ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన బైక్ (మేడ్ విత్ గోల్డ్)
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న బైక్‌ను చూసి ఇదేదో తుప్పుపట్టిన పురాతన బైక్ అనుకుంటే, మీరు బ్రేక్‌పై కాలేసినట్లే. ఎందుకంటే, ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన బైక్ టైటిల్ కోసం పోటీపడుతున్న బైక్‌లలో ఒకటి. గిన్నిస్ బుక్‌లో సాధారణంగా, అసాధారణ బైక్ స్టంట్‌లు చేయటమో లేక వేగంగా నడపి రికార్డు సృష్టించడమో చూసుంటాం.
కానీ, ఈ ప్రత్యేకమైన బైక్ మాత్రం అలాంటివి ఏమీ చేయకుండానే గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించుకోవాలనుకుంటోంది. మరి ఇందు కోసం ఈ బైక్‌లో ఉండే ప్రత్యేకత ఏంటనుకుంటున్నారా..? ఈ బైక్‌ను బంగారంతో పాటుగా విలువైన వస్తువులతో తయారు చేశారు. టర్కీ దేశానికి చెందిన టర్హాన్ టెల్లీ అనే ఓ మిలీనియర్ ఈ బైక్‌ను సృష్టించాడు.
మరి ఈ బంగారు బైక్ గురించిన మరిన్ని విశేషాలను క్రింది ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి.

గోల్డెన్ ఫ్రేమ్
మోటార్‌సైకిల్ ప్రియుడైన టర్హాన్ టెల్లీ రూపొందించిన ఈ మోటార్‌సైకిల్‌తో ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన బైక్ టైటిల్ కోసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సంప్రదించాడు. ఇందుకు ప్రధాన కారణం, ఈ బైక్‌ను బంగారంతో తయారు చేయటమే.

రస్టిక్ లుక్
ఈ బైక్ చూడటానికి తుప్పు పట్టిన బైక్ మాదిరిగా కనిపిస్తుంది. సముద్రం లోనుంచి కొన్ని సంవత్సరాల తర్వాత బయటకు తీసిన బైక్ మాదిరిగా ఉంటుంది. బంగారం మెరుపును దాచి, ఆర్టిస్టిక్ ఫీల్‌ను కల్పించేందుకు ఈ బైక్‌ను ఇలా డిజైన్ చేశారు.

మెడుసా
ఈ బైక్ గ్రీక్ మైథాలజీ థీమ్‌ను ప్రతిభింభింపజేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్‌పై మెడుసా హెడ్ బ్యాడ్జ్ ఉంటుంది.

హెర్మెస్
అంతేకాకుండా, ఈ బైక్ ఇంజన్‌పై హెర్మెస్ ఫేస్‌తో కూడిన మరొక బ్యాడ్జ్ ఉంటుంది.

డిజైన్
ఈ బైక్‌ను క్లాసిక్ లుక్ ఉండేలా, లో స్లంగ్ కస్టమ్ క్రూయిజర్ మాదిరిగా డిజైన్ చేశారు. ఇందులోని పెద్ద ఫెండర్స్ ఫ్రంట్ ఫోర్క్ వరకు స్ట్రెచ్ చేయబడి ఉంటాయి.

ఇంజన్
ఇందులో 1801సీసీ రెవ్‌టెక్ వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 125 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్సిమిషన్
ఈ బైక్‌లోని ఇంజన్ సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

బరువు
ఈ గోల్డెన్ బైక్ మొత్తం బరువు 700 పౌండ్లు (317 కిలోలు).

నిర్మించడానికి పట్టిన సమయం
ఈ బైక్‌ను నిర్మించడానికి టర్హాన్ టెల్లీకి ఓ ఏడాది సమయం పట్టింది.

ప్రస్తుత రికార్డ్ హోల్డర్
గిన్నిస్ బుక్‌లో ప్రస్తుతం ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన బైక్‌గా ఎమ్‌టిటి టర్బైన్ బైక్ రికార్డును కలిగి ఉంది. దీన ధర 1,85,000 డాలర్లు.

ధర
ఈ బైక్ ధరను టెల్లీ పబ్లిక్‌గా వెల్లడించలేదు. అయితే, నిపుణలు మాత్రం కేవలం గోల్డెన్ ఫ్రేమ్ మిలియన్ డాలర్ల వెల కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
వీడియో
గోల్డెన్ ఫ్రేమ్‌తో తయారు చేసిన ఈ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ వీడియోలో వీక్షించండి.


Click it and Unblock the Notifications








