రోడ్ టాక్స్ కట్టరని సైక్లిస్ట్‌లను గుద్దుతున్న అమ్మడు!

'ఖచ్చితంగా ఓ సైక్లిస్ట్‌ను గుద్ది, అతని సైకిల్ నుంచి పడేసుంటాను. నాకు రోడ్డుపై హక్కు ఉంది, అతను కనీసం రోడ్ టాక్స్ కూడా చెల్లించడు. వెధవ సైక్లిస్ట్‌లు' అని అలాగే 'నేను పొద్దున్నే త్వరగా మేల్కొనాలి.. నా బుజ్జి కారుతో ప్రతిరోజు ఇలా చేయలేను' అంటూ ఎమ్మా వే తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఇలాంటి పిచ్చరాతలు రాస్తే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా..?
ఈ విషయం కాస్తా పోలీసుల దాకా వెల్లింది. దెబ్బకు అమ్మడు తన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేసేసింది. అయినప్పటికీ నోర్‌ఫోక్ పోలీసులు మాత్రం ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రమాదానికి గురైన వ్యక్తి రోబీ హాక్లే. డబ్బున్నోళ్లకు వళ్లు కొవ్వెక్కితే ఇలానే చేస్తారని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications








