త్వరలో మార్కెట్లోకి రానున్న రైనో ఎలక్ట్రిక్ యునిసైకిల్

రోడ్డుపై వెళ్లే వారి దృష్టిని మీ వైపుకు తిప్పుకోవాలనుకుంటున్నారా..? అయితే, మీరు ఇందు ఏ ఫెరారీ కారును లేక లాంబోర్గినీ కారును రైడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ సింగిల్ వీల్ వాహనంపై సవారీ చేస్తే సరిపోతుంది. ఈ ఫోటోలో కనిపించే విచిత్రమైన వాహనం పేరు 'రైనో ఎలక్ట్రిక్ యునిసైకిల్'. సెల్ఫ్‌బ్యాలెన్సింగ్ ప్రిన్సిపల్ ఆధారంగా చేసుకొని ఈ సింగిల్ వీల్ వాహనాన్ని రూపొందించారు.


చూడటానికి సింగిల్ వీల్ సెగ్‌వే మాదిరిగా ఉండే ఈ యునిసైకిల్‌ను పోర్ట్‌లాండ్‌కు చెందిన రైనో అనే కంపెనీ డిజైన్ చేసింది. రైనో ఎలక్ట్రిక్ యునిసైకిల్ బ్యాటరీ పవర్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 25 ఇంచ్‌ల మందం కలిగిన వెడల్పాటి టైర్‌ను ఉపయోగించారు. దీని చక్రంలోనే బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్‌లను అమర్చారు. ఇది ఒకే సీట్‌ను కలిగి ఉండి హ్యాండిల్‌ బార్‌పై బ్రేక్స్, యాక్సిలరేటర్, హ్యాండిల్ ఫ్రేమ్‌కు హెడ్‌ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్‌లను అమర్చారు.

లిథియం ఫాస్పేట్ బ్యాటరీ పవర్‌తో నడిచే ఈ రైనో ఎలక్ట్రిక్ యునిసైకిల్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 20 మైళ్ల దూరం ప్రయాణించవచ్చు. ఇది గరిష్టంగా 20 మైళ్ల వేగంతో పరిగెడుతుంది. ఒకే చక్రం ఉన్నప్పటికీ దీనిని నడపటం పెద్ద కష్టమైన పనేం కాదు. దీని తయారీలో బ్యాలెన్సింగ్‌ సూత్రాలను ఉపయోగించారు. ఈ యునిసైకిల్‌కు స్టాండ్ అవసరం కూడా లేదు. దీని ఖరీదు 4500 అమెరికన్ డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.2 లక్షలకు పైమాటే). 2013 ప్రధమార్థంలో ఇది మార్కెట్‌ను తాకొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Tuesday, July 10, 2012, 17:07 [IST]
English summary
Ryno Electric Unicycle is expected to hit the markets in the first half of 2013. This self balancing vehicle runs on a Li-ion phosphate battery pack with a range of 20 miles in a single charge. It can speeds upto 20 mph. Ryno Electric Unicycle price is expected to around $4500.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+