రైల్వే క్రాసింగ్‌ను దాటేందుకు మహీంద్రా బొలెరో డ్రైవర్ యత్నం.. ఈడ్చుకెళ్లిన గూడ్స్ రైలు.. కొద్దిలో మిస్!!
రోడ్డుపై డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుకు అన్ని వైపులా చూస్తూ డ్రైవ్ చేయాలి. కానీ చాలా మంది దీనిని పాటించరు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. తాజాగా మహీంద్ర బొలెరా(Goods Train Drags Mahindra Bolero Neo) వాహనం రైల్వే ట్రాక్‌పై తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది.
ఇటీవల మహీంద్రా బొలెరో నియో SUV డ్రైవర్ తప్పిదంతో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. డ్రైవర్ దృష్టి మరల్చడంతో మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీని గూడ్స్(Railway Croosing Accidents) రైలు దాదాపు 30 మీటర్ల దూరం లాక్కెళ్లింది. ఈ సంఘటన ఒడిశాలో పారాదీప్ పోర్ట్‌లోని నిషేధిత జోన్ సమీపంలో చోటుచేసుకుంది.

వీడియోను పరిశీలించినట్లయితే, మహీంద్రా బొలెరో నియో SUV.. రైల్వే క్రాసింగ్ గుండా వెళుతున్నట్లు తెలుస్తోంది. కారు డ్రైవ్ చేస్తుండగా డ్రైవర్ తన దృష్టి మరల్చడంతో బొలెరో నియో ఎస్‌యూవీ వైపు వస్తున్న గూడ్స్ రైలును అతను గమనించలేదు. దీంతో గూడ్స్ రైలు నేరుగా వెళ్లి ఎస్‌యూవీని ఢీకొట్టడంతో పాటు ఆగకుండా కనీసం 30 మీటర్ల వరకు బొలెరోను లాక్కెళ్లింది.
అదృష్టమేమంటే.. ఆ సమయంలో గూడ్స్ రైలు తక్కువ వేగంతో వెళ్తుండటంతో పెను ప్రమాదం తప్పింది. ఒడిశాలోని మెకానికల్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (MCHP) క్యాంటీన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ప్రమాదంలో మహీంద్రా బొలెరో నియో డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తోంది. ఘటనలో మహీంద్రా బొలెరో నియో డ్రైవర్, ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాకపోవడం ఊరట కలిగించింది. కాగా కారులోని ప్రయాణికులు ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులుగా సమాచారం.

ప్రమాదం జరిగినట్లు సమాచారం అందడంతో CISF, పారాదీప్ పోర్ట్ ట్రాఫిక్ విభాగం సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ట్రాక్, క్రాసింగ్‌పై ట్రాఫిక్ జామ్‌ను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ సంఘటన ద్వారా రైల్వే ట్రాక్ క్రాసింగ్ చేసేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో అర్థమవుతుంది. ఏ మాత్రం ఏకాగ్రత తప్పినా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
డ్రైవింగ్ చేసేటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ డ్రైవింగ్ చేయడం అవసరం. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, తీవ్రమైన ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది. గూడ్స్ రైలు చాలా తక్కువ వేగంతో ఉండటంతో కేవలం మహీంద్రా బొలెరో ఎస్‌యూవీ లాగుతూ మాత్రమే వెళ్లింది. హై స్పీడ్‌లో వెళ్లి ఉంటే.. కారు బోల్తా పడి తీవ్ర నష్టం జరిగి ఉండేది.

కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో, రైల్వే క్రాసింగ్ వద్ద ఓ బైకర్ ఆగకుండా దూసుకెళ్తూ బోల్తా పడిన సంఘటన జరిగింది. రైలు వెళ్లే వరకు వేచి ఉండలేని ఓ బైకర్ హడావుడిగా రైలు పట్టాలు దాటడానికి ప్రయత్నించాడు. అకస్మాత్తుగా ఆ వ్యక్తి అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ క్రమంలో బైక్ పట్టాలపై పడిపోగా వ్యక్తి అక్కడి నుంచి దూరంగా పడిపోయాడు. రైలు ట్రాక్‌పై ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతో పూర్తిగా ధ్వంసమైంది.
ఇక మహీంద్రా బొలెరో నియో(Mahindra Bolero Neo) కారు విషయానికొస్తే ఇది స్కార్పియో, థార్ మాడ్యులర్ ఛాసిస్‌తో పాటు అనేక టెక్నికల్ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో అప్‌డేటెడ్ ఫ్రంట్ బంపర్, సరికొత్త హెడ్‌ల్యాంప్‌లతో ఆకర్షణీయంగా LED DRL లైట్లు ఉన్నాయి. ఇక ఫీచర్ల విషయానికొస్తే 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది.

ఈ మహీంద్రా బొలెరో నియో యొక్క ఇంజిన్ పనితీరును పరిశీలిస్తే ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. 100 PS శక్తిని మరియు 260 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ RWD (రేర్ వీల్ డ్రైవ్) టెక్నాలజీతో 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఎంపికతో జత చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








