ఆఫీస్‌కి వస్తామంటే ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తాం.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన గూగుల్!

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తర్వాత ఉద్యోగులు మరియు కంపెనీలు పనిచేసే తీరు పూర్తిగా మారిపోయింది. ఉద్యోగుల భద్రత కోసం కంపెనీలు ఇంటి వద్ద నుండే పనిచేసుకునే (వర్క్ ఫ్రమ్ హోమ్) సౌకర్యాన్ని కల్పించాయి. ఇప్పుడు వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ మాత్రం అలానే కొనసాగుతోంది. యజమానుల టెన్షన్ లేకుండా ఉద్యోగులు హాయిగా ఇంటి నుండి పనిచేసుకుంటుంటే, కంపెనీలు కూడా తమ నిర్వహణ ఖర్చులు తగ్గాయిలే అనుకుంటున్నాయి.

ఆఫీస్‌కి వస్తామంటే ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తాం.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన గూగుల్!

ప్రస్తుతం, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టి, మెల్లిగా ఇదవరకటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, కంపెనీలు కూడా తమ ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపిస్తున్నాయి. సుందర్ పిచాయ్ నేతృత్వంలోని అంతర్జాల దిగ్గజం గూగుల్ (Google) కూడా ఇప్పుడు తమ ఉద్యోగులు ఇక ఇంటి సౌకర్యాన్ని వదిలి కార్యాలయానికి రావడం ప్రారంభించాలని కోరింది. ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి వచ్చేలా ప్రేరేపించడానికి, గూగుల్ వారికి ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందిస్తోంది.

ఆఫీస్‌కి వస్తామంటే ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తాం.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన గూగుల్!

గూగుల్ ఇందుకోసం కొత్త "రైడ్ స్కూట్" (Ride Scoot) ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు అమెరికాకు చెందిన ఇ-స్కూటర్ తయారీదారు ఉనాగి (Unagi) తో ఓ భాగస్వామ్యాన్ని కూడా కుదుర్చుకుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఉనాగి బ్రాండ్‌కి చెందిన స్టైలిష్ ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్ "మోడల్ వన్" (Model One) ను నెలవారీ చందా (మంత్లీ సబ్‌స్క్రిప్షన్) యొక్క పూర్తి ధరను రీయింబర్స్ చేయడానికి గూగుల్ ముందుకు వచ్చింది. ఉద్యోగులు అంతరాయం లేకుండా కార్యాలయాలకు వచ్చి వెళ్లడానికి గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆఫీస్‌కి వస్తామంటే ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తాం.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన గూగుల్!

అమెరికన్ మార్కెట్లో ఉనాగి మోడల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Unagi Model One) ధర 990 డాలర్లుగా ఉంటుంది. అంటే మనదేశ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 75,000 లకు పైగా ఉంటుంది. ఉద్యోగులు ఇంత మొత్తాన్ని ఒక్కసారిగా చెల్లించడం కష్టం కాబట్టి, ఉనాగి మరియు గూగుల్ సంస్థలు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో ముందుకు వచ్చాయి. ఉద్యోగులు ప్రతినెలా 44.10 డాలర్ల ఈఎమ్ఐ‌ని చెల్లిస్తూ, వన్‌టైమ్ పేమెంట్‌గా 50 డాలర్ల రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ డబ్బు మొత్తాన్ని గూగుల్ తమ ఉద్యోగులకు పూర్తిగా రీయింబర్స్ చేస్తుంది.

ఆఫీస్‌కి వస్తామంటే ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తాం.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన గూగుల్!

అంటే, గూగుల్ ఉద్యోగులు ముందుగా తమ జేబు నుంచి డబ్బు చెల్లించి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, రీయింబర్స్ కోసం గూగుల్‌ని కోరితే పూర్తి డబ్బును కంపెనీ తమ ఉద్యోగులకు తిరిగి ఇచ్చేస్తుంది. అంటే, ఉద్యోగులకు ఈ స్కూటర్ పూర్తి ఉచితంగా లభిస్తుందన్నమాట. అయితే, ఈ ఆఫర్‌ను పొందడానికి గూగుల్ తమ ఉద్యోగులకు ఓ చిన్న షరతు పెట్టింది. అదేంటంటే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను చందాకు తీసుకునే ఉద్యోగి తప్పనిసరిగా నెలలో కనీసం తొమ్మిది రోజులు కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అలాంటి వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఆఫీస్‌కి వస్తామంటే ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తాం.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన గూగుల్!

