బైక్ రైడ్ చేస్తూ.. నెటిజన్ల మనసు దోచేస్తోంది - వీడియో చూస్తే మీకే తెలుస్తుంది
ఏ రంగంలో అయినా.. ఏ పనిలో అయినా మేమం మగవాళ్లకంటే తక్కువ కాదని మహిళలు ముందడుగు వేస్తున్నారు. ఆకాశంలో సగం అన్న ఓల్గా (పోవూరి లలిత కుమారి) మాటలు నియమయ్యే వేళలు దగ్గరపడుతున్నట్లు ప్రస్తుత పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. ఒకప్పుడు వంటింటికి మాత్రమే ఓరిమితమైన మహిళ ఈ రోజు అవలీలగా కార్లు, బైకులు మాత్రమే కాకూండా హెవీ హెలికల్స్ కూడా డ్రైవ్ చేసి శభాష్ అనిపించుకుంటోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ఓ యువతి 'రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650' బైక్ రైడ్ చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి ఎరుపు రంగు చీర ధరించి, రెడ్ కలర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 బైకును రైడ్ చేసుకుంటూ వెళ్లడం చూడవచ్చు. ఇందులో ఆ యువతి అప్పుడప్పుడు బైక్ హ్యాండిల్ వదిలేయడం కూడా గమనించవచ్చు. హెల్మెట్ ధరించి ఉంది. అయితే ఈమె బైక్ రైడ్ వీడియో తీస్తున్న వారికి పోజులిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

రెడ్ కలర్ బైక్ మీద ఎరుపు రంగు చీర ధరించిన అమ్మాయి నెటిజన్ల మనసు దోచేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను లెక్కకు మించిన యూజర్లు లైక్ చేస్తున్నారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో మిశ్రమంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు చాలా అద్భుతంగా బైక్ రైడ్ చేస్తున్నారు అని కామెంట్ చేస్తుంటే.. చీరలో జాగ్రత్తగా రైడ్ చేయాలనీ సలహా ఇస్తున్నారు.
వీడియో మొత్తంలో గమనిస్తే.. బైక్ రైడ్ చేస్తున్న సమయంలో ఆ యువతి మాటిమాటికి బైక్ హ్యాండిల్ బార్ నుంచి చేతులు తీస్తూ ఉంది. కొన్ని సార్లు సింగిల్ హ్యాండుతో బైక్ నడుపుతోంది. ఒక చేత్తో హ్యాండిల్ బార్ పట్టుకుని.. మరో చేత్తో చీర కొంగును చేతికి చుట్టుకుంది. మొత్తం మీద తనదైన భంగిమలతో బైక్ రైడ్ చేస్తూ.. చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు లక్షల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి.

నిజానికి మహిళలు బైక్ రైడింగ్ చేయడం మంచిదే. కానీ చీర కట్టుకుని రైడ్ చేయడం అనేది ప్రమాద హేతువు అవుతుంది. ఎందుకంటే చీర కొంగు పొరపాటును బైక్ చక్రంలో ఇరుక్కుంటే.. ఊహకందని ప్రమాదం జరుగుతుంది. ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో మీరే ఊహించవచ్చు. కాబట్టి బైక్ రైడ్ చేయాలనుకునే వారు రైడింగ్ సూట్ వంటివి ధరించి బైక్ రైడ్ చేయడం ఉత్తమం. లేకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
వీడియోలో కనిపించే యువతి బైక్ రైడ్ చేసే సమయంలో హెల్మెట్ ధరించి ఉంది. కానీ రైడింగ్ సూట్ ధరించలేదు. రోడ్డుపై రైడింగ్ చేసే సమయంలో మధ్యలో హ్యాండిల్ మీద నుంచి చేతులు తీసేస్తోంది. చేతులు బైక్ మీద నుంచి తీసినప్పుడు.. రైడర్ పట్టు కోల్పోతే కిందపడే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఏం జరుగుతుందో మీరే ఊహించుకోవచ్చు. కాబట్టి బైక్ రైడ్ చేసే సమయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.
నిజానికి మహిళలు చీరకట్టులో బైక్ రైడ్ చేయడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే బైక్ రైడింగ్ సమయంలో ప్రమాదాలు జరిగినట్లు ఎక్కడా వెల్లడి కాలేదు. కానీ పలువురు నిపుణులు చీరకట్టులో బైక్ రైడింగ్ ప్రమాదాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. కాబట్టి బైక్ రైడ్ చేసేవాళ్ళు ఎవ్వరైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








