రాడిలా మార్చేసిందని ట్విట్టర్‌లో తెలిపాడు. ఇక వీరి అన్యోన్య దాంపత్యానికి దిగ్గజ సెలబ్రిటీలంతా ఫిదా అవడం గ్యారంటీ.

జెనీలియా రితేష్ దేశ్‌ముఖ్ టెస్లా ఎలక్ట్రిక్ కారు

టెస్లా ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ "మోడల్ ఎక్స్" మాత్రమే మరియు ఈ సెగ్మెంట్లో ఇదే అత్యంత వేగవంతమైన కారు. టెస్లా మోడల్ ఎక్స్ కేవలం 4.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం 250కిలోమీటర్లు.

జెనీలియా రితేష్ దేశ్‌ముఖ్ టెస్లా ఎలక్ట్రిక్ కారు

ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. వీటిలో ముందు చక్రాలకు పవర్ సరఫరా అవుతుంది. ఆ తరువాత కాస్త ఆలస్యంగా వెనుక చక్రాలకు పవర్ సరఫరా అవుతుంది. రెండు మోటార్ గరిష్టంగా 752బిహెచ్‌పి పవర్ మరియు 967ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి.

జెనీలియా రితేష్ దేశ్‌ముఖ్ టెస్లా ఎలక్ట్రిక్ కారు

టెస్లా మోడల్ ఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో అడ్వాన్స్‌డ్ ఆటోపైలట్ టెక్నాలజీ కలదు. ఈ ఫీచర్ కారు వేగం 145కిలోమీటర్ల లోపు ఉన్నపుడు ఆటోమేటిక్‌గా స్టీరింగ్ చేయడం, ఆటోమేటిక్‌ లేన్ చేంజ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరయు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి పనులు చేస్తుంది.

జెనీలియా రితేష్ దేశ్‌ముఖ్ టెస్లా ఎలక్ట్రిక్ కారు

అంతే కాకుండా టెస్లా మోడల్ ఎక్స్‌లో 360-డిగ్రీల విజన్ గల ఎనిమిది సరౌండింగ్ కెమెరాలు ఉన్నాయి. మరియు కారు చుట్టుప్రక్కలను గమనిస్తూ ఉండటానికి 12 అల్ట్రాసోనిక్ సెన్సార్లు ఉన్నాయి.

జెనీలియా రితేష్ దేశ్‌ముఖ్ టెస్లా ఎలక్ట్రిక్ కారు

టెస్లా సంస్థ మరింత వేగంతో దూసుకెళ్లే మోడల్ ఎక్స్ వేరియంట్‌ను కూడా అభివృద్ది చేసింది. దాని పేరు పి90డి. ఈ టెస్లా మోడల్ ఎక్స్ పి90డి కేవలం 3.8 సెకండ్ల వ్యవధిలో 100కిమీల వేగాన్ని చేరుకుంటుంది. అయితే, ఇందులో ఉన్న లూడిక్రుయస్ మోడ్ ద్వారా 3.2 సెకండ్లలోపే 100కిమీల స్పీడ్ అందుకుంటోంది.

జెనీలియా రితేష్ దేశ్‌ముఖ్ టెస్లా ఎలక్ట్రిక్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎన్నో లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ మరియు సూపర్ కార్లు దిగుమతి అయిన ఇండియాలో టెస్లా కార్ల రాక ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండు టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ఇండియన్ రోడ్ల మీదకు ల్యాండ్ అయ్యాయి. కాబట్టి, టెస్లా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించడానికి మరెంతో సమయం లేదని చెప్పవచ్చు.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Actor Genelia D'Souza Gifts Tesla Model X Electric SUV To Husband Ritesh Deshmukh For His Birthday
Story first published: Wednesday, December 20, 2017, 13:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X