గూగుల్‌ మ్యాప్స్‌లో జబర్దస్త్‌ ఫీచర్లు.. ఇక ఏ టెన్షన్‌ లేకుండా వెళ్లవచ్చు!!

ప్రస్తుతం ఎవరైనా ఎక్కడికైనా వెళ్లాలంటే గూగుల్ మ్యాప్స్ ఆన్‌ చేస్తే చాలు ఏం చక్కా లక్ష్యానికి చేరవేస్తుంది. కచ్చితమైన సమాచారంతో చేరుకోవాల్సిన ప్రదేశాన్ని గూగుల్ మ్యాప్స్‌ సూచిస్తుంది. ఇప్పుడు మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చే ప్రయత్నంలో గూగుల్ ప్రత్యేకంగా భారతీయల కోసం అనేక కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఈ యాప్ ఇప్పుడు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు స్థానిక భాగస్వామ్యంతో వినియోగదారులకు మరిన్నీ సేవలను అందించనుంది. ఈ మార్పుల వల్ల చిన్న చిన్న పొరపాట్లకు బ్రేక్‌ పడుతుందని టెక్ దిగ్గజం తెలిపింది. ప్రస్తుతం ఈ నావిగేషన్ యాప్‌లో ఇరుకైన రోడ్లు, ఫ్లైఓవర్లు, ఈవీ ఛార్జింగ్ లొకేటర్లు వంటి సమాచారాన్ని జోడించనున్నారు. ఓఎన్డీసీ, నమ్మ యాత్ర సహకారంతో మెట్రో ట్రిప్స్‌కి సంబంధించిన సమాచారాన్ని కూడా వినియోగదారులు తెలుసుకోవచ్చు.

ఇరుకైన రోడ్ అలర్ట్: కొత్తగా అప్‌డేట్‌ చేసిన గూగుల్ మ్యాప్స్‌లో ఇకపై ఇరుకైన లేదా రద్దీగా ఉండే రోడ్లకు సంబంధించిన సమాచారాన్ని గూగుల్‌ ముందే ఫోర్‌ వీలర్స్‌ వాహనదారులను అప్రమత్తం చేస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఏఐ మోడల్‌ని అభివృద్ధి చేసింది. ఇందులో శాటిలైట్‌ చిత్రాలు, స్ట్రీట్ వ్యూ, రోడ్డు రకాలు, భవనాల మధ్య దూరం, ఇతర ఇరుకైన సెక్షన్లు మరియు మరెన్నో ఉన్నాయి.

Google-Maps-New-Features

ప్రయాణ సమయంలో ఎక్కువ జాప్యం లేకుండా ఇరుకైన రహదారులను నివారించడానికి ఫోర్‌ వీలర్స్‌ వాహనాలను హెచ్చరించడానికి ప్రస్తుత ఏఐ రూటింగ్ అల్గారిథమ్స్‌లో అదనపు సమాచారాన్ని జోడిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ చర్య ఇరుకైన రహదారుల రద్దీని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే దానికి అనువైన రూట్‌లను చూపించడం ద్వారా త్వరగా లక్ష్యానికి చేరుకుంటారు. ఇది ఓ విధమైన సాఫీ ప్రయాణాన్ని అందిస్తుంది.

ఇక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, ఇండోర్, భోపాల్, భువనేశ్వర్, గౌహతి నగరాల్లో ఆండ్రాయిడ్ డివైజ్‌లలో మాత్రమే గూగుల్ ఈ కొత్త ఫీచర్‌ని ప్రస్తుతానికి అందుబాటులోకి తెచ్చింది. రానున్న నెలల్లో ఐఓఎస్ డివైజ్‌లతో పాటు మరిన్ని నగరాల్లోనూ తీసుకురానున్నట్లు గూగుల్‌ స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గూగుల్‌ వెల్లడించింది. హైదరాబాద్‌ వంటి నగరాల్లో నివసించే ప్రయాణికులు ఈ ఫీచర్ సహాయ పడుతుంది.

Google-Maps-New-Updates

ఫ్లై ఓవర్ అలర్ట్: యూజర్ల చిరకాల కోరిక మేరకు గూగుల్ మ్యాప్స్ ఎట్టకేలకు ఫ్లైఓవర్లను చూపించనుంది. అవసరమైనప్పుడు మీరు వెళ్లాల్సిన మార్గానికి అనువుగా ముందే ఇది సంకేతాలను అందిస్తుంది. ఇది వినియోగదారులు ఫ్లై ఓవర్స్‌ సమీపిస్తున్న సమయంలో తికమక కాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. మ్యాప్ మై ఇండియాకు చెందిన మ్యాప్స్ యాప్‌లో విజువల్ రిఫరెన్స్ తో ఫ్లైఓవర్ ఫీచర్‌ని కొంతకాలంగా ప్రదర్శిస్తున్నారు.

ఫోర్ వీలర్, టూ వీలర్ యాక్టివ్ నావిగేషన్ కోసం గూగుల్ భారతదేశంలోని 40 నగరాల్లో ఫ్లైఓవర్ అలర్ట్‌ని అమలు చేస్తోంది. ఆండ్రాయిడ్ డివైజ్‌లు, ఆండ్రాయిడ్ ఆటో రెండింటిలోనూ ఈ అప్డేట్ అందుబాటులో ఉంటుంది. త్వరలో ఐఓఎస్ డివైజ్‌, ఆపిల్ కార్ ప్లేలో కూడా అందుబాటులో తీసుకువస్తామని కంపెనీ తెలిపింది.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు: ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈవీ స్టేషన్స్‌ తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. పరిమిత సంఖ్యలో స్టేషన్లు ఉండటంతో వాహనదారులు ఆందోళనకు లోనవుతున్నారు. దీంతో ఛార్జింగ్‌ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునే సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు. ఈ ఆప్షన్‌ గూగుల్ మ్యాప్స్ మరియు గూగుల్ సెర్చ్ రెండింటిలోనూ పనిచేస్తుంది. ఈవీ ఛార్జింగ్ లొకేటర్లను కూడా అందిచనున్నారు.

ఎలక్ట్రిక్ పే, ఏథర్, కజామ్ (Kazam) మరియు స్టాటిక్ (Statiq)లతో భారతదేశంలో నెలకొల్పిన ఈవీ ఛార్జింగ్ ప్రొవైడర్లతో కలిసి 8,000 ఛార్జింగ్ స్టేషన్లను ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్, టూ వీలర్స్ రెండింటికీ ప్లగ్ టైప్స్, రియల్ టైమ్ లభ్యత వంటి సమగ్ర సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. వినియోగదారులు నిర్దిష్ట ఛార్జర్ రకాలను ఫిల్టర్ కూడా చేయవచ్చు.

మీరు ఓ ప్రదేశానికి చేరుకునే ముందు స్టేషన్ ఓపెన్ చేసి ఉంటుందో లేదో తనిఖీ చేయవచ్చు. ద్విచక్ర వాహనాల కోసం ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్న పూర్తి డీటైల్స్‌ గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోనే మొదటి సారి పూర్తి స్థాయిలో ఈవీ అప్‌డేట్స్‌ కలిగి ఉన్న దేశంగా భారతదేశం పేరుగాంచింది.

More from DriveSpark

Article Published On: Friday, July 26, 2024, 17:07 [IST]
English summary
Google maps new features help in narrow road ev charging stations and flyover alert
Read more on: #auto news #google #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+