నెలవారీ స్కూటర్ సబ్‌స్క్రిప్షన్ కోసం ఉద్యోగులను సైన్ అప్ చేయించాలనే లక్ష్యంతో Unagi వివిధ Google కార్యాలయాల్లో బూత్‌లను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. రైడ్ స్కూట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, గూగుల్ ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రావడానికి లేదా కనీసం బస్ స్టాప్‌కి దగ్గరగా వెళ్లి ఆఫీసుకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం. అమెరికాలోని మౌంటైన్ వ్యూ ప్రధాన కార్యాలయం మరియు సియాటెల్, కిర్క్‌ల్యాండ్, ఇర్విన్, సన్నీవేల్, ప్లేయా విస్టా, ఆస్టిన్ మరియు న్యూయార్క్ సిటీ నగరాలలో ఉన్న గూగుల్ ఉద్యోగుల కోసం ఈ ప్రోగ్రామ్ సెటప్ చేయబడింది.

ఆఫీస్‌కి వస్తామంటే ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తాం.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన గూగుల్!

ఉనాగి కేవలం గూగుల్ సంస్థతోనే కాకుండా సేల్స్‌ఫోర్స్ వంటి ఇతర పెద్ద కంపెనీలతో కూడా ఈ తరహా భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. వినియోగదారుల కోసం లాబీలో ఉనాగి స్కూటర్‌లను ఉంచడానికి ఇది అనేక హోటళ్లు మరియు నివాస కమ్యూనిటీలతో కలిసి పని చేస్తోంది. గూగుల్ ఉద్యోగులు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను టెస్ట్ రైడ్ చేసేందుకు ఉనాగితో కలిసి వివిధ కార్యాలయాలలో డెమో డేస్‌ని కూడా నిర్వహించనుంది.

ఆఫీస్‌కి వస్తామంటే ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తాం.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన గూగుల్!

ఇక ఉనాగి మోడల్ వన్ ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది గరిష్టంగా గంటకు 32 కిమీ వేగంతో ప్రయాణించగలదు. ఇందులో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 1.3 హెచ్‌పి పవర్ ను మరియు 32 ఎన్ఎమ్ టార్ క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులో 72,000 mAh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, గరిష్టంగా 25 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చు. ఇందులోని బ్యాటరీని చార్జ్ చేయడానికి సుమారు 4-5 గంటల సమయం పడుతుంది.

ఆఫీస్‌కి వస్తామంటే ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తాం.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన గూగుల్!

ఉనాగి మోడల్ వన్ ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్ ఫోల్టబిల్ డిజైన్‌ను మరియు తేలిక బరువను కలిగి ఉంటుంది కాబట్టి, ఎవరైనా దీనిని సులువుగా తమ వెంట తీసుకువెళ్లవచ్చు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో కూడా దీనిని సులువుగా క్యారీ చేయవచ్చు మరియు కార్యాలయం లోపల డెస్క్ వద్ద కూడా చార్జ్ చేసుకోవ్చచు. బ్రేకింగ్ సౌకర్యం కోసం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎలక్ట్రానిక్ బ్రేక్ ఇ-ఏబిఎస్ టెక్నాలజీ కూడా ఉంటుంది.

ఆఫీస్‌కి వస్తామంటే ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తాం.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన గూగుల్!

అంతేకాకుండా, ఇందులో నాన్-మెయింటెనెన్స్ రబ్బర్లు టైర్లు కూడా ఉపయోగించబడ్డాయి. ఇవి గాలి అవసరం లేని రబ్బర్ టైర్లు మరియు ఎక్కువ కాల మన్నుతాయి. రాత్రివేళల్లో కూడా రైడ్ చేయడానికి వీలుగా మోడల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1.8 వాట్ల బ్రైట్‌నెస్‌తో కూడిన ఎల్‌ఈడి హెడ్‌లైట్లు మరియు ఎల్‌ఈడి టెయిల్‌లైట్లు కూడా ఉపయోగించబడ్డాయి.

Article Published On: Sunday, April 10, 2022, 1:00 [IST]
English summary
Google and unagi launches ride scoot program to offer free electric scooters to employees
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+