గొడుగు సైజులో మడుచుకునే హబ్‌లెస్ సైకిల్!
మనం ఇప్పటికే అనేక రకాల ఫోల్డింగ్ సైకిళ్లను చూశాం. ఇలాంటి రెగ్యులర్ ఫోల్డింగ్ సైకిళ్లను ఫోల్డ్ చేసినప్పటికీ, అవి కాస్తం ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంటాయి. కానీ, ఇప్పుడు ఈ కథనంలో మనం చూడబోయే ఫోల్డింగ్ సైకిల్ మాత్రం చాలా విశిష్టమైనది. దీనిని మడిస్తే, కేవలం ఓ పెద్ద గొడుగు పరిమాణంలోకి మారిపోతుంది.
ఈ సైకిల్ పేరు 'సడా బైక్', ఇదొక ఫుల్ సైజ్ 26 ఇంచ్ హబ్‌లెస్ వీల్స్ కలిగిన సైకిల్. ఇటాలియన్ డిజైనర్ గిన్లూకా సడా దీనిని తయారు చేశాడు. ఈ సైకిల్ ప్రాజెక్ట్‌పై అతను 2008 నుంచి పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితమే ఓ అల్యూమినియం అల్లాయ్ వర్కింగ్ ప్రోటోటైప్‌ను తయారు చేశాడు, ఇప్పుడు అతను ఈ సైకిల్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అతను పెట్టుబడిదారుల కోసం ఎదురు చూస్తున్నాడు.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

సడా బైక్ చక్రాలను తొలగించే ఫోల్డ్ చేస్తే, ఇది గొడుగు పరిమాణంలోకి మడుచుకుంటుంది.

ఈ సైకిల్‌ను మడవటం కూడా చాలా సులువు, సీట్ భాగాన్ని ముందుకు నొక్కితే సైకిల్ ముడుచుకోవటం ప్రారంభిస్తుంది.

ఈ సైకిల్ చక్రాలను మాత్రం మడవటానికి వీలుండదు. ఈ రెండు చక్రాలను విడిగా తీసిపెట్టుకోవాలి.

ఈ సైకిల్‌ను బ్యాగ్‌ప్యాక్‌లో తీసుకువెళ్లొచ్చు. దీని రెండు చక్రాలు బ్యాగ్‌ప్యాక్‌కు సపోర్టింగ్ స్ట్రక్చర్‌గా నిలుస్తాయి.

సడా బైక్ చక్రాలకు హబ్ లేదా స్పోక్స్ వంటివి ఉండవు. దీంతో ఈ బ్యాగ్‌ప్యాక్‌లో మడిచిపెట్టుకున్న బైక్‌తో పాటుగా కొన్ని ఇతర వస్తువులను కూడా తీసుకువెళ్లవచ్చు.

ప్రస్తుతానికి వర్కింగ్ ప్రోటోటైప్ మాత్రమే, దీనిని వాణిజ్య పరంగా ఉత్పత్తి చేసేందుకు పెట్టుబడిదారుల కోసం గిన్లూకా సడా ఎదురుచూస్తున్నాడు.

గిన్లూకా సడా తయారు చేసిన వర్కింగ్ ప్రోటోటైప్ సడా బైక్ కాన్సెప్ట్ ఫొటో.

గిన్లూకా సడా తయారు చేసిన వర్కింగ్ ప్రోటోటైప్ సడా బైక్ కాన్సెప్ట్ ఫొటో.


Click it and Unblock the Notifications








