గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ప్రాణాలమీదికే వచ్చింది.. ఇంతకీ ఎం జరిగిందో తెలుసా?

ప్రస్తుతం సొసైటీ టెక్నాలజీ వైపు పరుగులు తీస్తోంది. కావున చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు తెలియని ప్రదేశాల్లో కూడా గూగుల్ మ్యాప్ ఉపయోగించి ప్రపంచాన్నే సులభంగా చుట్టి వచ్చేయొచ్చు. అంతగా పెరిగింది మన టెక్నాలజి. అయితే ఈ టెక్నాలజీ అప్పుడప్పుడు మన కొంప ముంచుతుంది. కొన్ని సార్లు గూగుల్ మ్యాప్ తప్పు దోవ పట్టిస్తాయి. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా చదువుకున్నాము. అయితే ఇలాంటి మరో సంఘటన మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ప్రాణాలమీదికే వచ్చింది.. ఇంతకీ ఎం జరిగిందో తెలుసా?

నివేదికల ప్రకారం, కొట్టాయం సమీపంలోని పరాచల్ వద్ద ఒక కారు గూగుల్ మ్యాప్ అనుసరిస్తూ..కాలువలోకి దూసుకెళ్ళింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. అందులోని వారందరూ సునాయాసంగా తప్పించుకున్నారు. ఆ సమయంలో కారులో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకరు డాక్టర్ కాగా, మూడు నెలల పాప కూడా ఉంది. అంతే కాకూండా అదులో ఆ డాక్టర్ తల్లి మరియు వారి బంధువు ఒకరు ఉన్నారు.

గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ప్రాణాలమీదికే వచ్చింది.. ఇంతకీ ఎం జరిగిందో తెలుసా?

నిజానికి ఆ డాక్టర్ తిరువతుక్కల్ మరియు నట్టకోమ్ సిమెంట్ జంక్షన్ బైపాస్ మధ్య ఉన్నప్పుడు దారి తప్పిపోయారు. అయితే ఆ సమయంలో వారు చేరవలసిన ప్రాంతానికి గూగుల్ మ్యాప్ ద్వారా చేరుకోవాలని గూగుల్ మ్యాప్ అనుసరించారు. అయితే చివరకు ఒక కాలువలోకి చేరుకున్నారు.

గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ప్రాణాలమీదికే వచ్చింది.. ఇంతకీ ఎం జరిగిందో తెలుసా?

కారు నీటితో నిండిన కాలువలోకి వెళ్లే సమయంలో సమీపంలోని దుకాణంలో ఉన్న మహిళ చూసి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ప్రయాణికులకు వారికి సహాయం చేసి సురక్షితంగా బయటకు తీశారు. అయితే ఎవరికి ప్రమాదం జరగలేదు. కారు ఆ కాలువలో దాదాపు 300 మీటర్ల వరకు ప్రయాణించినట్లు మరియు దాని ముందు భాగం పూర్తిగా నేటితో నిడిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ప్రాణాలమీదికే వచ్చింది.. ఇంతకీ ఎం జరిగిందో తెలుసా?

ఇదిలా ఉండగా గత ఏడాది గూగుల్ మ్యాప్ అనుసరించి ఒక వ్యక్తి ఏకంగా నీటిలో మునిగి మరణించాడు. మృతుడు అహ్మద్ నగర్ లోని అకోలే పట్టణానికి చెందిన సతీష్ ఘులే అని తెలిసింది. ఈ సంఘటన అర్ధరాత్రి జరిగింది. కారు డ్రైవర్ కు రూట్ సరిగ్గా తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్ ఆన్ చేశాడు.

గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ప్రాణాలమీదికే వచ్చింది.. ఇంతకీ ఎం జరిగిందో తెలుసా?

అయితే గూగుల్ మ్యాప్ సుమారు 4 నెలల పాటు నీటి అడుగున ఉన్న వంతెన మార్గాన్ని చూపించింది. ఆ దారి ఆ డ్రైవర్ కి కొత్త కాబట్టి ముందు వెనుక ఆలోచించకుండా గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యాడు. ఆ వంతెన మార్గంలో ఎటువంటి హెచ్చరిక బోర్డులు కూడా లేదు. కావున సరిగ్గా ఆ డ్రైవర్ నదిలోకి వెళ్ళిపోయాడు. ఈ కారణంగా అతడు ప్రాణాలే కోపోవలసి వచ్చింది.

గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ప్రాణాలమీదికే వచ్చింది.. ఇంతకీ ఎం జరిగిందో తెలుసా?

ఇదే విధంగా మరొక సంఘటన గత ఏడాది జరిగింది. ఇందులో టాటా హారియర్‌లో ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి పూణే నుండి జబల్‌పూర్‌కు బయలుదేరాడు. గూగుల్ మ్యాప్ సహాయంతో పూణే నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. దారిలో అతను నాగ్‌పూర్‌లో ఉండాలని ప్లాన్ వేసుకున్నాడు. గూగుల్ మ్యాప్ ప్రకారం, అతను రాత్రి 11 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటాడు. కానీ గూగుల్ మ్యాప్ చూపించిన తప్పు దారి వల్ల 14 గంటలు డ్రైవింగ్ చేసి చివరికి ఒక కఠినమైన ప్రదేశంలో చిక్కుకున్నాడు.

గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ప్రాణాలమీదికే వచ్చింది.. ఇంతకీ ఎం జరిగిందో తెలుసా?

మున్నార్ లోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో డాక్టర్ నవాబ్ మరియు అతని కుటుంబం టాప్ స్టేషన్ మరియు వట్టవాడ గ్రామాన్ని సందర్శించారు. తిరిగి వచ్చిన తరువాత అతను హోటల్ చేరుకోవడానికి గూగుల్ మ్యాప్‌ని ఉపయోగించారు. ఆ ప్రాతం వారికి కొత్త కావడం వల్ల రహదారులు తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా అనుసరించారు.

గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ప్రాణాలమీదికే వచ్చింది.. ఇంతకీ ఎం జరిగిందో తెలుసా?

గూగుల్ మ్యాప్ ని అనుసరిస్తూ వెళ్తున్న కారణంగా కొంతసేపు డ్రైవింగ్ చేసిన తరువాత, అతను మెయిన్ రోడ్డు నుండి టీ తోటల మధ్య కఠినమైన రోడ్డుపై కారును డ్రైవ్ చేయవలసి వచ్చింది. ఇలాగే వారు దాదాపు ఐదు గంటల పాటు లోతట్టు ప్రాంతంలో ప్రయాణిస్తూనే ఉన్నారు. అయితే దాదాపు అర్ధరాత్రికి వారు ఒక రోడ్డులో ఇరుక్కుపోయారు. ఎందుకంటే ఆ దారి మొత్తం బురదతో నిండి ఉండటం వల్ల కారు ఇరుక్కుపోయింది. రాత్రిలో వారు చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కారు అడవుల్లోకి ప్రవేశించిన తర్వాత, వాహనదారుడు చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది.

గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ప్రాణాలమీదికే వచ్చింది.. ఇంతకీ ఎం జరిగిందో తెలుసా?

చివరికి ఇక చేసేది లేకపోడంతో డాక్టర్ నవాబ్ అగ్నిమాపక మరియు రెస్క్యూ విభాగాన్ని సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ మొబైల్ నెట్‌వర్కింగ్ చాలా తక్కువ. ఇంకా వారు తెలివితేటలను ఉపయోగించి సందేశం పంపడానికి ప్రయత్నిస్తారు. చివరకు సందేశాన్ని పంపడంలో అక్కడ నుంచి బయటపడగలిగారు.

గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ప్రాణాలమీదికే వచ్చింది.. ఇంతకీ ఎం జరిగిందో తెలుసా?

ఇలాటి సంఘటలు అప్పుడప్పుడూ వెలుగులోకివస్తూనే ఉన్నాయి. కావున కొత్త ప్రాంతాలకు వెళ్లే సమయంలో కేవలం గూగుల్ మ్యాప్ మీద మాత్రమే ఆధారపడకుండా, సమీపంలోకి వ్యక్తులను అడిగి తెలుసుకోవడం మంచిది. ఆ విధంగా స్థానికులు అడిగి తెలుసుకుంటే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం లేదు. కావున కొత్త ప్రాంతాల్లో ప్రయాణికులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే ఇలాటి సంఘటనలే జరుగుతాయి.

Most Read Articles

English summary
Google map takes car into canal in kottayam passengers miraculous escape
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X