పెట్రోల్ ధర రూ. 100 దాటడంతో స్వీట్లు పంచిన ఆమ్ ఆద్మీ పార్టీ; ఎందుకంటే?

భారతదేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయా అన్నట్లు అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఇప్పటికే 100 మార్కుని దాటేశాయి. పెరుగుతున్న ధరలు సామాన్య మానవుడిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.

పెట్రోల్ ధర రూ. 100 దాటడంతో స్వీట్లు పంచిన ఆమ్ ఆద్మీ పార్టీ; ఎందుకంటే?

ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేఖంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నాయి. అయితే ఎంత మంది ఎన్ని నిరసనలు చేపట్టినా సంబంధిత ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఏమి జరగనట్లు ఊరకుంటున్నాయి.

పెట్రోల్ ధర రూ. 100 దాటడంతో స్వీట్లు పంచిన ఆమ్ ఆద్మీ పార్టీ; ఎందుకంటే?

ఇటీవల గోవాలోని ఆమ్ ఆద్మీ పార్టీ పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేఖంగా ఒక వినూత్నమైన నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగానే పెట్రోల్, డీజిల్ కొనడానికి వచ్చిన వాహనదారులకు కేక్, చాక్లెట్ వంటి స్వీట్లు అందిస్తూ తమ నిరసనను భిన్నంగా వ్యక్తం చేసింది.

పెట్రోల్ ధర రూ. 100 దాటడంతో స్వీట్లు పంచిన ఆమ్ ఆద్మీ పార్టీ; ఎందుకంటే?

గోవాలో జరిగిన ఈ సంఘటన దేశ ప్రజల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలోని పనాజీలో ఈ పద్ధతిలో కేకులు మరియు చాక్లెట్లను పంపిణీ చేసింది. రాజకీయ పార్టీలు తమదైన రీతిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నాయి.

పెట్రోల్ ధర రూ. 100 దాటడంతో స్వీట్లు పంచిన ఆమ్ ఆద్మీ పార్టీ; ఎందుకంటే?

పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలనలో బిజెపి నిరసన వ్యక్తం చేసిన ఫోటోలపై కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు. బెంగళూరులో ఈ రోజు లీటరు పెట్రోల్ ధర రూ. 105.25, డీజిల్ ధర రూ. 95.26.

పెట్రోల్ ధర రూ. 100 దాటడంతో స్వీట్లు పంచిన ఆమ్ ఆద్మీ పార్టీ; ఎందుకంటే?

అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల మరియు తగ్గుదల జరుగుతుంది. కానీ ఇటీవల రోజుల్లో ధరలు పెరుగుదల నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అధికమైన ట్యాక్క్సులు.

వ్యాట్ మరియు ఇతర పన్నుల కారణంగా, భారతదేశంలో పెట్రోల్ ధర రూ. 100 రూపాయలు దాటేసింది. అధిక పన్నుల కారణంగా, భారతదేశంలో వాహనదారులు ప్రతి లీటరు పెట్రోల్‌కు 60%, ప్రతి లీటరు డీజిల్‌కు 54% చెల్లిస్తున్నారు. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.

పెట్రోల్ ధర రూ. 100 దాటడంతో స్వీట్లు పంచిన ఆమ్ ఆద్మీ పార్టీ; ఎందుకంటే?

పెట్రోల్ మరియు డీజిల్ పెరుగుల కారణంగా ఎక్కువమంది వాహనదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది మాత్రమే కాకుండా కొత్త వాహనాలను కొనుగోలుచేసి వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా చాలా మంది వాహన తయారీదారులు దేశీయ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నారు.

Most Read Articles

English summary
Cakes Distributed At Fuel Pump As Petrol Price Crosses Rs 100 For Litre In Goa. Read in Telugu.
Story first published: Tuesday, July 27, 2021, 9:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X