రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?

ప్రతి సంవత్సరం రోడ్డుప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రమాదాలు జరగటానికి కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం. వాహనదారులు ద్విచక్ర వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి.

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?

వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సంబదిత అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. అయితే వాహనదారులలో చాలామంది దీనిని ఏ మాత్రం పాటించడం లేదు. హెల్మెట్ ధరించుకుందా డ్రైవింగ్ చేసే సమయంలో అనుకోని ప్రమాదాలు జరిగితే ఊహకందని నష్టం జరుగుతుంది. హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వాహనదారులు కోకొల్లలుగా ఉన్నాయి.

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?

అయితే హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదంలో కూడా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

MOST READ:వావ్.. 19 వ శతాబ్దాల్లోనే ఇలాంటి ట్రైన్స్ సర్వీస్.. సూపర్ టెక్నాలజీ

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?

నివేదికల ప్రకారం తమిళనాడులోని అరియలూర్ జిల్లా సుందకుడి ప్రాంతానికి చెందిన ఐటి ఉద్యోగిగా పనిచేస్తున్న సత్యసీలాన్ తన బైక్ మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సత్యశీల్ బస్సు కిందికి చిక్కుకున్నాడు. అయితే తాను ధరించిన హెల్మెట్ అతన్ని మరణ గండం నుంచి తప్పించింది.

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?

బస్సు తాను ధరించిన హెల్మెట్ పై నుంచి వెళ్ళింది. ఇంత ప్రమాదకర సంఘటన జరిగినా అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. సత్యశీల్ యొక్క ప్రాణాన్ని అతడు ధరించిన నాణ్యమైన హెల్మెట్ కాపాడింది.

MOST READ:జెసిబి వల్ల బయటపడిన బీచ్‌లో చిక్కుకున్న థార్[వీడియో]

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?

సాధారణంగా వాహనదారులు పోలీసులకు భయపడి, లేకుంటే వారి నుంచి తప్పించుకోవడానికి మంచి నాణ్యత లేని హెల్మెట్స్ వాడతారు. ఇలాంటి హెల్మెట్స్ వాణాదారుణ్ని ఏ మాత్రం రక్షించలేవు. కావున వీలైనంతవరకు వాహనదారుడు తప్పకుండా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన కంపెనీల హెల్మెట్స్ వాడాలి. అప్పుడే సురక్షితంగా ఉంటారు.

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?

హెల్మెట్ ధరించని వాహదారులపై పోలీసులు ఎప్పటికప్పుడు జరిమానా విధించడం, వాహనాలను జప్తుచేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ దీనిని పూర్తిగా నిలువరించలేకపోతున్నారు.

MOST READ:అక్కడ కరోనా లాక్‌డౌన్ మరింత పొడిగింపు.. ఈ సర్వీసులకు మాత్రం మినహాయింపు

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?

భారతీయ మోటారు వాహన చట్టం ప్రకారం కేవలం బైక్ డ్రైవ్ చేస్తున్నవారు మాత్రమే కాదు ద్విచక్రవాహనంపై వెనుక ఉన్న వారికి కూడా తప్పనిసరిగా హెల్మెట్ అవసరం. ఇది ఎప్పటినుంచో అమలులో ఉంది. కావున ప్రజలు అందరూ తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలి.

Most Read Articles

English summary
Good Quality Helmet Saves Young Man's Life In Accident. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X