గూగుల్ స్ట్రీట్ వ్యూ టెక్నాలజీతో మొత్తం చూసేయండి!

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద క్రూయిజ్ షిప్ 'అల్యూర్ ఆఫ్ ది సీస్'. మీకు ఈ షిప్పును సందర్శించడానికి సమయం లేదా లేక అంత భారీ మొత్తాన్ని వెచ్చించి ఇందులో ప్రయాణించే స్థోమత లేదా..! చింతించకండి, ఇప్పుడు ఇంట్లో కూర్చునే మీరు ఈ ఓడలోని సౌకర్యాలన్నింటినీ తిలకించవచ్చు. అత్యంత విలాసవంతమైన ఈ క్రూయిజ్‌లోని సకల సౌకర్యలాను మీ కళ్ల ముందించింది గూగుల్ స్ట్రీట్ వ్యూ.

ఇప్పటి వరకు రోడ్లకు (భమిపై) మాత్రమే పరిమితమైన గూగుల్ స్ట్రీట్ వ్యూ ఇప్పుడు ఓడెక్కింది. గూగుల్ క్రూయిజ్ వ్యూ పేరుతో అల్యూర్ ఆఫ్ ది సీస్ క్రూయిజ్ షిప్‌లోని సౌకర్యాలను, ఫీచర్లను కస్టమర్లకు పరిచయం చేసేందుకు ఆ ఓడ యాజమాన్యం రాయల్ కరేబియన్ ఓ 360 డిగ్రీ విర్చ్యువల్ టూర్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ టూర్ సాయంతో మనం మన స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ సాయంతో ఈ షిప్పులోని విశేషాలన్నింటినీ చూసేయొచ్చు.

మరి ఆలస్యమెందుకు ఈ ఫొటో ఫీచర్‌ను తిరగేయండి మరి..!

అల్యూర్ ఆఫ్ ది సీస్

తర్వాతి స్లైడ్‌లలో అల్యూర్ ఆఫ్ ది సీస్ క్రూయిజ్ షిప్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.

అల్యూర్ ఆఫ్ ది సీస్

రాయల్ కరేబియన్‌కు చెందిన 'అల్యూర్ ఆఫ్ ది సీస్' క్రూయిజ్ షిప్ ప్రపంచంలో కెల్లా అత్యంత పెద్ద షిప్. దీని మొత్తం బరువు 2,25,282 టన్నులు. ఇందులో 5400 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 6360 ప్రయాణీకులు).

అల్యూర్ ఆఫ్ ది సీస్

దీని మొత్తం పొడవు 1181.167 అడుగులు. దీనిని తొలిసారిగా 2010వ సంవత్సరంలో పరిచయం చేశారు. దీని వేగం గంటకు 41.9 కిలోమీటర్లు. మహా సముద్రంపై మహా నగరాన్ని తలపించేలా ఇందులో సౌకర్యాలుంటాయి.

అల్యూర్ ఆఫ్ ది సీస్

షాపింగ్ స్ట్రీట్, మెగా డైనింగ్ రూమ్, ఐస్ స్కేటింగ్ రింక్, కాఫీ షాప్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, సర్ఫింగ్ స్టిమ్యులేటర్, రాక్ క్లైంబింగ్ వాల్, 1,340 సీట్ల సామర్థ్యం గల థియేటర్, స్విమ్మింగ్‌పూల్, చిన్న పిల్లల కోసం ప్లేయింగ్ జోన్స్, ఇంటర్నెట్ కెఫే, కంప్యూటర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, వీడియో గేమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులోని సౌకర్యల జాబితాకు అంతం అంటూ ఉండదు.

అల్యూర్ ఆఫ్ ది సీస్

ఇవన్నీ వింటుంటే, మీకు ఈ షిప్‌ను ఎక్కాలనుందా..? దీని కోసం అంత దూరం వెళ్లటం ఎందుకు.. ఇదిగో ఈ లింక్‌పై క్లిక్ చేసి విర్చ్యువల్ టూర్ చేయండి..!

http://www.royalcaribbean.co.uk/google-street-view-cruise-ship/

వయాసిస్ ఆఫ్ ది సీస్

ఇది కూడా చూడండి: వయాసిస్ ఆఫ్ ది సీస్ అందాలు

More from DriveSpark

Article Published On: Wednesday, July 9, 2014, 12:52 [IST]
English summary
Royal Caribbean has revealed the world's first, exclusive "access all areas" tour onboard Allure of the Seas, using Google Street View technology.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+