బంగారు పూతతో బుల్లెట్‌ బండి.. ఒళ్లంతా బంగారంతో వీధుల్లో రైడింగ్‌ చేస్తున్న గోల్డ్‌మ్యాన్‌!!

దేశంలో చాలామంది ఫేమస్‌ అయ్యేందుకు లేదా వార్తల్లో నిలిచేందుకు విభిన్న పద్ధతులను అనుసరిస్తారు. తాజాగా ఓ వ్యక్తి కూడా తనతో పాటు అతడి బండిని కూడా పూర్తిగా బంగారంతో మేకప్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తుంది. భారీ మొత్తంలో బంగారం ధరించి వీధుల్లో తిరగడంతో అతను వార్తల్లో నిలిచాడు. ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో పలువురు నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వైరల్‌ వీడియోకి సంబంధించి పూర్తి వివరాలు ఈ కథనంలో..

బీహార్‌కి చెందిన ఓ వ్యక్తి తన RE బుల్లెట్‌ బండిని పూర్తి బంగారం పూతతో అలంకరించాడు. అంతే కాకుండా తన మెడ, చేతులకు భారీ బంగారు గొలుసులు ధరించి ఆ బైక్‌పై కనిపించాడు. బంగారంపై ఆయనకున్న మక్కువ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసిందని చెప్పవచ్చు. బుల్లెట్ బాడీపై పూర్తిగా బంగారం పూతను ఫిల్మ్ రూపంలో చూడవచ్చు. దాదాపు 5.4 కిలోల బంగారంతో వీధుల్లోకి అతను వచ్చాడు.

Bihar-Goldman-Rem-Singh

లైవ్ సిటీస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే యూట్యూబ్‌ ఛానల్‌ ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. అయితే ఇతన్ని బీహార్‌లో గోల్డ్‌మ్యాన్‌ పిలుస్తారు. ఇతని అసలు పేరు ప్రేమ్ సింగ్. బీహార్ వీధుల్లో బంగారం పూత పూమసిన రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్‌పై ఆయన తరచూ తిరుగుతూ ఉంటారు. అయితే తాజాగా 5.4 కిలోల బంగారాన్ని ధరిస్తూ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు.

కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు ధరించడం ఆయన అలవాటు. ప్రస్తుతం కనిపించిన వీడియోలో అతనిపై బ్రాస్‌లెట్‌లు మరియు భారీ గొలుసులు ఉన్నాయి. అంతేకాదు తన రాయల్ ఎన్ ఫీల్డ్ బాడీపై రియల్ గోల్డ్ ఫిల్మ్‌ని ఇన్‌స్టాల్ చేశాడు. ఇందుకోసం అతను రూ.12 లక్షలు వెచ్చించాడు. ఈ బైక్‌ ప్రత్యేక అలంకరణను చూసి ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయన చుట్టూ జనం గుమిగూడుతారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Bihar-Goldman

నిజానికి సెల్ఫీలు కావాలని జనం ఆయన వద్దకు వస్తుంటారు. అయితే ఆయన సేఫ్టీ ప్రశ్నించగా నితీష్ కుమార్ ప్రభుత్వంలో బీహార్‌లో శాంతిభద్రతల పరిస్థితి చాలా మెరుగుపడిందని ఆయన పేర్కొనడం గమనార్హం. అందుకే ఒంటిపై అంత బంగారం పెట్టుకుని తిరగడానికి భయపడటం లేదని వెళ్లడించాడు. దీనిపై నెటిజన్లు కాస్త వ్యగ్యంగా విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ వేదికపై బిహార్, భారత్‌కి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అంత బంగారాన్ని మోసుకుంటూ ఎవరైనా ఇంత రిలాక్స్‌గా ఎలా ఉంటారని వీడియోలో ఓ రిపోర్టర్‌ ప్రశ్నించాడు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఘటనల్లో బీహార్ తొలి స్థానంలో ఉంటుందని అడిగారు. దీనిపై స్పందించిన ప్రేమ్‌ సింగ్‌ ప్రభుత్వం, పోలీసులు సహా అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తద్వారా తనకు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదని నమ్ముతున్నట్లు ఆయన చెప్పాడు.

డ్రైవ్స్‌పార్క్‌ వ్యాఖ్య: బహిరంగ ప్రదేశాల్లో భారీ మొత్తంలో బంగారం ధరించడం అనేది రిస్క్‌తో కూడుకున్న పని. ముఖ్యంగా ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ప్రేమ్‌ సింగ్‌ వెర్షన్‌ పక్కన పెడితే ఇలాంటివి ఫాలో అవ్వడం వల్ల కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి దీనిని ఎవరు అనుకరించవద్దు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, July 4, 2024, 11:51 [IST]
English summary
Goldman in bihar wraps re bullet with gold visuals hits internet
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+