Ghost ట్రక్కు కెమెరాలో కనిపించిన దెయ్యం.. వీడియో వైరల్
ఇంటర్నెట్ పుణ్యమా అని ఇప్పుడు అన్ని కొత్త కొత్త విషయాలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ప్రతిరోజు జరుగుతున్న వింత వింత ఘటనలు అరచేతిలో ఇట్టే వచ్చి వాలుతున్నాయి. ఇది వరకు మనకు తెలియకుండా ఎన్నో సంఘటనలు జరిగినా చెప్పుకోవడానికి మాత్రమే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
మారిన కాలం కారణంగా సీసీ కెమెరాలు, కారు లేదా ఇతర వాహనాల్లో ఉన్న డాష్ బోర్డుల కారణంగా ఏదైనా ప్రమాదాలు లేదా కొత్త సంఘటనలు ఇట్టే తెలిసిపోతున్నాయి. ఒళ్ళు గగుర్పాటుకు గురయ్యే సంఘటనలతో పాటు మంచి అనుభూతిని కలిగించే విషయాలు రోజుకు ఎన్నో వీడియోల రూపంలో చూస్తూ ఉన్నాం. ఓ డ్రైవర్ కు ఎదురైన వింత అనుభవాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..

ట్రక్కు కెమెరాలో..
ఆన్‌లైన్‌లో చాలా మంది భయపెట్టిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. USలోని అరిజోనాలో రూట్ 87లో గగుర్పాటు కలిగించే దెయ్యం లాంటి ఓ బొమ్మ ట్రక్కు డాష్ బోర్డ్ లో ప్రత్యక్షమయ్యింది. ఆ వివరాలు టైమ్ తో సహా ట్రక్కు డ్రైవర్ డాష్‌క్యామ్‌లో వివరంగా నమోదు అయ్యాయి.
మీరు నిజంగా వింత వీడియోలపై ఆసక్తి కలిగి ఉంటే, మీరు ఈ క్లిప్‌ని తప్పక చూడాల్సిందే. అమెరికాలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్‌లలో ఒకటిగా భావించే రహదారిపై నిలబడి ఉన్న దెయ్యం బొమ్మ కనిపించింది. విలియం చర్చ్ అనే వ్యక్తి USలోని అరిజోనాలో రూట్ 87లో డ్రైవింగ్ చేస్తు ఇంటికి చేరుకున్నాడు. అనంతరం అతను తన డాష్‌క్యామ్ ఫుటేజీని తనిఖీ చేసినప్పుడు విస్తుపోయే విజువల్స్ ను చూసి ఆశ్చర్య పోయాడు.
అచ్చం దెయ్యాన్ని పోలినట్లు..
తను ప్రయాణించిన ట్రక్ లో ఉన్న విజువల్స్ పూర్తిగా దెయ్యాని పోలినట్లు ఉండటం చూసి అవాకయ్యాడు. దీంతో షాక్ కు గురైన అతను కొన్ని రోజుల వరకు దీనిపై అలోచించలేదు. తాజాగా ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు టక్కున వేలేసుకుంటున్నారు.
ఈ వీడియోలో విలియం రాత్రిపూట రోడ్డు పక్కన నిలబడి ఉన్న గగుర్పాటు కలిగించే వ్యక్తిని గుర్తించాడు. అయితే, అతను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, అతను 287-మైళ్ల మార్గంలో ఎవరినీ చూడలేదని అతను తెలిపాడు. అంత నిర్మానుష్య రోడ్డుపై ప్రయానించినందుకు ఇప్పుడు చాలా భయపడుతున్నట్లు వివరించాడు. నిజంగా ఆ రోడ్డుపై ప్రయాణం సాహసమనే చెప్పాలి అని అన్నాడు.
తాజాగా వెల్లడి..
అతను గగుర్పాటు కలిగించే ఫుటేజీని తాజాగా ఆన్‌లైన్‌లో పంచుకున్నాడు. అది చాలా మంది దృష్టిని ఆకర్షించింది. నేను వెళ్ళినప్పుడు ఆ బొమ్మ రోడ్డు మార్గంలో నిలబడి ఉంది. మీరు బొమ్మను తయారు చేస్తున్న కాళ్ళ ద్వారా రేఖలను చూడవచ్చు. అని విలియం ఫాక్స్ న్యూస్‌తో అన్నారు.
ఉత్తరం పేసన్ నుంచి దక్షిణ టక్సన్ వరకు ఉన్న ఈ రహదారి చాలా భయాన్ని కలిగిస్తుందని ఓ దెయ్యం వేటగాడు అన్నాడు. ఇవే ప్రదేశంలో చాలా సందర్భాల్లో వీటిని గుర్తించినట్లు తెలిపారు. అయితే అవన్నీ వట్టి మాటలే అని పేర్కొన్నారు. తాజాగా వెల్లడైన ఈ వీడియోతో ఈ రోడ్డుపై ప్రయాణించే వారు భయాందోళనకు గురవుతున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








