రేపటి నుంచి గ్లోబల్‌ మొబిలిటీ ఎక్స్‌పో 2024.. హాజరుకానున్న ప్రధాని నరేంద్రమోడీ

భారత్‌ ప్రస్తుతం వాహన తయారీదారులకు అందుబాటులో ఉన్న అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటిగా ఉంది. మరియు క్రమంగా ప్రపంచ ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు గ్లోబల్‌ మొబిలిటీ ఎక్స్‌పో (Global Mobility Expo 2024) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పొల్గొంటారు.

మొబిలిటీ ఎక్స్‌పో కు భారీగా ప్రతినిధులు : మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ మొబిలిటీ ఎక్స్‌పోలో సుమారు 800 మంది ఎగ్జిబిటర్లు సహా సుమారు 50 మంది వరకు విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో మొబిలిటీ రంగంలోని ప్రముఖులను ఒకే ప్లాట్‌ఫాం కిందకు తీసుకురానుంది.

PM narendra modi will address Global Mobility Expo

ఎగుమతుల లక్ష్యాలను నిర్దేశించుకున్న భారత్‌ : మొబిలిటీ రంగంలో భారత్‌ స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రస్తుతం 14 శాతం వాహనాలను ఎగుమతి చేస్తోంది. దీనిని గణనీయంగా పెంచాలని నిర్ణయించుకుంది. 2030 నాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ప్యాసింజర్‌ వాహనాల్లో 25 శాతం ఎగుమతి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.

మొబిలిటీ ఎక్స్‌పోకు 47 దేశాల ప్రతినిధులు : ఈ గ్లోబల్‌ మొబిలిటీ ఎక్స్‌పోలో ఆటోమోటివ్‌ సాఫ్ట్‌వేర్‌, నెక్ట్స్‌జెన్‌ ఎలక్ట్రానిక్స్ మరియు ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ సహా ఇతర విభాగాల్లో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఎక్స్‌పో కు దేశీయ వాటాదారులు సహా 47 దేశాల్లోని అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు.

ఈ గ్లోబల్‌ ఎక్స్‌పోలో ఆటో షోలతోపాటు టైర్‌ ఎగ్జిబిషన్‌ కూడా ఉండనుంది. దీంతోపాటు అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించిన ప్రదర్శన, ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రదర్శన కూడా ఉంటుంది. మరియు ఆటోమొబైల్‌ విడిభాగాలు, డ్రోన్లు, బ్యాటరీలు, ఛార్జింగ్‌ స్టేషన్లు సహా ఈవీల్లోని అత్యాధునిక టెక్నాలజీ, హైబ్రిడ్‌, హైడ్రోజన్‌, CNG/LNG వంటి వాటిపై కార్యక్రమాలు ఉంటాయి.

విలువైన ఒప్పందాలు జరిగే అవకాశం : ఈ వేదిక ద్వారా వివిధ సంస్థలు లేదా కొనుగోలు దారులు, విక్రేతల మధ్య విలువైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంటుంది. టైర్ల తయారీలో అగ్రస్థాయి సంస్థలు, విడిభాగాలు, నిర్మాణ రంగ పరికరాలు, స్టీల్‌ తయారీదారులు సహా టెక్నాలజీకి చెందిన స్టార్టప్‌ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ పాల్గొననున్న ఈ గ్లోబల్‌ మొబిలిటీ ఎక్స్‌పోలో టాటా మోటార్స్‌, మారుతి సుజుకి, మహీంద్రా, కియా, హ్యుందాయ్‌ వంటి కార్ల తయారీ సంస్థలు పాల్గొంటాయి. ఆటో విడిభాగాల తయారీ సంస్థలైయిన Acme Udyog and subros దీంతోపాటు ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థలు అమర్‌రాజా, HEG వంటి సంస్థలు కూడా ఈ ఎక్స్‌పోలో పాల్గొననున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 31, 2024, 12:09 [IST]
English summary
Global mobility expo 2024 will start from feb 1st in delhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+