కరోనా ఎఫెక్ట్ : అమెరికాకు వెంటిలేటర్లను సరఫరా చేయనున్న GM సంస్థ

చైనాలో పుట్టిన భయంకరమైన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఇప్పటికే 80,000 పైగా ప్రజల ప్రాణాలను తీసింది. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 లక్షలకు పైగా కరోనా వైరస్ భారిన పడ్డారు. భారతదేశంలో కూడా చాలామంది కరోనా వైరస్ ప్రభావానికి లోనయ్యారు.

ఈ కరోనా వైరస్ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ లాక్ డౌన్ సమయంలో చాలా ఆటో పరిశ్రమలు మూసివేయబడ్డాయి. కానీ వైరస్ భాధిలకు సహాయం చేయాడానికి వైద్య పరికరాలను తయారు చేస్తున్నారు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. !

కరోనా ఎఫెక్ట్ : అమెరికాకు వెంటిలేటర్లను సరఫరా చేయనున్న GM సంస్థ

ప్రపంచ దేశాలలో ఇప్పటికే చాలా దేశాలలో ఉన్న ఆటో పరిశ్రమలు ఇప్పటికే వైద్య పరికరాలను తయారు చేస్తున్నాయి. ఇప్పుడు తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్న కరోనావైరస్ రోగులకు చికిత్స చేయడానికి అవసరమైన వెంటిలేటర్లను తయారు చేయడానికి యునైటెడ్ స్టేట్స్ బుధవారం వాహన తయారీదారు అయిన జనరల్ మోటార్స్ కు 489.4 మిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టును ఇచ్చింది.

కరోనా ఎఫెక్ట్ : అమెరికాకు వెంటిలేటర్లను సరఫరా చేయనున్న GM సంస్థ

ఆరోగ్య మరియు మానవ సేవల ఒప్పందం రక్షణ ఉత్పత్తి చట్టం ప్రకారం వెంటిలేటర్స్ ఉత్పత్తి చేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంస్థలను మహమ్మారిపై పోరాడటానికి అవసరమైన పరికరాలను ఉత్పత్తి చేయాలని కోరారు.

కరోనా ఎఫెక్ట్ : అమెరికాకు వెంటిలేటర్లను సరఫరా చేయనున్న GM సంస్థ

ఒప్పందం ప్రకారం 30,000 వెంటిలేటర్లను యుఎస్ ప్రభుత్వానికి ఆగస్టు చివరి నాటికి పంపిణీ చేయడానికి జిఎం వెంటిలేటర్ సంస్థ వెంటెక్ లైఫ్ సిస్టమ్స్ తో కలిసి పని చేస్తుంది. జూన్ 1 నాటికి మొదటి 6,132 వెంటిలేటర్ల డెలివరీ జరుగుతాయని కంపెనీ తెలిపింది.

కరోనా ఎఫెక్ట్ : అమెరికాకు వెంటిలేటర్లను సరఫరా చేయనున్న GM సంస్థ

జిఎమ్ సంస్థ ప్రభుత్వ ఒప్పందాన్ని నెరవేరుస్తుందని, అంతే కాకుండా అవసరమైతే ఎక్కువ సరఫరా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అని జిఎమ్ ప్రతినిధి జిమ్ కెయిన్ తెలిపారు. ఈ ఒప్పందంలో ప్రతి యూనిట్‌కు మద్దతుగా వినియోగ వస్తువులు మరియు ఉపకరణాలను తయారు చేస్తుంది.

కరోనా ఎఫెక్ట్ : అమెరికాకు వెంటిలేటర్లను సరఫరా చేయనున్న GM సంస్థ

దీని గురించి జిఎమ్ వైస్ ప్రెసిడెంట్ జెరాల్డ్ జాన్సన్ గత నెలలో రాయిటర్స్‌తో మాట్లాడుతూ వాహన తయారీదారులు వెంటిలేటర్లను ఉత్పత్తి చేస్తున్నందున రీటూలింగ్ ఖర్చుల కోసం పదిలక్షల ఖర్చు చేస్తున్నారని, మరియు సరఫరాదారు రీటూలింగ్ ఖర్చులు కోసం వందల మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని తెలిపారు.

కరోనా ఎఫెక్ట్ : అమెరికాకు వెంటిలేటర్లను సరఫరా చేయనున్న GM సంస్థ

జనరల్ ఎలక్ట్రిక్ కో యొక్క హెల్త్‌కేర్ యూనిట్ సహకారంతో మిచిగాన్‌లోని ఒక ప్లాంట్‌లో, వచ్చే 100 రోజుల్లో 50,000 వెంటిలేటర్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఫోర్డ్ మోటార్స్ గత వారం ప్రకటించింది.

కరోనా ఎఫెక్ట్ : అమెరికాకు వెంటిలేటర్లను సరఫరా చేయనున్న GM సంస్థ

కరోనా ఇప్పుడు అమెరికా వంటి అగ్ర రాజ్యంలో కూడా విలయతాండవం చేస్తోంది. ఈ కారణంగా అమెరికాలో రోజు రోజుకి కరోనా మరణాలు పెరిగిపోతున్నాయి . కేవలం నిన్న ఒక్కరోజులోనే 1,900 మందికి పైగా మరణించారు. ఈ మరణాల సంఖ్యను తగ్గించడానికి భారతదేశం యొక్క సహాయం కూడా కోరింది. ఏది ఏమైనా ఇంక కొద్దీ రోజుల్లోనే కరొనాని పూర్తిగా నివారించడానికి అమెరికా తగిన సన్నాహాలను చేస్తుంది.

Most Read Articles

English summary
GM to supply 30,000 ventilators in $500 mln U.S. contract. Read in Telugu.
Story first published: Thursday, April 9, 2020, 13:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X