Bike Stunts హ్యాండిల్ వదిలేసి బైక్‌పై ముద్దుల వర్షం కురిపించుకున్న మహిళలు.. కట్ చేస్తే..!

పబ్లిక్ రోడ్లపై చాలామంది ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేస్తూ ఇతరులకు హాని చేస్తున్నారు. ఈ విధమైన స్టంట్స్ రోజుకు ఒకటి దర్శనిమిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఇలాంటి వీడియోలు అన్ని క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి విన్యాసాలు చేసేవారు ఎక్కువగా చదువుకునే యువతే ఉండడం గమనార్హం.

సాధారణంగా ఇలాంటి స్టంట్స్ అబ్బాయిలు ఎక్కువగా చేస్తుంటారు కానీ మనం చూడబోయే వీడియోలో అమ్మాయిలు ఒకరికొకరు కౌగిలించుకుంటూ రోడ్డుపై చేసిన విన్యాసాలు ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. అయితే చట్టం ప్రకారం, పబ్లిక్ రోడ్డుపై కారు లేదా బైక్ ఉపయోగించి స్టంట్ చేయడం నేరం. ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన శిక్షలు విధిస్తారు. ఈ విషయం తెలిసినా చాలా మంది ఇలాంటి విన్యాసాలతో వార్తల్లో నిలుస్తున్నారు.

Girls Kissing on Bike Video

ఇలాంటి స్టంట్స్ చేసేవాళ్లు చివరకు అంగవైకల్యం బారిన పడుతున్నారు. తెలిసి తెలియని వయసులో ఇలాంటి చర్యలకు పూనుకుంటూ హాయిగా కొనసాగుతున్న లైఫ్ లోకి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వాటిని నివారించేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నప్పటికీ.. యువతులు మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది.

ఓ బైకుపై ఇద్దరు యువతులు ముద్దులు పెట్టుకుంటూ విన్యాసాలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. యువతులిద్దరూ బైకుపై వెళ్తూ హ్యాండిల్ ని వదిలివేసి విన్యాసాలు చేశారు. ఇంతటితో ఆగకుండా హద్దులు మీరి ముద్దులు పెట్టుకుంటూ రోడ్డుపై హల్ చల్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Girls Kissing on Bike

అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ మాత్రం తమిళనాడుకు చెందినదిగా భావిస్తున్నారు. అయితే వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ జార్ఖండ్ కి చెందింది. ఇక వీడియోను పూర్తిగా గమనించినట్లైతే కదులుతున్న బైక్‌పై ఇద్దరు యువతులు ఎలాంటి భయం లేకుండా ఎదురెదురుగా కూర్చొని ముద్దులు పెట్టుకుంటున్నారు. ఆ సమయంలో బైక్ 30-40 వేగంలో ఉంది. దీనిని సమీపంలో ప్రయాణిస్తున్న వ్యక్తి వీడియోలో రికార్డ్ చేశాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ వీడియోని పలువురు జార్ఖండ్ పోలీసులకు ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా, ఈ ఇద్దరు యువతుల ప్రవర్తనపై తమదైన స్టైల్ లో కామెంట్లు చేశారు.

ఇలాంటి ఘటనకు సంబంధించిన మరో వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయబడింది. ఇక్కడ కూడా ఓ యువకుడు, యువతి ఎదురెదురుగా కూర్చుని రోడ్డుపై విన్యాసాలు చేస్తున్నారు. మరో వ్యక్తి వీడియో తీస్తుండగా తెలివిగా వారిద్దరూ తమను ఎవ్వరు గుర్తించకుండా ఉండేందుకు హెల్మెట్ ధరించి బైక్ నంబర్ ప్లేట్ కప్పివేసే ప్రయత్నం చేశారు. ఈ దుష్ప్రవర్తనపై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దేశంలోని పబ్లిక్ రోడ్లపై బైక్‌లు లేదా కార్లను ఉపయోగించి విన్యాసాలు చేయడానికి అవకాశం లేదు. ఇది డ్రైవర్‌కు లేదా వాహనం నడుపుతున్న ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు. ఇలాంటి దుశ్చర్యలు చేసి చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇలాంటి పనులు చేయవద్దని పోలీసులు ఎన్నోసార్లు జరిమానాలు విధించినా.. యువతలో మార్పు ఉండటం లేదు.

మీరు విన్యాసాలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, రేస్ ట్రాక్ లేదా మీ ప్రైవేట్ స్థలాన్ని ఎంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోండి. బహిరంగ ప్రదేశంలో ఎప్పుడూ ఇలా చేయకండి, ఇతరులను ఇబ్బంది పెట్టకండి. ముఖ్యంగా రోడ్డుపై విన్యాసాలు చేయడం తప్పు. ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు కూడా అంచనా వేయలేరు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం ఉత్తమం.

More from DriveSpark

Article Published On: Saturday, May 6, 2023, 19:09 [IST]
English summary
Girls kissing on bike visuals gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+