రియల్ కారు కన్నా డజను రెడ్లు ఖరీదైన బొమ్మ కారు

By Ravi

మీ దగ్గర దాచుకోలేనంత డబ్బుంటే ఏం చేస్తారు..? ఆ ఏం చేస్తాం మహా అయితే రాజకీయాల్లోకి వస్తాం అంటారా..? మన సంగతేమో కానీ దుబాయ్‌లో మాత్రం దాచుకోలేనంత డబ్బుంటే, ఇక వాళ్లు చేసే దుబారాలకు అడ్డూ అదుపు అస్సలు ఉండదు. ఆయిల్ రిచ్ కంట్రీగా పేరుగాంచిన దుబాయ్‌లో డబ్బుకు కొదవే లేదు. వారి సంపందకు తగినట్లుగా వారి విలాసాలు కూడా ఉంటాయి.

రియల్ కారు కన్నా డజను రెట్లు ఖరీదు చేసే బొమ్మ కారును ఎవరైనా కొంటారా..? కానీ దుబాయ్‌లో అలాంటి దుబారా రాయుళ్లు ఎక్కడ చూసినా కనిపిస్తారు. జర్మనీకి చెందిన రాబర్ట్ గల్పిన్ తయారు చేసిన ఓ లాంబోర్గినీ అవెంటేడర్ స్కేల్ మోడల్ (షో పీస్ మాదిరిగా ఉండే చిన్నపాటి బొమ్మ కారు)ను ఇప్పుడు దుబాయ్‌లో వేలానికి ఉంచారు. దీని ప్రారంభ బిడ్డింగ్ 75 లక్షల డాలర్లు మాత్రమే.

ఈ స్కేల్ మోడల్ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం 6.50 లక్షల డాలర్లు ఛారిటీకి వెళ్తాయి. మరి బుల్లికారు అంత ఖరీదు పలకడానికి కారణం ఏంటో తెలుసా..? రండి అదేంటో తెలుసుకుందాం..!

దిమ్మ తిరిగించే 'బొమ్మ కారు'

ఈ ఫొటోలో మీరు చూస్తున్నది రియల్ కారులా కనిపించే స్కేల్ మోడల్. ఈ కారును పూర్తిగా బంగారంతో తయారు చేశారు. ఈ స్కేల్ మోడల్ తుది తయారీకి 25 కేజీల బంగారం పట్టింది (ఇది మార్కెట్లో సుమారు 12 లక్షల డాలర్ల విలువకు సమానం).

దిమ్మ తిరిగించే 'బొమ్మ కారు'

ఇందులోని చక్రాలను, ఇంటీరియర్లను నల్లగా ఉండేలా ప్లాటినం, గోల్డ్ మిక్స్‌ను ఉపయోగించారు. అంతేకాకుండా, లోపలి వైపు విలువైన రాళ్లను పొదగారు (బహుశా వజ్రాలు అయి ఉండొచ్చు).

దిమ్మ తిరిగించే 'బొమ్మ కారు'

దీని తయారీకి ఉపయోగించిన అన్ని వస్తువులు, పదార్థాల వెలే సుమారు 26 లక్షల డాలర్లు ఉండొచ్చని అంచనా. మరి ఈ బంగారు బాతు గుడ్డును సొంతం చేసుకునే ఆ రిచ్ మ్యాన్ ఎవరో తెలియాలంటే, వేలం ముగిసే వరకు వేచి ఉండక తప్పదు.

గల్పెన్ సృష్టించిన వాటిలో ఇదే మొదటి అత్యంత ఖరీదైన స్కేల్ మోడల్ కాదు. 2011లో ఈయన సృష్టించిన ఓ అవెంటేడర్ కూడా అత్యంత వెల పలికింది. కార్బన్ ఫైబర్, వజ్రాలు, విలువైన రాళ్లతో రూపొందించిన ఈ కారు 47 లక్షల డాలర్లు పలికింది. ఆ వీడియోను వీక్షించండి.

More from DriveSpark

Article Published On: Saturday, September 21, 2013, 10:33 [IST]
English summary
How does someone who is insanely rich and already owns all sorts of expensive sports cars up the ante? One way to go about it would be to buy a scale model car that is a dozen times more expensive than the real thing. Such a thing actually exists and as you might have guessed, it happens to be in Dubai. The car we are talking about is a 1/8th scale model of a Lamborghini Aventador made by Robert Gülpen from Germany.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+