లక్ అంటే ఈ అమ్మాయిదే.. 100 రూపాయలకే 50 లక్షల ఖరీదైన మెర్సిడెస్ బెంజ్, జాక్‌పాట్ కొట్టేసింది.!!
దీపావళి పండుగ భారతీయులకు ఓ సెంటిమెంట్.. పండుగ సమయంలో కొత్త వస్తువును కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవడం అదృష్టంగా భావిస్తారు. అందుకే చాలా మంది కారు కొనుగోలు పట్ల కూడా ఆసక్తి చూపిస్తారు. పండుగ సీజన్‌లో ఆఫర్లు ఉన్నప్పటికీ కొత్త కారు కొనుగోలు చేయాలంటే రూ. లక్షలు వెచ్చించాల్సిందే.. కానీ ఓ విద్యార్థిని మాత్రం రూ. 100 కే లగ్జరీ కారును సొంతం చేసుకుంది.
భారత్‌లో సాధారణ కార్లను కొనుగోలు చేసేందుకు లక్షల్లో ధర ఉంటుంది. అదే ప్రీమియం సౌకర్యాలున్న లగ్జరీ కారును కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 50 లక్షలైనా పెట్టాల్సిందే. కానీ అసోంకి చెందిన ఓ అమ్మాయి మాత్రం రూ. 50 లక్షల ఖరీదైన లగ్జరీ మెర్సిడెస్ బెంజ్(Mercedes Benz) కారును రూ. 100 కే సొంతం చేసుకుని యజమానురాలైంది. అదెలా అంటే..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసోంలోని బార్‌పేటకు చెందిన 17 ఏళ్ల విద్యార్థి దిశా దాస్(Mercedes Benz In Lucky Draw).. ఈ ఖరీదైన లగ్జరీ కారును సొంతం చేసుకోంది. 12 వ తరగతి చదువుతున్న దిశా దాస్.. రూ. 100 కే మెర్సిడెస్ బెంజ్‌ను గెలుచుకుని ఇప్పుడు భారత్ చూపు మొత్తం తన వైపు తిప్పుకుంది. ఇదంతా ఎలా సాధ్యమైందంటే..
దిశా దాస్ ఇటీవల ఓ లక్కీ డ్రా కూపన్‌లో పాల్గొంది. ఈ లక్కీ డ్రా కూపన్ ఫలితాలను తాజాగా ప్రకటించగా.. అందులో దిశా దాస్ గెలుపొందింది. ఈ క్రమంలో లక్కీ డ్రా కూపన్‌లో మొదటి బహుమతిగా దిశా మెర్సిడెస్ బెంజ్ కారును గెలుచుకుని ఔరా అనిపించింది. ధనవంతులు, సెలబ్రిటీలు తమకు గౌరవంగా భావించే మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు ఈ అమ్మాయి సొంతమైంది.

కాగా అసోంకు చెందిన దిశా దాస్.. తల్లిదండ్రులకు ఏకైక కూతురు. రూ. 100 లక్కీ డ్రా కూపన్ ద్వారా తమ కూతురు రూ. 50 లక్షల ఖరీదైన లగ్జరీ మెర్సిడెస్ బెంజ్‌ను సొంతం చేసుకోవడం పట్ల తల్లిదండ్రులు పట్టరాని సంతోషంతో ఉన్నారు. దిశా దాస్ లక్కీ గర్ల్ అంటూ స్థానికులు, బంధువులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బార్పెట్ బుక్ అండ్ సైన్స్ ఫెయిర్ జరగనుంది. ఆ ఎగ్జిబిషన్‌కు ప్రచారం కల్పించేందుకు ఇటీవల లక్కీ డ్రా నిర్వహించగా.. అందులో మొదటి బహుమతి కింద మెర్సిడెస్ బెంజ్ కారు ప్రకటించారు. అయితే ఈ కారు ఎవరికి దక్కుతుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొనగా.. దిశ ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసింది.
దిశా దాస్ మధ్య తరగతి కుటుంబానికి చెందిన బాలిక. సాధారణంగా లక్కీ డ్రా అనగానే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అలాగే దిశా దాస్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించింది. అందులో భాగంగానే తన సేవింగ్స్‌లో నుంచి రెండు కూపన్లను కొనుగోలు చేసింది. వాటిలోని ఓ కూపన్ ద్వారా ఆమె మొదటి విజేతగా నిలిచి లగ్జరీ కారును సొంతం చేసుకుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








