శృతి మించిన హోలీ సంబరాలు.. స్కూటర్‌పై యువతుల వికృత చేష్టలు.. మెట్రోలో రొమాన్స్
దేశంలో సోమవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. దేశవ్యాప్తంగా చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొని రంగుల పండుగ చేసుకున్నారు. ఈ క్రమంలో రోడ్లపై కొందరు యువత చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తాజాగా ఢిల్లీ మెట్రో, నోయిడా రోడ్ల(Holi Celebrations)పై జరిగిన హోలీ వేడుకలకు సంబంధించిన సంఘటనలు వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి చేరింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా సంఘటనలు వైరల్‌లోకి వస్తున్నాయి. క్రేజ్ కోసం కొందరు వినూత్న చర్యలకు పాల్పడి నెట్టింట్లో పోస్ట్ చేస్తుండగా.. మరికొందరు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ నడిరోడ్డుపై అందరికీ ఇబ్బంది కలిగిస్తూ చివరికి పోలీసులకు చిక్కుతున్నారు. ఢిల్లీ మెట్రో, నోయిడా రోడ్లపై యువతీయువకులు స్కూటర్‌పై వెళ్తూ హోలీ సంబరాలు చేసుకుంటున్న వీడయో వైరల్‌గా మారింది.

శృతి మించినట్లుగా ఉన్న ఈ హోలీ సంబరాలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సంబరాల వీడియోను పరిశీలించినట్లయితే రోడ్లపై ఓ యువకుడు, ఇద్దరు యువతులు స్కూటర్‌పై వెళ్తున్నారు. యువకుడు స్కూటర్ నడుపుతుండగా యువతులిద్దరూ వెనుక సీట్లో ఒకరినొకరు ఎదురుగా కూర్చొన్నారు. ఇక వెనుక కూర్చుని సైలెంట్‌గా కూర్చోకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకొంటున్నారు.
వీడియోలో, ఇద్దరు యువతులూ(Holi Celebrations On Delhi Roads).. ఒకరి బుగ్గలపై మరొకరు కలర్స్‌ను పూసుకుంటూ రోడ్డుపై హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాక్‌గ్రౌండ్‌లో హిందీ సినిమా పాట ప్లే అవడాన్ని వీడియోలో వినవచ్చు. ఇంకా స్కూటర్‌పై వారిద్దరూ రొమాన్స్ చేసుకుంటున్నారు. కాసేపటి తర్వాత రోడ్డుపై కూర్చుని ఇద్దరూ అసభ్యకరంగా ప్రవర్తించారు.

యువకుడు స్కూటర్ నడుపుతుండగా(Delhi Metro Holi celebrations).. ఈ తతంగాన్ని అంతా అటుగా వెళ్తున్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రోత పుట్టించేలా ఉన్న ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేయడంతో త్వరగా వైరల్ అయిపోయింది. నెటిజన్లు ఈ వీడియోలో దృశ్యాలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు నోయిడా పోలీసుల(Noida Holi Viral Videos)కు ఎక్స్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరింది. దీంతో స్కూటర్‌ను ట్రాక్ చేసి వారికి జరిమానా విధించారు. సంబంధిత వాహనంపై నోయిడా పోలీసులు రూ. 33,000 జరిమానా విధించారు. ఈ మేరకు సంబంధిత పోస్ట్‌ను పోలీసులు X లో పోస్ట్ చేసి ట్వీట్ చేశారు.

కాగా యువతీయువకుల వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. నడిరోడ్డుపై ఇలాంటి అసభ్యకరమైన చర్యలకు పాల్పడి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. పిల్లలు ఇలాంటి వీడియోలను చూస్తారని.. ఇలాంటి చర్యలు తగవని పేర్కొన్నారు. హోలీ ముసుగులో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలను తీసుకోవాలని పోలీసులను కోరారు.
మరో వీడియోను పరిశీలించినట్లయితే ఓ యువతి నిన్న హోలీ సందర్భంగా స్కూటర్ వెనకాల నిలబడి ఉంది. యువకుడు స్కూటీ రైడ్ చేస్తున్నాడు. కాగా స్కూటర్ రన్నింగ్‌లో ఉండగా యువతి వెనకాల నిలబడి యువకుడి ఫేస్‌కు రంగులు పూస్తోంది. ఈ క్రమంలో అతను ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ఒక్కసారిగిగా ఆమె రోడ్డుపై బొక్క బోర్లా పడింది.
ఢిల్లీ మెట్రో రైలులో ఇద్దరు అమ్మాయిలు రోమాన్స్ చేసుకున్న వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇద్దరు అమ్మాయిలు హోలీ నేపథ్యంలో.. తెల్లని దుస్తులు వేసుకుని, రంగులు పూసుకుని.. అంతటితో ఆగకుండా ఓ పాటకు రొమాన్స్ కూడా చేశారు. మెట్రోల్ కింద ఒకరి ఒడిలో మరొకరు కూర్చుని ముద్దులు పెట్టుకుంటూ స్టెప్పులు వేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రోడ్డుపై ఓవరాక్షన్ చేస్తే ఇలాగే జరుగుతుందని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలంటే చాలా ప్రయత్నాలు చేయొచ్చని.. కానీ ఇలాంటి అసభ్యకరమైన, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడవద్దని కామెంట్లలో సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications








