Google Maps అప్‌డేట్ వెర్షన్‌తో ఇంధనం ఆదా అవుతుందా?
గతంలో కొత్త ప్రాంతాలకు వెళ్లేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చేది. దారి తెలియని ప్రాంతాల్లో గమ్యస్థానాలకు చేరుకొనేందుకు ఆ దారిలో ప్రయాణించేవారికి అడిగి ముందుకు సాగాల్సి వచ్చేది. లేదా ఆ ప్రాంతం గురించి అవగాహన ఉన్నవారికి వెంట పెట్టుకొని వెళ్లాల్సి వచ్చేది.
ఇంధనం ఆదా చేసుకోవచ్చు : అయితే గూగుల్ మ్యాప్స్ (Google Maps) అందుబాటులోకి వచ్చాక.. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టినట్లు అయింది. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ఎవరి సాయం లేకుండా కొత్త ప్రాంతాలను వెళ్లిపోవచ్చు. అయితే తాజాగా గూగుల్ మ్యాప్స్ యాప్ సరికొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త అప్‌డేట్ సాయంతో కార్లు, బైక్‌లలో ప్రయాణించే వారు ఇంధనాన్ని ఆదాచేసుకొనేందుకు సహాయపడుతుంది.

గూగుల్ మ్యాప్స్ అప్‌డేట్ కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా, కెనడా మరియు యురోపియన్ దేశాలకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలో భారత్‌లనూ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ఈ అప్‌డేట్ ప్రకారం ముందుగా వాహనం సమాచారాన్ని నమోదుచేయాలి. ఇంజిన్ సామర్థ్యం, ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలనుకుంటున్నామో ఆ వివరాలను కూడా నమోదుచేయాలి.
ఈ సమాచారం మిస్సింగ్ : తక్కువ సమయంలో గమ్యస్థానానికే చేరేలా ఉత్తమ మార్గాన్ని సూచిస్తుంది. ఫలితంగా ఆ ప్రయాణంలో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంది. అయితే ఈ గూగుల్ మ్యాప్ అప్‌డేట్‌లో మార్గమధ్యలో ఎక్కడ ఇంధనం నింపుకోవాలి అనే సమాచారం అందుబాటులో లేదని తెలుస్తోంది.

అయితే ఈ గూగుల్ మ్యాప్స్ అప్‌డేట్‌లో వాహనం సరైన వివరాలను నమోదు చేయాలి. అప్పుడు కారులో ఏ మార్గంలో వెళ్తే ఇంధనం ఆదా అవుతుంది, అదే బైక్‌లో ఏ రూట్‌లో వెళ్తే పెట్రోల్ ఆదా అవుతుందో వేర్వేరు జాబితాను అందిస్తుంది. ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ మరియు ఇతర రహదారి పరిస్థితుల వివరాలను అందిస్తుంది.
అయితే వాహనాల ఇంధన సామర్థ్యం డ్రైవింగ్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే గూగుల్ మ్యాప్స్ సూచించిన విధంగా మాత్రం ప్రయాణిస్తే కచ్చితంగా ఆదా చేసుకోవచ్చని తెలుస్తోంది. అయితే ఈ గూగుల్ మ్యాప్స్ అప్‌డేట్ త్వరలో భారత్ లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందని అనే కచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు.
వాహనదారుల సౌకర్యం కోసం గూగుల్ మ్యాప్స్‌లో వచ్చిన ఈ తాజా అప్‌డేట్ స్వాగతించబడింది. ఈ అప్‌డేట్ ఇన్ వెహికల్ మ్యాప్‌లతో అందించబడే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ మార్గాల్లో ప్రయాణించే వారి డేటాను గూగుల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఇది భవిష్యత్‌లో ఎక్కువ ప్రయోజనాలను ఇచ్చే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








