ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన గూగుల్​.. తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా..

విమానాల్లో ప్రయాణించాలంటే మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్‌తో పోలిస్తే చాలా కష్టం. అందుకే విమాన ప్రయాణానికి దూరంగా ఉంటారు. అయితే సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై తక్కువ ధరలో ఫ్లైట్ జర్నీ చేసే అవకాశాన్ని కల్పించింది. అదెలా అంటే..

ఫ్లైట్ జర్నీ చేయాలనుకుంటే సమయం ఉన్న వారు సాధారణంగా తక్కువ ధరలో లభించే విమానాన్ని బుక్ చేసుకుంటారు. లేదంటే ఛార్జెస్ ఎంత ఉంటే అంత చెల్లించక తప్పదు. కానీ ఫ్లైట్ టికెట్లపై డబ్బులు ఆదా చేయాలనుకునే వారి కోసం ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

Cheaper-Flight-Booking

ప్రతి రోజూ లేదా తరచుగా విమాన టికెట్ల ధరలు మారుతుంటాయి. అయితే ఫ్లైట్ టికెట్ ధర ఏ సందర్భంలో తగ్గుతుందో చెప్పలేం. ఒక్కోసారి మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా ధర తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటి సమస్యను అధిగమించడం కోసమే గూగుల్ ఫ్లైట్స్.. కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది.. టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈ కథనంలో..

మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టికెట్ ధర గతంతో పోలిస్తే తక్కువా.. ఎక్కువా? అని పోల్చుకునే ఆప్షన్ గూగుల్ ఫ్లైట్స్‌లో ఎప్పటి నుంచో ఉందనే మీకు తెలిసి ఉండొచ్చు.. అయితే ఇప్పుడు బుక్ చేసుకోవాలా.. వద్దా? మున్ముందు ధర తగ్గే అవకాశం ఉందా వెయిట్ చేద్దామా.. అనే సందిగ్ధంలో మాత్రం ఉంటారు.

Cheaper-Flight-Booking

ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేసేందుకు ఇప్పుడు గూగుల్ తన గూగుల్ ఫ్లైట్స్ యాప్‌కు మరిన్ని ఫీచర్లు జోడిస్తోంది. దీనిని బట్టి గత టికెట్ ధరలను బట్టి ధరలు ఎప్పుడు తగ్గే అవకాశం ఉంటుందో కూడా తెలియనుంది. తద్వారా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారికి సమయంతో పాటు డబ్బూ ఆదా అవుతుంది.

ఉదాహరణకు ''మీరు బయలుదేరే రోజుకు 2 నెలల ముందు ఫ్లైట్ టికెట్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. లేదా టేకాఫ్‌కు దగ్గర పడుతున్న కొద్దీ ధరలు దిగొస్తున్నాయి.'' ఇలా మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది. దీని ద్వారా ప్రయాణికులు ఫ్లైట్ టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోవాలో ఒక అంచనాకు రావొచ్చని గూగుల్ తన బ్లాగ్‌లో తెలిపింది.

Cheaper-Flight-Booking

ఇంకా 'గూగుల్ ప్రైస్ ట్రాకింగ్' అనే కొత్త ఫీచర్‌ను గూగుల్ తీసుకొస్తోంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే.. ధరలు ఎప్పుడు దిగొచ్చినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. మీరు ప్రయాణించాలనుకున్న తేదీకి చాలా నెలల ముందు ఎప్పుడు ధరలు దిగొస్తే అప్పుడు నోటిఫికేషన్ వచ్చేలా ప్రత్యేకంగా తేదీల్ని సెట్ చేసి పెట్టుకునే ఆప్షన్ ఉంది. దీని కోసం మీరు కచ్చితంగా గూగుల్ అకౌంట్‌లో లాగిన్ అయి ఉండాలి.

అయితే కొన్ని విమాన ప్రయాణాలపై గూగుల్ ఒక రంగుతో కూడిన బ్యాడ్జ్ ఉంచుతుంది. దీనర్థం ఏంటంటే గత ట్రెండ్‌ను బట్టి టికెట్ రేటు ఇంతకంటే తగ్గే అవకాశం లేదు. ఒకవేళ ధరలు ఇంకా తగ్గితే మీరు చెల్లించిన అధిక మొత్తం గూగుల్ పే ద్వారా మీ అకౌంట్‌లో జమ చేస్తుంది. అయితే దీనిని ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలో అమలు చేస్తోంది గూగుల్.

వీటితో పాటు 2023 ప్రయాణాలకు సంబంధించిన ట్రెండ్స్‌ను కూడా గూగుల్ తన బ్లాక్ పోస్ట్‌లో షేర్ చేసింది. సాధారణంగా డిసెంబర్ మధ్యలో మొదలయ్యే క్రిస్మస్ హాలిడేస్ కోసం అక్టోబర్ నుంచే టికెట్ల బుకింగ్ షురూ అవుతుంది. పాత ట్రెండ్స్ ప్రకారం.. ఫ్లైట్ బయల్దేరే డేట్‌కు 22 రోజుల ముందు టికెట్స్ సగటు రేట్లు తక్కువగా ఉంటున్నాయని పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 31, 2023, 18:27 [IST]
English summary
Google introduces new feature to book cheaper flights here how it works
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+