మీ బండి ఎక్కడ ఆగిపోతే అక్కడికే చార్జింగ్.. GoFuel మొబైల్ చార్జింగ్ సొల్యూషన్స్..

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. భవిష్యత్తులో పెట్రోల్ ధరలు మరింత ఎక్కువ పెరిగే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో, ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలని భావిస్తున్నప్పటికీ, చార్జింగ్ సమస్య కారణంగా వెనుకంజ వేస్తున్నారు.

మీ బండి ఎక్కడ ఆగిపోతే అక్కడికే చార్జింగ్.. GoFuel మొబైల్ చార్జింగ్ సొల్యూషన్స్..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ మౌళిక సదుపాయాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. ఈ విషయంలో నగరాలు, పట్టణాల్లో కొంతమేర అభివృద్ధి ఉన్నప్పటికీ, జిల్లాలు, మండలాలు మరియు గ్రామీణ స్థాయిలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కావటానికి మరికొన్నేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

మీ బండి ఎక్కడ ఆగిపోతే అక్కడికే చార్జింగ్.. GoFuel మొబైల్ చార్జింగ్ సొల్యూషన్స్..

ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులను మరియు కొత్తగా కొనుగోలు చేయాలనే వారిని వెంటాడే మొదటి ప్రశ్న చార్జింగ్ నెట్‌వర్క్. ఒకవేళ రోడ్డుపై వెళ్తుండగా హఠాత్తుగా చార్జింగ్ అయిపోతే, ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వీరిని వెంటాడుతూ ఉంటాయి.

మీ బండి ఎక్కడ ఆగిపోతే అక్కడికే చార్జింగ్.. GoFuel మొబైల్ చార్జింగ్ సొల్యూషన్స్..

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా, కొత్త సాంకేతికతలు మరియు సేవలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని (రోడ్డుపై హఠాత్తుగా చార్జింగ్ ఖాళీ అవడాన్ని) పరిగణలోకి తీసుకొని చెన్నైకి చెందిన స్టార్టప్ గోఫ్యూయల్ త్వరలోనే మొబైల్ ఛార్జింగ్ సర్వీస్‌ ని ప్రవేశపెట్టనుంది.

మీ బండి ఎక్కడ ఆగిపోతే అక్కడికే చార్జింగ్.. GoFuel మొబైల్ చార్జింగ్ సొల్యూషన్స్..

అంటే, ఇది ప్రజల వద్దకే పాలన అన్నట్లుగా, వాహనదారుల వద్దకే చార్జింగ్ అనే స్కీమ్ అన్నమాట. గోఫ్యూయెల్ ఈ ఏడాది ఆరంభంలో కరోనా మహమ్మారి నేపథ్యంలో, నేరుగా తమ కస్టమర్ల వద్దకే డీజిల్ డెలివరీ చేసే విధానాన్ని పరిచయం చేసింది. డీజిల్ కోసం బయటకు రాలేని వారిని దృష్టిలో ఉంచుకొని, ట్యాంకర్లలో డీజిల్ తీసుకువెళ్లి వాహనాలకు మరియు పరిశ్రమలకు సప్లయ్ చేయటం ప్రారంభించింది.

మీ బండి ఎక్కడ ఆగిపోతే అక్కడికే చార్జింగ్.. GoFuel మొబైల్ చార్జింగ్ సొల్యూషన్స్..

కాగా, ఇప్పుడు అదే తరహాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర మరియు నాలుగు చక్రాల వాహనాల కోసం మొబైల్ ఛార్జింగ్ మరియు బ్యాటరీ చేంజింగ్ స్టేషన్లను అందించడానికి సిద్ధమైంది. గోఫ్యూయెల్ సంస్థ ఇప్పుడు ఆ దిశగా తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మొబైల్ యూనిట్లను సౌరశక్తిని ఉపయోగించి వాహనాలను ఛార్జ్ చేసేలా చూడాలని కంపెనీ యోచిస్తోంది, తద్వారా స్వచ్ఛమైన విద్యుత్ శక్తి మాత్రమే బ్యాటరీలలోకి వెళ్తుంది.

మీ బండి ఎక్కడ ఆగిపోతే అక్కడికే చార్జింగ్.. GoFuel మొబైల్ చార్జింగ్ సొల్యూషన్స్..

పెట్రోల్ వాహనాల విషయంలో రైడర్లు ఎలాగైతే ఫ్యూయెల్ గేజ్‌ పై ఓ కన్నేసి వాహనాన్ని నడుపుతుంటారో, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కూడా బ్యాటరీ ఇండికేటర్ పై నిత్యం ఓ కన్నేసి నడపాల్సి ఉంటుంది. పెట్రోల్ విషయంలో అయితే, అది దేశంలో ఎక్కడైనా దొరుకుతుంది. కొన్ని కిలోమీటర్ల దూరాల్లోనే పెట్రోల్ బంకులు ఉంటాయి. కానీ, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో నెట్‌వర్క్ అలా లేదు.

