కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

మీ కారులో స్టీరింగ్ వెనుక భాగంలో ఉన్న డ్యాష్‌బోర్డుపై అమర్చిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో వార్నింగ్ లైట్స్‌ను ఎప్పుడైనా గమనించారా? ఇందులో ఒక్కొక్క వార్నింగ్ లైట్స్ వాహనంలోని సమస్యలను గుర్తించి, వాహన యజమానులను హెచ్చరిస్తాయి.

కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

సకాలంలో స్పందించి సదరు సమస్యలను పరిష్కరించకపోయినట్లయితే, వాహనం పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అధునాతన కార్లు అనేక రకాల ఫీచర్లతో అందుబాటులో ఉంటున్నాయి.

కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

కార్లలోని వివిధ భాగాలకు సంబంధించిన సమస్యలను సదరు వాహన యజమానులు తెలియజేయటం కోసం ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై అనేక రకాల వార్నింగ్ సైన్స్ ఉంటాయి. పాత కార్లలో ఇవి ఎల్ఈడి లైట్ల రూపంలో ఉండగా, ఇప్పటి మోడ్రన్ కార్లలో ఇవి డిజిటల్ స్క్రీన్‌పై ప్రొజెక్ట్ చేయబడుతాయి.

కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

ఈ కథనంలో కార్లలో కనిపించే కొన్ని ముఖ్యమైన వార్నింగ్ సైన్స్ మరియు వాటి అర్థాలు ఏంటో తెలుసుకుందాం రండి.

కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

డోర్ ఓపెన్ అలెర్ట్

కారులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డోర్లు సరిగ్గా మూసివేయకపోతే, ఈ అలెర్ట్ వస్తుంది. పాత కార్లలో ఈ ఫీచర్ ఉండకపోవచ్చు, కానీ రూఫ్‌లో ఉన్న లైట్ వద్ద డోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ కారు డోర్లు అన్ని మూసి ఉన్నప్పటికీ, ఈ లైట్ వెలిగినట్లయితే, ఏదో ఒక డోర్ సరిగ్గా మూయలేదని అర్థం. అలాగే మోడ్రన్ కార్లలో ఖచ్చితంగా ఏ డోరు మూయలేదనే విషయాన్ని కూడా ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై తెలుసుకోవచ్చు.

కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

వాషర్ ఫ్లూయిడ్ రిమైండర్

పాత కార్లలో వాషర్ ఫ్లూయిడ్ ఉందో లేదో తెలుసుకోవాలంటే, బోనెట్ ఓపెన్ చేసి మ్యాన్యువల్‌గా చెక్ చేసుకోవాలని. కానీ, ఇప్పుడు అందుబాటులో ఉన్న మోడ్రన్ కార్లలో దీని కోసం ప్రత్యేమైన సెన్సార్లు ఉంటున్నాయి. వాషర్ ఫ్లూయిడ్ ట్యాంక్‌లో నీరు తగ్గిపోగానే డ్యాష్‌బోర్డుపై అలెర్ట్ సైన్ వస్తుంది. కారులో ఎల్లప్పుడూ తగినంత వాషర్ ఫ్లూయిడ్ ఉండటం ఎంతో అవసరం.

కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

ఏబిఎస్ వార్నింగ్ లైట్

పాత కార్లలో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్) సిస్టమ్ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు వస్తున్న అన్ని కార్లలో ఏబిఎస్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా అందించబడుతోంది. కారులోని ఏబిఎస్ వ్యవస్థలో ఏదైనా సమస్య ఉంటే, ఈ వార్నింగ్ సైన్ ఆన్ అవుతుంది. ఈ సైన్ కనిపించిన వెంటనే ఈ సమస్యను సరిచేసుకోవటం మంచిది.

కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

క్రూయిస్ కంట్రోల్ లైట్

ప్రీమియం కార్లలో క్రూయిజ్ కంట్రోల్ అనే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసినప్పుడు ఈ లైట్ ఆన్ అవుతుంది. కారులో హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు యాక్సిలరేటర్ పెడల్ తొక్కాల్సిన అవసరం లేకుండానే, కారును నిర్దిష్ట వేగానికి తీసుకువెళ్లి, ఆటోమేటిక్‌గా అదే వేగం వద్ద ప్రయాణించేలా చేయటంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

ఆటోమేటిక్ షిఫ్ట్ లాక్

ఆటోమేటిక్ కార్లలో మీరు న్యూట్రల్ నుండి గేర్‌కు మారేటప్పుడు బ్రేక్ నొక్కాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బ్రేక్ పెడల్ నొక్కకుండా న్యూట్రల్ నుండి గేర్‌కు మార్చడానికి ప్రయత్నిస్తే, ఈ అలెర్ట్ కార్లపై వెలుగుతూ ఉంటుంది.

కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

ట్రాక్షన్ కంట్రోల్ వార్నింగ్

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేఫ్టీ ఫీచర్లలో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఒకటి. ఈ ఫీచర్‌ను వద్దనుకుంటే ఆఫ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. కారులో ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్‌ను ఆఫ్ చేసినప్పుడు ఈ వార్నింగ్ సైన్ ఆన్ అవుతుంది. తడి రోడ్లపై కారు జారిపోకుండా ఉండేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

ఫాగ్ ల్యాంప్స్ ఆన్

బేసిక్ కార్లలో ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఆప్షనల్‌గా ఉంటాయి, కానీ ప్రీమియం కార్లలో ఇవి స్టాండర్డ్‌గా లభిస్తాయి. డ్యాష్‌బోర్డుపై ఈ లైట్ ఆన్‌లో ఉన్నట్లయితే, మీ కారులో ఫాగ్ ల్యాంప్స్ ఆన్‌లో ఉన్నాయని అర్థం. శీతాకాలంలో డ్రైవర్లకు మరియు ఎదురుగా వచ్చే వాహనాలకు విజిబిలిటీని అందించడంలో ఈ లైట్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇవి డేటైమ్ రన్నింగ్ లైట్ల మాదిరిగా కూడా పనిచేస్తాయి.

కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్

లేటెస్ట్ కార్లలో టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. కారు టైర్లలో గాలి తగ్గినా లేదా పంక్చర్ అయినా ఈ వార్నింగ్ సైన్ ఆన్ అవుతుంది. ఈ సైన్ వచ్చిన వెంటనే కారు టైర్లలో గాలి నింపుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పంక్చర్ అని అనుమానం వస్తే, వెంటనే దానిని సరిచేసుకోవటం ఉత్తమం.

కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

ఎయిర్‌బ్యాగ్ ఐకాన్

ఒకప్పుడు ఎయిర్‌బ్యాగ్స్ అనేవి హై-ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభిచే ఆప్షనల్ సేఫ్టీ ఫీచర్. అయితే, కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై అన్ని బేసిక్ వేరియంట్లలో కూడా డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండాలి. కారు డ్యాష్ బోర్డుపై ఈ వార్నింగ్ సైన్ ఎక్కువ సమయం కనిపించినట్లయితే, సదరు ఎయిర్‌బ్యాగ్‌లో లోపం ఉందని అర్థం. కారు ఆన్ చేసిన తర్వాత కూడా ఎక్కువ సమయం ఈ సైన్ కనిపిస్తే, వెంటనే సదరు సమస్యను సరి చేయించుకోవాలి.

కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

సీట్ బెల్ట్ అలెర్ట్

కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ (అన్ని సీట్లలో వారు) తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించారు. ప్రస్తుతం లభిస్తున్న దాదాపు అన్ని కార్లలో సీట్ బెల్ట్ రిమైండర్ ఉంటుంది. ముందు వరుసలో కూర్చునే డ్రైవర్ మరియు ప్యాసింజర్లలో ఏ ఒక్కరు సీట్ బెల్ట్ ధరించకపోయినా డ్యాష్‌బోర్డుపై ఈ సైన్ ఆన్ అవుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోగానే ఈ సైన్ ఆఫ్ అవుతుంది.

కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

ఒకవేళ మీరు ప్రీమియం లేదా హై-ఎండ్ లగ్జరీ కార్లను ఉపయోగిస్తున్నట్లయితే, అలాంటి కార్లలో పైన పేర్కొన్న వాటి కన్నా ఎక్కువ డ్యాష్‌బోర్డ్ అలెర్ట్స్ ఉండే అవకాశం ఉంది. అలాంటి వార్నింగ్ సైన్స్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆటోమొబైల్ తయారీలు తమ కార్ల యొక్క ఓనర్స్ మ్యాన్యువల్‌లో ముద్రిస్తారు.

కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

సదరు వార్నింగి సైన్స్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఓనర్స్ మ్యాన్యువల్ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే, కారులో ఎల్లప్పుడు ఓనర్స్ మ్యాన్యువల్ తప్పనిసరిగా ఉండాలి. ఇవి కాకుండా, మీకు తెలిసిన ఇతర వార్నిగ్ సిగ్నల్స్ గురించి మా పాఠకులతో పంచుకోవాలనుకుంటే, కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Most Read Articles

English summary
General Car Warning Lights On Dashboard Explained In Detail. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X