'గూగుల్ మ్యాప్' లో కొత్త ఫీచర్ రానుంది.. ఇలా చేస్తే టోల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు

ప్రస్తుతం ప్రపంచమే అభివృద్ధివైపు పరుగులుతీస్తోంది. ఈ తరుణంలో టెక్నాలజీ కూడా అదే వేగంతో అభివృద్ధి చెందుతోంది. రోజురోజుకి కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకురావడంతో కొత్త కొత్త ఫీచర్స్ మానవాళికి అనుకూలంగా వచ్చేస్తున్నాయి. ఈ రోజు మనం ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా, లేదా.. వెళ్లాలనుకున్నా మొదట గూగుల్ మ్యాప్ (Google Map) లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే తెలియని కొత్త ప్రదేశంలో సైతం సరైన గమ్యాన్ని చేర్చడానికి గూగుల్ మ్యాప్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

అయితే ఇప్పుడు ఈ గూగుల్ మ్యాప్ వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉండే విధంగా మరింత ఆధునికంగా అప్డేట్ కానుంది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

'గూగుల్ మ్యాప్' లో కొత్త ఫీచర్ రానుంది.. ఇలా చేస్తే టోల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు..

గూగుల్ కంపెనీ ఎప్పటికప్పుడు తన గూగుల్ మ్యాప్‌ను అప్‌డేట్‌ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, మీరు హైవేపైన మీ ప్రయాణం మొదలుపెట్టగానే మీ గమ్యస్థానం చేరే వరకు వచ్చే టోల్ గేట్స్ మరియు దానికి అయ్యే టోల్ చార్జస్ వంటి వాటిని కూడా ఆ గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది నిజంగా చాలా ఉపయోగకరమైన అప్డేట్. దీనిని భారతదేశంలో ప్రవేశపెట్టడానికి గూగుల్ కంపెనీ సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

'గూగుల్ మ్యాప్' లో కొత్త ఫీచర్ రానుంది.. ఇలా చేస్తే టోల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు..

ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత మీరు ఎక్కడికి వెళ్లాలో అందులో టైప్ చేసి డైరెక్షన్ బటన్ నొక్కగానే మొత్తం సమాచారం మీకు కనిపిస్తుంది. అంటే మీరు వెళ్లే హైవేపైన ఎన్ని టోల్ గేట్స్ రానున్నాయి. దానికి అయ్యే టోల్ ఫీజు ఎంత అనేది కూడా మీకు తెలుస్తుంది. ఆ సమయంలో మీరు టోల్ గేట్ లేని రోడ్డుపైన వెళ్లాలనుకుంటే కూడా గూగుల్ మ్యాప్ మీకు ఆ రోడ్డుని చూపిస్తుంది. ఈ విధంగా చేసినట్లయితే మీకు కొంత డబ్బు కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది.

'గూగుల్ మ్యాప్' లో కొత్త ఫీచర్ రానుంది.. ఇలా చేస్తే టోల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు..

నిజానికి ఈ ఫీచర్‌ను కంపెనీ ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో మొదటి సారిగా ప్రకటిచింది. అయితే ఇప్పుడు, అంటే దాదాపు రెండు నెలల తర్వాత, ప్రముఖ టెక్ దిగ్గజం ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో గూగుల్ మ్యాప్ వినియోగదారుల కోసం ఈ ఫీచర్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. గూగుల్ గతంలో యుఎస్, ఇండోనేషియా మరియు జపాన్ వినియోగదారుల కోసం ఈ ఫీచర్‌ను ప్రకటించింది. కావున భారతదేశంలో ఈ ఫీచర్స్ త్వరలోనే అందుబాటులోకి వచ్చేస్తుంది.

'గూగుల్ మ్యాప్' లో కొత్త ఫీచర్ రానుంది.. ఇలా చేస్తే టోల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు..

ఈ అప్డేటెడ్ ఫీచర్ వల్ల మీరు వారంలో ఎంత టోల్ చెల్లించారు అనే విషయాలు స్పష్టంగా తెలుస్తుంది. ఆ సమయంలో డబ్బును ఆదా చేసుకోవడానికి టోల్ గేట్స్ లేని రోడ్లను కూడా ఎందుకోవచ్చు. ఈ విధంగా చేసినప్పుడు మీరు చాలా వరకు డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సదుపాయం అభివృద్ధి చెందిన జపాన్ మరియు ఇండోనేషియా వంటి దేశాల్లో అమలులో ఉంది. రానున్న రోజుల్లో ఈ ఫీచర్స్ మరిన్ని దేశాలలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

'గూగుల్ మ్యాప్' లో కొత్త ఫీచర్ రానుంది.. ఇలా చేస్తే టోల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు..

తెలియని చోట లేదా అవసరమైన చోట ఎక్కడైన మీరు ప్రయాణాన్ని ప్రారంభించే ముందు టోల్-ఫ్రీ మార్గాలను ఎంచుకోవడానికి వాహన వినియోగదారులకు గూగులే మ్యాప్స్ చాలా ఉపయోగపడతాయి. సాధారణంగా తెలియని ప్రాంతంలో కొత్త రోడ్లను వెతుక్కోవడానికి కొంత ఎక్కువ సమయం పట్టవచ్చు. అయితే ఈ టోల్-ఫ్రీ ఆప్సన్ ఎంచుకున్న తరువాత మీరు గమ్యాన్ని చేరుకోవడానికి ఎక్కువ ఇబ్బంది పడాల్సిన వసరం ఉండదు.

'గూగుల్ మ్యాప్' లో కొత్త ఫీచర్ రానుంది.. ఇలా చేస్తే టోల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు..

ప్రస్తుతం భారతదేశంలో వాహనాలు తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ కలిగి ఉండాలి. ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే ఎక్కువ మొత్తంలో టోల్ చెల్లించాల్సి వస్తుంది. ఏ టోల్ గేటులో అయినా డబ్బు కట్టనిదే ఎంట్రీ ఉండదు. ఈ విషయం అందరికి తెలిసిందే. కావున ఇలాంటి సమయంలో మీకు ఈ కొత్త ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. తద్వారా మీరు టోల్ లేని రహదారుల్లో ముందుకు వెళ్ళవచ్చు.

'గూగుల్ మ్యాప్' లో కొత్త ఫీచర్ రానుంది.. ఇలా చేస్తే టోల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు..

యునైటెడ్ స్టేట్స్‌లోని గూగుల్ మ్యాప్స్ యూజర్లు ఇప్పుడు బయటకు వెళ్లే ముందు గూగుల్ మ్యాప్స్‌లో ఎయిర్ క్వాలిటీ లేయర్‌ని కూడా చెక్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. దీని సాయంతో వాహన వినియోగదారులు తమకు నచ్చిన రోడ్డుని ఎంచుకుని ముందుకు వెళ్ళవచ్చు. ఇది కూడా వాహన వినియోగదారులకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.

'గూగుల్ మ్యాప్' లో కొత్త ఫీచర్ రానుంది.. ఇలా చేస్తే టోల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు..

భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మాత్రమే కాదు టోల్ ఫీజులు కూడా భారీగా పెరిగిపోయాయి. ఒక వైపు ఇంధన ధర బాదుడు, మరోవైపు టోల్ చార్జీల బాదుడు. ఇంధన ధరల బాదుడు నుంచి తప్పించుకునే అవకాశం లేదు. అయితే ఈ టోల్ ఫీజుల బాదుడు నుంచి తప్పించుకోవడానికి రానున్న ఈ గూగుల్ మ్యాప్ అప్డేటెడ్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 15, 2022, 14:31 [IST]
English summary
Google maps will show estimated toll tax details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+