మీ బండి ఎక్కడ ఆగిపోతే అక్కడికే చార్జింగ్.. GoFuel మొబైల్ చార్జింగ్ సొల్యూషన్స్..

అయితే, దేశంలో క్రమంగా విస్తరిస్తున్న ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు మరియు ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల బ్యాటరీ రేంజ్‌ లను మెరుగుపరచడంతో ఈ పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడే అవకాశం ఉంది. ఇవి ఎంత మెరుగు పడినప్పటికీ, కొన్ని అనివార్య పరిస్థితులలో, మీరు ఒంటరిగా ఎలక్ట్రిక్ వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు మరియు మీకు సమీపంలో ఎలాంటి ఛార్జింగ్ ఆప్షన్ లేకపోయినప్పుడు మీ పరిస్థితి ఏంటి?

మీ బండి ఎక్కడ ఆగిపోతే అక్కడికే చార్జింగ్.. GoFuel మొబైల్ చార్జింగ్ సొల్యూషన్స్..

ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులకు సాయం చేసేందుకు మరియు వారికి అవసరమైన చార్జింగ్ సౌకర్యాన్ని కల్పించేందుకు గోఫ్యూయెల్ ఈ కొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో రైడర్లు, డ్రైవర్లు తమ వాహనాల చార్జింగ్ కోసం గోఫ్యూయెల్ ద్వారా మొబైల్ చార్జర్ ను ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందుకోసం కంపెనీ ఓ స్మార్ట్‌ఫోన్ యాప్ ను కూడా డెవలప్ చేసింది.

మీ బండి ఎక్కడ ఆగిపోతే అక్కడికే చార్జింగ్.. GoFuel మొబైల్ చార్జింగ్ సొల్యూషన్స్..

వాహనదారులు ఈ యాప్ సాయంతో మొబైల్ చార్జర్ ఆర్డర్ చేసుకున్న తర్వాత, బ్యాటరీలతో కూడిన ఓ మినీ వ్యాన్ వాహనదారుడు ఉండే ప్రదేశానికి చేరుకుంటుంది. అనంతరం, తమ వద్ద ఉన్న చార్జింగ్ పోర్టు సాయంతో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన చార్జింగ్ ను అందిస్తుంది. మీ మిగతా ప్రయాణానికి సరిపడా చార్జ్ అందిన వెంటనే మీరు మీ గమ్యం చేరుకోవచ్చు.

మీ బండి ఎక్కడ ఆగిపోతే అక్కడికే చార్జింగ్.. GoFuel మొబైల్ చార్జింగ్ సొల్యూషన్స్..

ఫోర్-వీలర్‌ల కోసం గోఫ్యూయెల్ మొబైల్ ఛార్జింగ్ సొల్యూషన్‌లో భాగంగా ఆన్-బోర్డ్ ఎనర్జీ స్టోరేజ్ ఉన్న వ్యాన్ ఉంటుంది. ఈ వ్యాన్ ను 200kW వరకు వేగవంతమైన ఛార్జ్‌ ని అందించేలా రూపొందించబడింది. ఒకవేళ మీ వాహనంలో తొలగించగల బ్యాటరీ ప్యాక్ ఉన్నట్లయితే, మీరు చార్జింగ్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం కూడా లేదు.

మీ బండి ఎక్కడ ఆగిపోతే అక్కడికే చార్జింగ్.. GoFuel మొబైల్ చార్జింగ్ సొల్యూషన్స్..

మీ వాహనంలోని ఖాలీ బ్యాటరీని గోఫ్యూయెల్ మొబైల్ చార్జింగ్ వ్యాన్ లో మార్పిడి చేసుకొని క్షణాల్లోనే అక్కడి నుండి మీ గమ్యం వైపుకు ప్రయాణించవచ్చు. ఈ సేవలకు సంబంధించిన పేమెంట్ వివరాలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

మీ బండి ఎక్కడ ఆగిపోతే అక్కడికే చార్జింగ్.. GoFuel మొబైల్ చార్జింగ్ సొల్యూషన్స్..

గోఫ్యూల్ ఫ్రాంఛైజీ మోడల్ ప్రస్తుతం అస్సాం, ఆంధ్రప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్రాలలో అందుబాటులో ఉంది మరియు త్వరలో ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. గోఫ్యూయల్ తమ డీజిల్ డెలివరీ సేవల గడచిన 5 నెలల కాలంలో రూ. 5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని కంపెనీ తెలిపింది. గోఫ్యూయెల్ 2022 నాటికి 100 మొబైల్ ఛార్జింగ్ మరియు మార్పిడి స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Most Read Articles

English summary
Gofuel planning to introduce mobile charging solution
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X