జోరువానలో ప్రమాదకరంగా కారులో ప్రయాణించిన యువకులు; రూ. 62,000 ఫైన్

భారతదేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది మరణిస్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. ఈ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం. చాలా మంది వాహనదారులు మితిమీరిన వేగంతో నిర్లక్యమైన డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల భారిన పడుతున్నారు.

జోరువానలో ప్రమాదకరంగా కారులో ప్రయాణించిన యువకులు; రూ. 62,000 ఫైన్

దేశ వ్యాప్తంగా జరిగే ఇటువంటి సంఘటనలు నిలువరించడానికి పోలీసులు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఇటువంటి చట్ట వ్యతిరేఖ చర్యలను నివారించలేకపోతున్నారు. ఇటీవల కాలంలో ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో కొంతమంది యువకులు కురుస్తున్న వర్షంలో, కారులో ప్రయాణిస్తూ కారు యొక్క డోర్ విండోలపై కూర్చుని హల్ చల్ చేస్తున్నారు.

జోరువానలో ప్రమాదకరంగా కారులో ప్రయాణించిన యువకులు; రూ. 62,000 ఫైన్

ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. పోలీసులు ఈ వీడియో ఆధారంగా ఆ యువకులపై చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే వారికి దాదాపు రూ. 62,000 జరిమానా విధించారు. దీనికి సంబంధించిన వీడియో మీరు ఈ ఆర్టికల్ లో చూడవచ్చు.

జోరువానలో ప్రమాదకరంగా కారులో ప్రయాణించిన యువకులు; రూ. 62,000 ఫైన్

నివేదికల ప్రకారం ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో పబ్లిక్ రోడ్డుపై ఇలాంటి చట్ట వ్యతిరేఖ చర్యకు పాల్పడిన యువకులపై నగర పోలీసులు చర్య తీసుకున్నారు. రోడ్డు నియమాల ప్రకారం ప్రజా రహదారిపై వాహనాల ద్వారా స్టంట్ చేయడం చట్టవిరుద్ధం. అయితే ఈ వీడియోలో యువకులు కారు విండోపై కూర్చుని ప్రమాదకరంగా ప్రయాణించారు.

జోరువానలో ప్రమాదకరంగా కారులో ప్రయాణించిన యువకులు; రూ. 62,000 ఫైన్

ఈ వీడియోలో యువకులకు ఇది ఒక సరదా అనిపించవచ్చు, కానీ ఇది చూసేవారిని భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఒక వేళా అనుకోని ప్రమాదం సంభవిస్తే, ప్రాణాంతకమవుతుంది. ఈ రకమైన ప్రయాణం వారికి మాత్రమే కాకుండా రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులకు కూడా ప్రమాదం కలిగిస్తుంది. ఈ కారణంగానే ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు.

జోరువానలో ప్రమాదకరంగా కారులో ప్రయాణించిన యువకులు; రూ. 62,000 ఫైన్

మీరు ఈ వీడియోలో నిశితంగా పరిశీలిస్తే, ఇందులోని యువకుల బృందం మూడు కార్లలో ప్రయాణించినట్లు తెలుస్తుంది. ఈ మూడు కార్లలో ప్రయాణించిన యువకుల వయసు దాదాపు 20 సంవత్సరాల లోపు ఉన్నట్లు తెలుస్తుంది. వీరిని పోలీసులు అదుపులోకి దీసుకుని విచారించినప్పుడు వారిలో కొంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తెలిసింది.

ఈ విధంగా డ్రైవింగ్ చేసినందుకు గజియాబాద్ నగర పోలీసులు వాహనదారులకు భారీ జరిమానా విధించారు. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేయడమే కాకుండా, ఈ యువకులు సైరన్‌ను కార్లలో కూడా ఉపయోగించారు. ఈ వీడియోలో యువకులు ప్రయాణిస్తున్న కార్ల నుండి వచ్చే సైరన్‌లను మీరు కూడా వినవచ్చు.

జోరువానలో ప్రమాదకరంగా కారులో ప్రయాణించిన యువకులు; రూ. 62,000 ఫైన్

అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు మరియు అగ్నిమాపక వాహనాల వంటి అత్యవసర సర్వీస్ చేసే వాహనాలలో మాత్రమే సైరన్ ఉపయోగించాలని నిబంధనలు ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు కూడా సైరన్ వంటివి ఉపయోగించడం విరుద్ధం. కావున రాజకీయ నాయకులూ కూడా సైరన్ ఉపయోగించరు.

జోరువానలో ప్రమాదకరంగా కారులో ప్రయాణించిన యువకులు; రూ. 62,000 ఫైన్

ఈ యువకులు రోడ్డు దాటుతున్నప్పుడు ఇతర వాహనదారుల కంటే ముందుండాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన గత ఆదివారం జరిగింది. ప్రయాణిస్తున్న వాహనంలో ఉన్న యువకుడు ఈ ఘటనను రికార్డ్ చేసి వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో ఇప్పటికే చాలా మంది షేర్ చేసారు. ఈ వీడియో ఘజియాబాద్ పోలీసుల దృష్టికి వచ్చిన వెంటనే, యువకులు వారిపై చర్యలు తీసుకున్నారు.

జోరువానలో ప్రమాదకరంగా కారులో ప్రయాణించిన యువకులు; రూ. 62,000 ఫైన్

వైరల్ వీడియోల ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఒక యువ జంట రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై ప్రయాణిస్తున్న వీడియో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

జోరువానలో ప్రమాదకరంగా కారులో ప్రయాణించిన యువకులు; రూ. 62,000 ఫైన్

అదనంగా, వైరల్ వీడియో ఆధారంగా మారుతి సుజుకి వితారా బ్రాజా యజమానిపై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘకులను గుర్తించడానికి ప్రధాన రహదారులపై సీసీటీవీలు ఏర్పాటు చేయబడ్డాయి. కొన్నిసార్లు ఈ సీసీటీవీలు సరిగ్గా పనిచేయడం లేదు.

జోరువానలో ప్రమాదకరంగా కారులో ప్రయాణించిన యువకులు; రూ. 62,000 ఫైన్

కొంతమంది వాహనదారులు ఎవరూ పట్టించుకోరు అనే నెపంతో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. కానీ రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనల సంఘటనలను రికార్డ్ చేసి, వాటిని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో అప్‌లోడ్ చేస్తారు. ఇవి వైరల్ అయిన తరువాత పోలీసులకు చేరతాయి. దీని ఆధారంగా పోలీసులు వాహన యజమానిని గుర్తించి చర్యలు తీసుకున్నారు.

జోరువానలో ప్రమాదకరంగా కారులో ప్రయాణించిన యువకులు; రూ. 62,000 ఫైన్

2019 లో అమల్లోకి వచ్చిన కొత్త మోటార్ వాహన చట్టం ప్రకారం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానా విధించబడుతుంది. కొత్త మోటార్ వాహన చట్టం ప్రకారం, మద్యం సేవించిన డ్రైవర్లు రూ. 10,000 విధించబడుతుంది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహన చోదకులు 1,000 జరిమానా విధించబడుతుంది. ఈ వీడియోలో సరదాగా కారులో ప్రయాణిస్తున్న యువకులకు కూడా కొత్త మోటార్ వాహన చట్టం కింద భారీగా జరిమానా విధించబడుతుంది. కావున వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ నియమాలను పాటించాలి.

NOTE: ఇక్కడ ఉపయోగించిన కొన్ని ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే.

Most Read Articles

English summary
Ghaziabad police imposes rs 62000 fine on youths for driving dangerously in rain video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X