రూట్ అడిగినందుకు ఏకంగా కాలువలోకి దింపింది.. గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మితే ఇలాగే ఉంటుంది

తెలియని అడ్రస్‌కు వెళ్లడానికి అందరూ కూడా గూగుల్ మ్యాప్స్ పైనే ఆధారపడుతుంటారు. దీని ఆధారంగానే ఆన్‌లైన్ డెలివరీలు, స్విగ్గి, జోమాటో వంటి సంస్థలు తమ వినియోగదారులకు ఫుడ్ డెలివరీలు అందిస్తుంటాయి. కొత్త ప్రాంతాలకు వెళ్లడానికి అడ్రస్ టైప్ చేయగానే నేరుగా అక్కడికే ఈ మ్యాప్స్ తీసుకెళ్తుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది గూగుల్ మ్యాప్స్ కొత్తగా అప్‌డేట్ అవుతూనే ఉంది. అయితే ఎన్ని అప్‌డేట్‌లు తీసుకువచ్చినప్పటికి కూడా కొన్ని సార్లు గూగుల్ మ్యాప్స్ తప్పుడు అడ్రస్, దారిని చూపించిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మ్యాప్స్‌లో అడ్రస్ ఎంటర్ చేయగానే నేరుగా అదే ప్రాంతానికి తీసుకువెళ్తుందని గుడ్డిగా నమ్మడం కూడా మంచిది కాదని తాజాగా జరిగిన యాక్సిడెంట్‌‌లను చూస్తే అర్థం అవుతుంది.

కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో కొంతమంది వ్యక్తులు ఒక వివాహనికి మారుతీ వ్యాగన్ఆర్ కారులో వెళ్తున్న క్రమంలో గూగుల్ మ్యాప్స్ కారణంగా తప్పుడు దారిలో వెళ్తూ నిర్మాణంలో ఉన్న ఒక వంతెన పై నుంచి క్రింద పడి మృతి చెందారు. ఇది జరిగిన కొద్ది రోజులకే తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే ఇప్పుడు జరిగింది. అదే యూపీ రాష్ట్రంలోనే చోటు చేసుకోవడం గమనార్హం.

Google Maps Showed Wrong Way

అయితే ఈ ఘటనలో కారులో ఉన్న వారు తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాళ్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాకు చెందినటువంటి ముగ్గురు యువకులు టాటా టిగోర్ కారులో ఒక వివాహనికి హాజరు కావడానికి పిలిభిత్‌కు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అడ్రస్ కోసం గూగల్ మ్యాప్స్‌పై ఆధారపడ్డారు. అది చూపించిన దారిలోనే కారును పోనిస్తున్నారు.

ఇలా వెళ్తున్న క్రమంలో గూగుల్ మ్యాప్స్ కాలాపురా గ్రామ సమీపంలోనికి రాగానే దారిని కెనాల్‌ వైపు చూపించింది. దీంతో వారు కారును ఆ రూట్‌గా తీసుకెళ్లడంతో కాలువ వైపు ఉన్న వంతెన విరిగిపోయి ఉండగా, కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కంట్రోల్ చేయలేకపోవడంతో కారు లోతైన కాలువలోకి పడిపోయింది. అదృష్టం కొద్ది కారులో ఉన్న ముగ్గురికి గాయాలు మాత్రమే అయ్యాయి. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

Google Maps Showed Wrong Way Again Car Falls In To Canal In UP

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న స్థానికులు కారులో చిక్కుకున్న వారిని కాపాడి బయటకు తీశారు. ఈ విషయం పోలీసులకు, అధికారులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని పెద్ద క్రేన్‌ను తెప్పించి వెంటనే టాటా కారును బయటకు తీశారు. ఆ తరువాత గాయపడి వారి వద్ద నుంచి ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని దివ్యాన్షు అతని ఫ్రెండ్స్‌గా ఉంచారు.

గూగుల్ మ్యాప్స్‌ ఆధారంగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కారులో ఉన్న ముగ్గురు కూడా తెలిపారు. నావిగేషన్ తప్పు దారిని చూపించడంతో కారు 15 అడుగుల లోతైన కాలువలోకి పడిపోయింది. గూగుల్ మ్యాప్స్‌ను నమ్మినందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని వారు తెలిపారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే గుడ్డిగా టెక్నాలజీపై ఆధారపడకూడదని తెలుస్తుంది. ఈ ఒక్క ఘటనే కాకుండా నావిగేషన్ తప్పుగా చూపించడం వలన గతంలో చాలా యాక్సిడెంట్‌లు జరిగాయి.

Car Falls In To Canal

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 4, 2024, 14:20 [IST]
English summary
Google maps showed wrong way again another car falls in to canal
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+