వేలంలో రూ.3.10 లక్షల ధర పలికిన 'ఏకె-47'

AK-47 Car
ఛండీగడ్‌లో ఏకె-47 ధర ఏకంగా రూ.3.10 లక్షల వెల పలికింది. ఏకె-47 అంటే మెషీన్ గన్ కాదండోయ్.. అదొక రిజిస్ట్రేషన్ నెంబర్. సాధారణంగా వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లను కోరుకునే వారిని మనం చూస్తూనే ఉంటాం. ఈ ఫ్యాన్సీ నెంబర్ల కోసం కొనుగోలుదారులు ఎంత సొమ్ము అయినా చెల్లించేందుకు వెనుకాడరు. అలాంటిదే ఈ ఫ్యాన్సీ నెంబర్. ఛండీఘడ్‌ ఆర్టీవో అధికారులు ఈ నెంబరును వేలానికి ఉంచారు.


సాధారణంగా రిజిస్ట్రేషన్ నెంబర్‌కు అయ్యే ఖర్చు రూ.10,000. అయితే, వేలంలో ఏకె-47 నెంబర్ ఏకంగా రూ.3.10 లక్షల వెల పలికింది. పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ నెంబర్‌ను సొంతం చేసుకున్నారు. తన లగ్జరీ కారు కోసం ఈ నెంబర్‌ను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. ఇది చంఢీఘడ్‌లో ప్రారంభించిన లేటెస్ట్ నెంబర్ సిరీస్. దీని పూర్తి నెంబర్ 'సిహెచ్01-ఏకె-0047'. ఏకె-47 అనేది అత్యంత ప్రాచుర్యం పొందిన మారణాయుధం పేరు.


కానీ, ఏకె-56 నెంబర్ కూడా ఇలాంటి ఆయుధం పేరే. అయితే, ఈ నెంబర్ మాత్రం కేవలం రూ.10,000 లకే అమ్ముడుపోయింది. చంఢీఘడ్ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ అధికారులు నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో 0007 నెంబర్ రూ.4.21 లక్షలకు, 0005 నెంబర్ రూ.3.25 లక్షలకు మరియు 0001 నెంబర్ రూ.3.1 లక్షలకు అమ్ముడుపోయాయి.93 ఫ్యాన్సీ నెంబర్ల విక్రయం ద్వారా సుమారు రూ.48 లక్షలకు పైగా సొమ్మను ఛండీఘడ్ అధికారులు సొంతం చేసుకున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, October 12, 2011, 15:27 [IST]
English summary
How much would you pay to get yourself an AK 47? Well it was recently sold for just Rs.3.1 lakhs at an open auction in Chandigarh, Punjab. Do not be shocked to know that automatic machine guns are being openly auctioned now. It is not the Kalashnikow machine gun that was auctioned. Rather it was just the registration number plate for a car. The Punjab road transport authorities held an auction of fashionable number plates and the number plate bearing AK 47 was sold for RS.3.1 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+