కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)

ఏ కూతురికైనా నాన్నే సూపర్ హీరో. నాన్నలు కూడా తమ కుమార్తెల కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. ఇటీవల గోవాకు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ 'మైఖేల్ లోబో' ఇటీవల ఖరీదైన కారును కుమార్తెకు గిఫ్ట్ ఇచ్చారు.

మైఖేల్ లోబో తన కూతురికి గిఫ్ట్ ఇచ్చిన కారు 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) కంపెనీకి చెందిన 'ఎస్ఎల్55 ఏఎంజీ' (SL55 AMG). దీని ధర రూ. 2.7 కోట్లు. ఈ కారును మైకేల్ లోబో కుమార్తె గోవాలోని మెర్సిడెస్ బెంజ్ డీలర్‌షిప్ నుంచి డెలివరీ తీసుకుంటూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Goa Politician Gifts Daughter Expensive Mercedes Benz SL55 AMG

మైఖేల్ లోబో కుమార్తె బెంజ్ సూపర్ కారును డెలివరీ తీసుకుంటున్న వీడియోను మెర్సిడెస్ బెంజ్ డీలర్‌షిప్ కౌంట్ మోటార్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఇందులో సేల్స్ రిప్రజెంటేటివ్ మైఖేల్ లోబో భార్యకు, కూతురుకు ఫ్లవర్ బొకే ఇవ్వడంతో మొదలవుతుంది. ఆ తరువాత కారు మీద ఉన్న గుడ్డను తొలగిస్తారు. చివరికి లోబో కూతురు కారు లోపల కూర్చుంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎస్55 ఏఎంజీ (Mercedes Benz SL55 AMG)

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంజ్ అనేక కార్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఇందులో ఎస్ఎల్55 ఏఎంజీ కూడా ఒకటి. మైఖేల్ లోబో కూతురు కోసం కొన్న కారు ప్యాటగోనియా రెడ్ కలర్ షేడ్‌లో ఉంది. దీని ధర దేశీయ విఫణిలో రూ. 2.3 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఆన్ రోడ్ ధర రూ. 2.7 కోట్లు వరకు ఉంటుంది.

Goa Politician Gifts Daughter Expensive Mercedes Benz SL55 AMG

డిజైన్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎస్55 ఏఎంజీ రోడ్‌స్టర్ అద్భుతమైన డిజైన్ కలిగి కూపే బాడీ స్టైల్ పొందుతుంది. ఇది స్వెప్‌బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, సిగ్నేచర్ మెర్సిడెస్ పనామెరికానా గ్రిల్, గ్లోస్ బ్లాక్ ORVM వంటి వాటితో పాటు 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, రెడ్ లేదా యెల్లో కలర్ బ్రేక్ కాలిపర్స్ వంటివి పొందుతుంది. క్వాడ్ టిప్ ఎగ్జాస్ట్‌లు, అడ్జస్టబుల్ స్పాయిలర్, ర్యాప్‌రౌండ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ కూడా ఉన్నాయి.

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్

బ్రాండ్ యొక్క ఇతర కార్ల మాదిరిగానే ఈ సూపర్ కారు కూడా అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఎస్ఎల్55 రోడ్‌స్టర్ స్పోర్టీ ఇంటీరియర్ డిజైన్ కలిగి చుట్టూ కార్బన్ ఫైబర్ మరియు అల్కాంటారా ఇన్సర్ట్‌లతో పాటు ప్రత్యేకమైన ఏఎంజీ పర్ఫామెన్స్ సీట్లు పొందుతుంది. ఇది ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మొదలైనవి పొందుతుంది.

ఇంజిన్

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎస్55 ఏఎంజీ రోడ్‌స్టర్ 4.0-లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 473 Bhp పవర్ మరియు 700 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ సూపర్ కారు టాప్ స్పీడ్ గంటకు 295 కిమీ కావడం గమనార్హం.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, March 29, 2024, 11:30 [IST]
English summary
Goa politician gifts daughter mercedes benz sl55 amg
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+