రూట్ తెలియక దారి తప్పిన గూడ్స్ రైలు.. ఏకంగా 147 కి.మీల ప్రయాణం.. లోపల ఏముందో తెలుసా..?
సాధారణంగా బస్సులు, ట్రక్కులు వంటివి రోడ్డు మీద ప్రయాణించే వాహనాలు దారి తప్పి పోవడం జరుగుతుంది. తెలియని కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు పొరపాటున ఇలా అవుతుంది. అయితే తాజాగా ఒక రైలు దారి తప్పి అది వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో ప్రయాణించిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదే సమయంలో రైల్వే సిబ్బంది తప్పిదం కూడా బయటపడింది. అదృష్టం కొద్ది ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఇప్పటికే రైలు ప్రమాదాలను తగ్గించడానికి కీలక జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన మరో చర్చకు దారి తీసింది. దారి తప్పిన రైలు కారణంగా ఎవరికి ఏం కాకపోవడంతో సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్‌లోని పెనుకొండ నుంచి గుర్గావ్‌లోని ఫరూఖ్‌నగర్‌కు భారీ సంఖ్యలో ఎస్‌యూవీ (Suv)లతో ప్రయాణిస్తున్న డబుల్ డెక్కర్ గూడ్స్ రైలు భుసావల్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రైల్వే కంట్రోలర్ తప్పు సిగ్నల్ ద్వారా రైలు అది తన మార్గంలో కాకుండా ట్రాక్ మారిపోయి నేరుగా ఖండ్వాకు స్టేషన్‌కు చేరుకోగా, కోచ్ పైకప్పు OHIకి ఇరుక్కుపోయింది. దీంతో దారి తప్పిన విషయం తెలిసింది.

ఖాండ్వా స్టేషన్‌కు రైలు చేరుకున్న తరువాత ట్రాక్ పై భాగంలో యార్డ్‌లో ఉన్న విద్యుత్ తీగకు గట్టిగా రుద్దినట్లుగా ఆగి, అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇది ప్రయాణికులతో కాకుండా రూ. 66 కోట్ల విలువ కలిగిన ఎస్‌యూవీ (Suv)లను రవాణా చేస్తుంది. ఇది దాదాపు 147 కి.మీ. తప్పుడు ట్రాక్‌పై ప్రయాణించింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించారు.
సెంట్రల్ రైల్వే CPRO డాక్టర్ స్వప్నిల్ నీలా మాట్లాడుతూ ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఇతర రైళ్లకు ఎలాంటి అంతరాయం కలగలేదని ఒక ప్రకటనలో తెలిపారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం గానీ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. తప్పిన రైలును అక్కడి నుంచి పూసావల్ వైపు మళ్లించారు.

ఈ డబుల్ డెక్కర్ గూడ్స్ రైలులోని 33 బోగీలలో రూ.60 కోట్ల విలువైన 264 SUVలు ఉన్నాయి. ఒక వేళ పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే కోట్లాది రూపాయల ఆర్థిక నష్టం కలిగేది. అదృష్టం వల్ల ఏం జరగలేదు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా స్టేషన్ అత్యంత రద్దీగా ఉండే మార్గం. ఇది నాలుగు జోన్‌లను కలిపే ముఖ్యమైన రూట్.
ప్రమాదం తర్వాత రైలు పై భాగంలో తగిలిన OHE లైన్ ఎత్తు పెంచడానికి సిబ్బందికి దాదాపు ఐదు గంటల సమయం పట్టింది. సాయంత్రం 5 గంటలకు రైలును ఇటార్సికి బదులుగా పూసావల్ వైపు పంపించారు. ఘటన తర్వాత రైల్వే విద్యుత్ తీగ ఎత్తును పెంచాలని అలాగే, ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ప్రమాదం జరిగేకంటే ముందు అప్రమత్తం అవ్వడం ముఖ్యం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








