గూగుల్ మ్యాప్స్‌ని గుడ్డిగా నమ్మకండి వీరిలా యమలోకానికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి వస్తారు

ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా గూగుల్ మ్యాప్స్‌ని వినియోగించడం సర్వసాధారణం. అయితే కొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్ సూచించే దారి వాహనదారులకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతుంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా కొందరికి ఎదురవుతున్న వింత అనుభవాన్ని చూసి వాహనదారులు భూమి మీద నూకలున్నాయని అంటున్నారు.

తాజాగా కేరళలో జరిగిన ఓ సంఘటన దేశంలో సంచలనం రేపింది. గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి వెళ్తున్న కారు నదిలోకి దూసుకెళ్లింది. కారు నది మధ్యలో చిక్కుకున్నారు. ఊహించని ఘటనతో కంగుతున్న వారిని స్థానికులు కాపాడారు. స్థానికుల సహకారంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే వారి జర్నీ కాస్త విషాదంగా ముగిసేది. అసలేం జరిగిందంటే..

Google-Map-Wrong-Route

హైదరాబాద్‌కు చెందిన నలుగురు (ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు) కేరళలోని ప్రదేశాలను చుట్టుముట్టేందుకు తమ సొంత కారు ఫోర్డ్ ఎండీవర్‌లో బయలుదేరారు. కేరళలోని కొన్ని ప్రదేశాలను వాళ్లు సందర్శించారు. అయితే వెళ్లిన ప్రతి చోట వారు గూగుల్ మ్యాప్స్ వినియోగించి గమ్యాన్ని చేరుకున్నారు. కానీ ఆఖరుకు తమకు జరిగిన సంఘటనతో వారు ఒక్కసారిగా అవ్వక్కయ్యారు.

గూగుల్ మ్యాప్స్ సూచించిన మార్గంలో వెళుతుండగా వారి కారు నదిలోకి దూసుకెళ్లింది. ముందుగా దానిని రోడ్డుగా భావించిన డ్రైవర్ అలాగే ముందుకు తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని అది నది అని తెలుసుకొని షాక్ అయ్యారు. అందులోని ప్రయాణికులు ఒకరు చాకచక్యంగా ఒడ్డుకు చేరుకొని విషయాన్ని స్థానికులకు తెలియజేశారు.

Google-Map-Wrong-Route-Kerala

ఆ వెంటనే కారులోని మిగతా ముగ్గురిని స్థానికులు తాళ్లు, ఇతర వస్తువుల సహాయంతో బయటకు తీశారు. దీంతో వారి విహార యాత్ర కాస్త చేదు అనుభవాన్ని మిగిల్చింది. గూగుల్ మ్యాప్‌ని గుడ్డిగా నమ్మేసి నదిలోకి దూసుకెళ్లిందని చెప్పడంతో విషయం తెలుసుకున్న స్థానికులు నోరేళ్ల పెట్టారు. సమయానాకి వారంతా స్పందిచడంతో ప్రాణాలతో బయటపడ్డారు లేదంటే వారు ప్రాణాలు కోల్పోయే వారని తెలిపారు.

మధ్యాహ్నం 2-3 గంటలకు భారీ వర్షం ప్రారంభమైందని.. దీంతో రోడ్లన్ని జలమయమయినట్లు పర్యాటకుడిలో ఒకరు తెలిపారు. మేము గంటకు 10 కిమీ వేగం కంటే నెమ్మదిగా వెళ్తున్నామని అయితే ఒక్కసారిగా ముందు టైర్లు నీటిలోకి వెళ్లిందని వారు చెప్పారు. తేరుకునే లోపు కారు మొత్తం నదిలోకి వెళ్లి తేలియాడటం ప్రారంభమైనందని చెప్పారు. వెంటనే విండోస్‌ తీసి బయటకు దూకామని.. ఎలాగోలా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నామని పర్యాటకుడు వివరించాడు.

గూగుల్ మ్యాప్స్ లో 95% అక్యూరెన్సీ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మూసి వేయబడిన రోడ్లు అప్డేట్ చేయకపోవడం వల్ల అటువైపు దారి ఉన్నట్లు చూపిస్తుంది. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు టెక్నాలజీ సహాయంతో పాటు స్థానికులను గమ్య స్థానాన్ని అడిగి తెలుసుకోవడం ఉత్తమం. లేదంటే ఇలాంటి చిక్కులు కచ్చితంగా వస్తాయి. ఇంకా అవసరమైతే స్థానిక స్నేహితుల సహకారం తీసుకోవడం సుఖవంతమైన జర్నీకి తోడ్పడుతుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, May 27, 2024, 10:40 [IST]
English summary
Google maps leads tourists to the wrong route causing their car to drown in a canal
Read more on: #off beat #car #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+