ఎలాంటి ప్రాంతాల్లోనైనా ప్రయాణించే ఘేవో రెస్క్యూ వెహికల్
రెస్క్యూ వాహనాలను ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ప్రత్యేకించి కొండ చరియలు విరిగిపడినప్పుడు, తుఫానులు, వరదలు సంభవించినప్పుడు, మంచు వర్షం కురిసినప్పుడు ఇలా వివిధ రకాల ప్రకృత్తి విపత్తులు సంభవించినప్పుడు రెస్క్యూ వాహనాల ఆవశ్యకత ఎంతో అవసరం. అయితే, కొన్ని రకాల రెస్క్యూ వాహనాలను అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉండవు.
కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెస్క్యూ వెహికల్ మాత్రం అన్ని రకాల వాతావరణలను తట్టుకొని, ఆపద సమయంలో ఉన్న వారిని ఆదుకుటుంది. అదే ఈ ఘేవో రెస్క్యూ (Ghe-O Rescue) వెహికల్. ఈ ఘేవో రెస్క్యూ ట్రక్కును రోమానియాకు చెందినది. ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత విశిష్టమైన బహుముఖ కార్యకలాపాలు నిర్వహించే రెస్క్యూ ట్రక్ కావటం విశేషం. అత్యవసర పరిస్థితుల్లో ఇది ఎలాంటి ప్రాంతాల్లో/రోడ్లపై నైనా పరుగులు తీస్తుంది.

రోమానియన్ కంపెనీ ఘేవో మోటార్స్‌కు చెందిన లేటెస్ట్ వాహనమే ఈ ఘేవే రెస్క్యూ. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి రోడ్లపైనైనా సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఈ రెస్క్యూ వాహనాన్ని ఓ ట్రక్కు ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. ఇందులో హెవీ డ్యూటీ ట్రాన్సిమిషన్ ఉంటుంది. అంతేకాకుండా, అసాధ్యమైన టెర్రైన్‌లపై కూడా ట్రావెల్ చేసేలా ఇందులో లాకబల్ యాక్సిల్స్ ఉంటాయి.

ఘేవో రెస్క్యూ వెహికల్ 5.2 మీటర్ల పొడవును, 2.7 మీటర్ల వెడల్పును, 2.39 మీటర్ల ఎత్తును మరియు 3.2 టన్నుల బరువును కలిగి ఉంటుంది. అయినప్పటికీ, ఇది హమ్మర్ హెచ్1 కన్నా 200 కేజీలు తక్కువ బరువును కలిగి ఉంటుంది.

ఇది చిన్న టూ సీటర్ ఏటివి కార్గో ట్రక్కు కన్నా మరింత ఉత్తమంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఈ రెస్క్యూ ట్రక్కులో 11 మందికి చోటు ఉంటుంది.

ఈ వాహనంలో 340 హెచ్‌పిల నుంచి 500 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే పెట్రోల్ ఇంజన్లను లేదా 218 హెచ్‌పిల నుంచి 304 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే డీజిల్ ఇంజన్లను ఉపయోగించుకోచ్చు. దీనిలోని ఎలక్ట్రికల్ సిస్టమ్‌ను రక్షించేందుకు దీనికి ఆప్షనల్‌గా ఎలక్ట్రోమేగ్నటిక్ అండ్ వాటర్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను ఫిక్స్ చేసుకోవచ్చు.

అన్ని రకాల టెర్రైన్‌లపై ప్రయాణించి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం ఈ ఘేవో రెస్క్యూ ట్రక్కు ప్రత్యేకత. అంతేకాకుండా, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రయోజనం కోసం ఇందులో 620 లీటర్ల వాటర్ ట్యాంక్, పంప్స్ ఉంటాయి. జారుడు స్వభావం కలిగిన టెర్రైన్లపై వెనుక టైర్లను తొలగించి వాటి స్థానంలో ట్రాక్స్‌ను అమర్చుకోవచ్చు. అలాగే నీటిపై తేలేందుకు నాలుగు టైర్లకు న్యుమాటిక్ ఫ్లోటబల్స్‌ను కట్టుకోవచ్చు.
ఘేవో రెస్క్యూ వాహనంపై రూఫ్-మౌంటెడ్ కార్గో స్పేస్ కూడా ఉంటుంది. అలాగే మంచుతో నిండిన రోడ్లను క్లీన్ చేసుకుంటూ పోవటానికి ఓ స్నో ప్లో, మెడికల్ స్ట్రెచ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. దీని పనితీరును చూపించే వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి.


Click it and Unblock the Notifications








