చంద్రుడిపైకి జనరల్ మోటార్స్ మూన్ రోవర్స్; పూర్తి వివరాలు

ప్రపంచంలోని చాలా దేశాలు చంద్రయాన్ ప్రాజెక్టులో నిమగ్నమై ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఇప్పుడు అమెరికా యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్ త్వరలో తన రోవర్‌ను చంద్రునిపైకి దింపబోతున్నట్లు సమాచారం. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

చంద్రుడిపైకి జనరల్ మోటార్స్ మూన్ రోవర్స్; పూర్తి వివరాలు

ఈ ప్రాజెక్టులో జనరల్ మోటార్స్ కంపెనీకి ప్రముఖ డిఫెన్స్ వెహికల్ తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్‌తో కలిసి మూన్ మౌంటెడ్ సెల్ఫ్ డ్రైవ్ లూనార్ రోవర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రణాళికల్లో ఇది ఒకటి అని జనరల్ మోటార్స్ ధ్రువీకరించింది.

చంద్రుడిపైకి జనరల్ మోటార్స్ మూన్ రోవర్స్; పూర్తి వివరాలు

ఈ ప్రాజెక్టు గురించి కంపెనీ స్పందిస్తూ, రోవర్ వాహనం రూపకల్పన మరియు అభివృద్ధి గురించిన సమాచారాన్ని అందించింది. ఈ రోవర్ చంద్రుని యొక్క కఠినమైన ఉపరితలంపై కదలగలదని జనరల్ మోటార్స్ తెలిపింది. ప్రస్తుతం చంద్రునిపై ఉన్న ఇతర రోవర్ల కంటే ఈ కొత్త రోవర్ ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ తెలిపింది.

MOST READ:ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు; ధర అక్షరాల 200 కోట్లు.. మీరూ ఓ లుక్కేసుకోండి

చంద్రుడిపైకి జనరల్ మోటార్స్ మూన్ రోవర్స్; పూర్తి వివరాలు

కంపెనీ రూపొందించనున్న ఈ కొత్త రోవర్ మునుపటి రోవర్ల కంటే కూడా ఎక్కువ దూరం ప్రయాణించగలదని మరియు ఎక్కువ సేపు నిర్వహించగలదని కూడా కంపెనీ తెలిపింది. జనరల్ మోటార్స్ కంపెనీకి ఇప్పటికే మూన్ రోవర్ తయారీలో అనుభవం ఉంది. ఈ సంస్థ గతంలో అపోలో 15, 16 మరియు 17 ల కోసం మూన్ రోవర్స్‌ను విడుదల చేసింది.

చంద్రుడిపైకి జనరల్ మోటార్స్ మూన్ రోవర్స్; పూర్తి వివరాలు

ఈ రోవర్లన్నీ చంద్రునిపై గరిష్టంగా 7.6 కి.మీ దూరం ప్రయాణించగలిగాయి. అయితే కంపెనీ ఇప్పుడు మరింత సమర్థవంతమైన రోవర్లను తయారు చేయాలని చూస్తోంది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా గత సంవత్సరం హై-స్పీడ్ మూన్ రోవర్లపై ఆలోచనలను పంచుకోవడానికి కంపెనీలను ఆహ్వానించింది.

MOST READ:లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

చంద్రుడిపైకి జనరల్ మోటార్స్ మూన్ రోవర్స్; పూర్తి వివరాలు

నాసా తన భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాల్లో భాగంగా 2024 లో వ్యోమగాములను చంద్రుడి మీదికి పంపాలని నిర్ణయించింది. కావున ఈ సమయంలో లాక్‌హీడ్ మార్టిన్‌ యొక్క అంతరిక్ష నైపుణ్యాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నామని దాని ప్రణాళికలను స్పష్టం చేసిన జనరల్ మోటార్స్ తెలిపింది.

చంద్రుడిపైకి జనరల్ మోటార్స్ మూన్ రోవర్స్; పూర్తి వివరాలు

అమెరికన్ వ్యోమగాములను మరోసారి చంద్రునిపైకి పంపాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కావున వారికి చంద్రుడిపైన అధిక డ్రైవ్ పరిధి కలిగిన రోవర్లు చాలా ఉపయోగపడతాయి. ఈ రోవర్లు పరీక్షా పనులకు ఎక్కువ సమయం సహకరిస్తాయని కూడా నిపుణులు భావిస్తున్నారు.

MOST READ:లాక్‌డౌన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ బిజినెస్ మ్యాన్[వీడియో]

చంద్రుడిపైకి జనరల్ మోటార్స్ మూన్ రోవర్స్; పూర్తి వివరాలు

కొత్త మూన్ రోవర్స్ మునుపటి కంటే మరింత సురక్షితంగా ఉండే పరికరాలతో తయారుచేయబడతుంది. కావున అంతరిక్షంలో వ్యోమగాములకు చాలా ఉపయోగపడతాయి. కావున జనరల్ మోటార్స్ కంపెనీ త్వరలో ఈ ప్రాజెక్టు కింద కొత్త రోలర్లను తీసుకురానుంది.

Most Read Articles

English summary
General Motors Rovers To Land On Moon. Read in Telugu.
Story first published: Friday, May 28, 2021, 16:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X