నదిలో బైక్‌పై అడ్వెంచర్ రైడ్‌కు యువతి యత్నం.. కట్ చేస్తే సీన్ రివర్స్
జావా 42 బాబర్ బైక్(Girl Falls Into River While Riding Jawa 42 Bobber)పై నది దాటేందుకు ప్రయత్నించిన యువతి బైక్ అదుపు తప్పి కిందపడిన సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైరల్ అవుతోంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఈ కథనంలో..
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కారు, బైక్ రేసర్లు ఉన్నారు. అయితే మహిళల డ్రైవింగ్ తీరుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ జరగడం చూస్తూనే ఉంటాం. విచిత్రం ఏమిటంటే.. మహిళలు స్కూటర్లు నడుపుతున్నప్పుడు కాళ్లతో ఆపడం, ఇండికేటర్ లాంటి లైట్లు ఏవీ వాడకుండా స్కూటర్ నడపడం, సైడ్ మిర్రర్స్‌ను వాడకపోవడం లాంటివి చేస్తుంటారు.

అయితే ఇలాంటి సంఘటనలు ఫన్నీ అనిపించినా.. ఇలాంటివి ప్రమాదాలకు దారి తీస్తాయి. ఇలా నిర్లక్ష్యపు, అవగాహన లేని డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరిగిన సంఘటనలు నెట్టింట్లో చూస్తుంటాం. అయితే కొందరు మహిళలు స్కూటర్ మాత్రమే కాదు బైక్స్‌ను కూడా రయ్ రయ్‌మని నడుపుతుంటారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఓ మహిళ బైక్‌పై నది దాటేందుకు ప్రయత్నించి బ్యాలెన్స్ తప్పి నదిలో పడిపోయింది. జమ్మూ కశ్మీర్ నంబర్ ప్లేట్ ఉన్న జావా 42 బాబర్ బైక్‌పై ఓ యువతి నది దాటేందుకు యత్నించింది. కానీ నదిలోకి వెళ్లిన కాసేపటికే బ్యాలెన్స్ కోల్పోయి బైక్‌తో సహా నదిలో పడిపోయింది. అయితే రైడ్ సమయంలో ఆమెతో పాటు బైక్ వెనుక మరో యువకుడు కూడా ఉన్నాడు.

అప్రమత్తమైన ఆ యువకుడు వెంటనే బైక్‌తో పాటు యువతిని పైకి లేపాడు. నదిలో బైక్ నడపడం కాస్త సవాలే అయినప్పటికీ.. ఆ సమయంలో నదిలో నీటి ప్రవాహం అంతగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సులభంగా అతను బైక్ పైకి లేపగలిగాడు. అంతే కాకుండా ఫొటోలను పరిశీలించినట్లయితే.. నదిలో నీరు కేవలం మోకాలి లోతు మాత్రమే ఉందని తెలుస్తోంది.
కాగా బైక్‌పై ఒంటరిగా నది దాటేందుకు ప్రయత్నిస్తే కింద పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరు మాత్రమే నడుపుతుంటే బైక్ బరువు తక్కువగా ఉంటుంది.. అయితే వెనుక సీటులో వ్యక్తి కూర్చోవడంతో బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ.. బైక్ నదిలో బోల్తా పడింది. దీన్ని బట్టి ఈ మహిళ బైక్‌పై నది దాటేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారి అని స్పష్టంగా అర్థమవుతోంది.

అంతేకాకుండా వారు నీటి వేగాన్ని కూడా అంచనా వేయలేకపోయారు. ఈ ఘటనలో బైక్ పిలియన్ సీటుపై కూర్చున్న వ్యక్తి హెల్మెట్ & జాకెట్ సరిగ్గా ధరించగా.. మహిళ హెల్మెట్ కూడా ధరించలేదు. దీన్ని బట్టి ఈ జావా 42 బైక్ యజమాని వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి అని తెలుస్తోంది.
ఏదేమైనా నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలు, నదిని బైక్‌పై దాటుతున్నప్పుడు రైడర్లు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. బైక్‌పై బరువును బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే నదిలో ఎప్పుడూ ఒకే వేగంతో ఒకే పరిమాణంలో నీరు ఉండదని గమనించాలి. దీన్ని అంచనా వేయడంలో విఫలం కావడంతోనే ఆ యువతి బైక్ నదిలో బోల్తా పడింది.
ఇక జావా 42 బాబర్‌ను పరిశీలిస్తే, ఈ బైక్‌లో ప్రత్యేకమైన సీసా గ్రీన్ పెయింట్, గోల్డెన్ స్ట్రిప్స్, కస్టమైజ్డ్ సీట్ మరియు ఎల్లో హెడ్‌లైట్ ఉన్నాయి. ఈ బైక్ 334 సీసీ, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 29.49 bhp పవర్ మరియు 32.7 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








