సీట్ బెల్ట్ ధరించకపోవటం వల్లనే గోపీనాథ్ ముండే మృతి చెందారా..?

By Ravi

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి గోపినాథ్ ముండే ఈరోజు (మంగళవారం) ఢిల్లీ విమానాశ్రయానికి కారులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ సంఘటన ఉదయం 6.20 గంటల ప్రాంతంలో జరిగింది. ఢిల్లీ నుండి ముంబై వెళ్లేందుకు విమానాశ్రయానికి ముండే తన కారులో వెళ్తుండగా, సిగ్నల్ జంప్ చేసి వచ్చిన టాటా ఇండికా కారు ముండే కారును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.

ప్రమాద సమయంలో ముండే వెనుక ప్యాసింజర్ సీటులో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో గోపీనాథ్ ముండే సీట్ బెల్ట్ ధరించలేదని సమాచారం. సిగ్నల్ జంప్ చేసి వచ్చిన ఇండికా కారు ముండే కూర్చున్న వైపు (ప్యాసింజర్ సైడ్) ఢీకొట్టడంతో ఆయన తూలిపడటం (సీట్ బెల్ట్ పెట్టుకోని కారణంగా) ఫలితంగా తీవ్రగాయాలు, రక్తస్రావం కావడం జరిగింది.


ప్రమాదం జరగగానే కారు డ్రైవర మరియు ముండే వ్యక్తిగత సహాయకుడు కలిసి ఆయను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ, గాయాల తీవ్రత అధికంగా ఉండంతో ఆయన చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. గోపీనాథ్ వయస్సు 64 ఏళ్లు. ఆయన మరణవార్తను బిజెపి నేతలు ధృవీకరించారు. ముండే హఠాణ్మరం బిజెపికి తీరని లోటుగా మారింది.

అసలు సీట్ బెల్ట్ ఎందుకు ధరించాలి..?
కారును 2 కిలోమీటర్ల దూరం నడిపినా లేదా 200 మైళ్ల దూరం నడిపినా సరే సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. సీట్ బెల్టులు అన్ని సంధర్భాల్లో దానిని ధరించిన వారి ప్రాణాలను రక్షిస్తాయని చెప్పలేం, కానీ ఏ కాస్త అవకాశం దొరికినా వారిని ప్రాణాపాయం నుంచి బయటపడేసే అవకాశం ఉంటుంది.

చలనంలో ఉన్న కారులో మనం కూర్చున్నామంటే, కారుతో పాటుగా మనం కూడా వేగంగా వెళ్తున్నట్టే లెక్క. అలాంటప్పుడు, దురదృష్టవశాత్తు ఎదురుగా వచ్చే వాహనాన్ని ఢీకొనడం వల్లనో లేదా ఏ డివైడర్‌నో, కరెంటు స్తంభాన్నో ఢీకొనడం వల్లనో కారు ఉన్నట్టుండి ఆగిపోతుంది. కానీ కారుతో పాటుగా చలనంలో ఉన్న మన శరీరం మాత్రం ఆ వేగాన్ని నియంత్రించుకోలేదు.

Seat Belt

ఎదురుగా వచ్చే/ఉన్న అడ్డంకిని తగిలి కారు ఆగినంత వేగంగా మన శరీరం ఆగలేదు కాబట్టి, అప్పటిదాకా ఆ కారు ప్రయాణిస్తున్న వేగంతోనే మన శరీరం కూడా ముందుకు తూలుతుంది. ఆ సమయంలో కారు ముందు సీటులో కూర్చున్న వారి ఛాతీ డాష్‌బోర్డునో లేక స్టీరింగ్ వీల్‌‌నో (డ్రైవర్) బలంగా ఢీకొంటుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటే, ఛాతీ ఎముకలు విరగడం, విరిగిన ఎముకలు ఛాతీలోకి చొచ్చుకుపోయి ఊపిరితిత్తులను, గుండెను ఛిద్రం చేయడం వంటి ప్రమాదాలు సంభవించవచ్చు.

రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న అనేక మంది సీట్ బెల్ట్ ధరించకపోవటం వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఇకనైనా మేల్కొని, కారులో ప్రయాణిస్తున్న ఏ సీట్లో కూర్చున్నా సరే సీట్ బెల్ట్ ధరించడం మర్చిపోకండి..!

More from DriveSpark

Article Published On: Tuesday, June 3, 2014, 10:25 [IST]
English summary
Rural Development Minister Gopinath Munde has passed away. Top BJP leaders have confirmed the news. The BJP leader had met with a major accident near the Delhi airport. Munde suffered cardiac arrest during treatment at AIIMS.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+