హైహీల్స్ వేసుకుని రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడింగ్.. వీళ్ళు చేసేది కరెక్టేనా? (వీడియో)

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు రైడ్ చేయడం ఆధునిక కాలంలో చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. ఇటీవల నెట్టింట్లో వైరల్ అయిన వీడియోలో ఇద్దరు అమ్మాయిలు బైక్ రైడ్ చేయడం చూడవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు అమ్మాయిలు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైకుని వేగంగా రైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వారు హెల్మెట్ గానీ, ఇతర సేఫ్టీ పరికరాలను ధరించలేదని స్పష్టంగా అర్థమవుతోంది. అంతే కాకుండా రైడ్ చేసే అమ్మాయి హైహీల్స్ ధరించింది. వారిరువురు వన్ పీస్ డ్రెస్సులను ధరించినట్లు ఇక్కడ చూడవచ్చు. ఇదంతా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి చేసినట్లు అనిపిస్తోంది.

Girls Riding Royal Enfield Bullet in High Heels

బైక్ రైడ్ చేసిన వీడియోను కన్ను మీనా అనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియోలో బుల్లెట్ బైక్ రైడ్ చేస్తున్న యువతి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అని, ఆమెకు ఇప్పటికే 14.3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రైడ్ చేసే అమ్మాయి హీల్స్ ధరించి బ్లాక్ డ్రెస్ వేసుకుంది, పిలియన్ మాత్రం గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకుని చేతిలో చిన్న బొకే పట్టుకుంది.

బైకును వేగంగా రైడ్ చేయడమే కాకుండా మధ్య మధ్యలో చేతితో పిస్టల్‌తో కాల్చినట్లు సైగ చేస్తూ ఎంజాయ్ చేయడం కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోను ఎవరు రికార్డ్ చేశారనే విషయం తెలియదు. బహుశా వీడియోను వారి స్నేహితులు రికార్డ్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం స్పష్టంగా తెలియదు.

Girls Riding Royal Enfield Bullet in High Heels

ఇప్పటివరకు ఈ వీడియో షేర్ చేసినందుకు ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌పై ఎటువంటి చర్య తీసుకోలేదని తెలుస్తోంది. అయితే వీరు ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ వంటివి ధరించకపోవడం వల్ల జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం. ఈ వీడియోలో బైక్ నెంబర్ ప్లేట్ కనిపించడం లేదు, అయినప్పటికీ అధికారులు వీరిని గుర్తించి తప్పకుండా జరిమానా విధించడం జరుగుతుందని తెలుస్తోంది.

గతంలో వెలుగులోకి వచ్చిన ఇలాంటి సంఘటనలు

నిజానికి మహిళలు బైక్ రైడ్ చేయడం ఇదే మొదటిసారి కాదు, గతంలో ఇద్దరు మహిళలు సంప్రదాయంగా చీరకట్టులో బైక్ రైడ్ చేయడం చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో కూడా ఆ మహిళలు హెల్మెట్ ధరించలేదు. వీరిపైనా పోలీసులు చర్యలు తీసుకున్నారా.. లేదా అనే విషయం స్పష్టంగా వెలుగులోకి రాలేదు.

అంతే కాకుండా గత ఏడాది మార్చిలో బీహార్‌లోని పాట్నాకు చెందిన అమ్మాయి తన యమహా ఆర్15 స్పోర్ట్స్ బైక్ రైడ్ చేస్తూ కనిపించింది. ఇందులో వారు నిర్లక్ష్యంగా బైక్ రైడ్ చేయడం, స్టంట్ చేయడం కూడా చూడవచ్చు. ఇందులో కూడా రైడ్ చేసే అమ్మాయి, పిలియన్ హెల్మెట్ ధరించలేదు. ఈ సంఘటన పాట్నా హైవే మీద జరిగినట్లు తెలుస్తోంది.

మహిళలకు బైక్ రైడ్ చేయాలన్న కోరిక ఉండటం మంచిదే, కానీ తప్పకుండా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. రైడ్ చేయడానికి కావాల్సిన దుస్తులు ధరించడం మాత్రమే కాకుండా, హెల్మెట్ ధరించడం వంటివి చేయాలి. పబ్లిక్ రోడ్డుమీద బైక్ రైడ్ చేసేటప్పుడు రైడర్, పిలియన్ తప్పకుండా హెల్మెట్ ధరించాలి, లేకుంటే అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో ప్రాణాలే కోల్పోయే అవకాశం ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Sunday, March 3, 2024, 12:28 [IST]
English summary
Girls riding royal enfield bullet in high heels without helmet
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+