‘మా నాన్నని కాపాడినందుకు థ్యాంక్యూ' అంటూ కారుకు రాఖీ కట్టిన చిన్నారి.. వైరల్ అవుతున్న వీడియో
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. కష్టసుఖాల్లో, ఆపదల్లో తోడబుట్టినవాడు తోడుగా ఉండాలని ఆశిస్తూ సోదరీమణులు వారి సోదరులకు రాఖీ కట్టడం ఆనవాయితీ.. కానీ ఇక్కడ ఓ చిన్నారి మాత్రం వినూత్నంగా ఓ కారుకు రాఖీ కట్టి సోదరభావాన్ని చాటుకుంది. ఎందుకంటే..
దేశీయ మార్కెట్లో మహీంద్రా కార్లు సేల్స్‌లో దూకుడు కొనసాగిస్తున్నాయి. ప్రయాణికుల కోసం హై సేఫ్టీ భద్రతా ఫీచర్లను అందిస్తూ కస్టమర్లలో మంచి ఆదరణ పొందింది. పలు ప్రమాదాల్లో కూడా మహీంద్రా బ్రాండ్ కార్లు ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ఓ చిన్నారి మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారుకు కట్టి కృతజ్ఞతలు తెలిపింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కొద్ది రోజుల క్రితం మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారు ప్రమాదానికి గురైంది. మహీంద్రా XUV700 పై భారీ కంటైనర్ ట్రక్ పడటంతో కారు పూర్తిగా దెబ్బతింది. కానీ అందులోని ప్రయాణికులు మాత్రం సురక్షితంగ బయటపడ్డారు. ఈ ప్రమాదంలో తన తండ్రి ప్రాణాలను కాపాడినందుకు గాను ఓ పాప.. తమ కారుకు రాఖీ కట్టి సోదరుడిగా స్వీకరించింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ700 గ్రిల్‌కు చిన్న పాప రాఖీ కట్టి కట్టడాన్ని వీడియోలో చూడవచ్చు. రాఖీ కడుతుండగా పాప తండ్రి వెనకాల నించున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఎక్స్‌యూవీ700 పాప తండ్రి తప్ప మరెవరూ లేరు. యాక్సిడెంట్ సమయంలో కారు యజమాని పెద్దగా గాయాలు కాకుండా సురక్షితంగా బయటకు వచ్చాడు.

తన తండ్రి ప్రాణాలను కాపాడినందుకు గాను మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారుకు ఆ చిన్నారి రాఖీ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అసలైన సోదరభావం ఇదేనంటూ కామెంట్ చేశారు. ఈ వీడియోతో ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేశారు.
కొద్ది రోజుల క్రితం పూర్తిగా డ్యామేజ్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ700ని ఓ సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ట్రక్కు భారీ బరువును కారు పైకప్పు ఆపి ప్రయాణికులను రక్షించిందని వీడియోలో పేర్కొన్నారు. భారీ డ్యామేజ్ జరిగినా కారు ఇంజిన్, స్టీరింగ్, ట్రాన్స్‌మిషన్ సక్రమంగా పనిచేయడం ఆశ్చర్యకరంగా ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల వాహనాన్ని టో ట్రక్‌లో షోరూమ్‌కు డెలివరీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇటీవల కంటెయినర్ లారీ లోడుతో వెళ్తుండగా.. మార్గమధ్యలో లారీ చెడిపోవడంతో రోడ్డు పక్కన నిలిపి మరమ్మతులు చేస్తున్నారు. హైడ్రాలిక్ జాక్ పెట్టి లారీని కాస్త పైకి లేపినట్లు సమాచారం. అదే సమయంలో, ట్రక్ కంటైనర్ అదుపు తప్పి అటుగా వెళుతున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 700పై బోల్తా పడింది.
ప్రమాదంలో XUV 700 పిల్లర్లు కొంత వరకు కూలిపోయాయి. అయినప్పటికీ ట్రక్కు బరువును తట్టుకోగలిగింది. దీంతో కారులో ఉన్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. కారు నాణ్యతే అతన్ని కాపాడిందని చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV 700 SUV ప్రస్తుతం 5 స్టార్ రేటింగ్‌తో భారతదేశంలోని కొన్ని సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 SUV గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో అసాధారణమైన పనితీరు ప్రదర్శించడంతో గ్లోబల్ NCAP నుంచి 'సేఫ్ ఛాయిస్' అవార్డు అందుకుంది. మహీంద్రా చరిత్రలో ఖచ్చితమైన 5 రేటింగ్‌ను సాధించిన రెండవ కారుగా ఇది నిలిచింది. మహీంద్రా XUV 700 బాడీ షెల్‌తో పాటు ఫుట్‌వెల్ ప్రాంతం స్థిరంగా ఉంటుంది..
గ్లోబల్ NCAP పరీక్షలో మహీంద్రా XUV 700 17 పాయింట్లకు 16.03 స్కోర్ చేసింది. క్రాష్ టెస్ట్ ముందు ప్రయాణీకుడికి గాయాలయ్యే అవకాశం తక్కువగా ఉందని ఇది సూచించింది. ముఖ్యంగా, చైల్డ్ సేఫ్టీ టెస్ట్‌లకు గురైనప్పుడు, ఈ కారు ఏ మేడ్ ఇన్ ఇండియా కారు కంటే అత్యధిక స్కోర్ సాధించడం విశేషం.


Click it and Unblock the Notifications








