డబుల్ రన్‌టైమ్ ఫీచర్‌తో GoPro Hero 12 Black కెమెరా లాంఛ్.. ధర ఎంతంటే.!!

భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న కెమెరాల్లో గోప్రో(GoPro) ఒకటి. ఈ కెమెరాలు యాక్షన్ కెమెరాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. అందుకే మన దేశంలో ఎక్కువగా గోప్రో కెమెరాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో గోప్రో కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.

ఈ యాక్షన్ కెమెరాల ప్రత్యేకత ఏంటంటే.. వీటి ద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు పర్ఫెక్ట్‌గా వీడియో షూట్ చేయవచ్చు. మీరు ఈజీగా క్యారీ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి ఇంత ప్రాక్టికల్‌గా ఉన్న కెమెరాలు ఇంకేవైనా ఉన్నాయా ఆలోచించాల్సిందే. అందులో GoPro యాక్షన్ కెమెరాలు ఇప్పుడు ఔత్సాహికుల ప్రయాణంలో చోటు సంపాదించుకున్నాయి.

GoPro-Hero12-Black

గోప్రో తన కొత్త ప్రొడక్ట్ Hero12 బ్లాక్‌ కెమెరాను సెప్టెంబర్ 6(బుధవారం)న విడుదల చేసింది. ఈ సారి ప్రొఫెషనల్ యూజర్లు, ఇంకా కంటెంట్ క్రియేటర్లకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, ఈ కెమెరాను గోప్రో ప్రవేశపెట్టింది. ఇంకా బ్యాటరీ లైఫ్‌ను పొడిగించింది. దీని ద్వారా ఇది మునుపటి మోడళ్లతో పోలిస్తే రెట్టింపు రన్‌టైమ్‌ను అందిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

డబుల్ రన్‌టైమ్, 5.3K మరియు 4K HDR వీడియో, వైర్‌లెస్ ఆడియో సపోర్ట్ ఇంకా కొత్త షూటింగ్ మోడ్‌లతో Hero 12 బ్లాక్ కెమెరాను ప్రవేశపెట్టింది. మెరుగైన హైపర్‌స్మూత్ 6.0 వీడియో స్టెబిలైజేషన్ మరియు మ్యాక్స్ లెన్స్ మోడ్ 2.0 ఫీచర్‌తో కెమెరాను విడుదల చేసినట్లు గోప్రో తెలిపింది.

GoPro-Hero12-Black

దేశీయ మార్కెట్లో కొత్త GoPro Black Hero 12 ధర రూ. 45,000 గా ఉంది. క్రియేటర్ ఎడిషన్ కెమెరా ధర రూ. 65,000గా ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ మరియు విజయ్ సేల్స్‌తో సహా కంపెనీ ఆన్‌లైన్ రిటైల్ భాగస్వాముల ద్వారా యాక్షన్ కెమెరాలను ప్రీ ఆర్డర్ చేసుకునే సదుపాయం ఉంది.

ఈ రెండు కెమెరాలను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాముల నుంచి ఆర్డర్ చేసుకోవడాని సెప్టెంబర్ 13, 2023 సాయంత్రం 6:30 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నాయి. కాగా మరో ప్రొడక్ట్ గోప్రో మాక్స్ లెన్స్ మోడ్ 2.0 మోడల్ నవంబర్ చివర్లో అమ్మకానికి వస్తుందని ప్రకటించింది.

GoPro-Hero12-Black

Hero 12 Black కెమెరా గోప్రోలోని పాత మోడల్‌లా కనిపిస్తున్నప్పటికీ, కొత్త మోడల్‌లో కొన్ని కీలక మార్పులు చేశారు. ఇందులో 5.3K మరియు 4K రిజల్యూషన్‌తో చిత్రీకరించబడిన వీడియోలకు HDR సపోర్ట్‌ను తీసుకువచ్చారు. ఇది 9:16 యాస్పెక్ట్ రేషియో ఫొటోలు మరియు వీడియోలను షూట్ చేయడానికి కొత్త వర్టికల్ క్యాప్చర్ మోడ్‌ను కూడా కలిగి ఉంది.

టైమ్‌వ్రాప్, టైమ్ లాప్స్, నైట్ ఎఫెక్ట్స్ , ఇంకా నైట్ లాప్స్ ఇందులో 8:7 మోడ్‌లో అందుబాటులో ఉన్నాయి. GoPro Hero 12 Black ఆటోబూస్ట్‌తో హైపర్‌స్మూత్ 6.0 వెర్షన్‌తో వస్తుంది. కొత్త మోడల్ 10-బిట్ కలర్స్‌తో GP లాగ్ + LUTSకి కూడా మద్దతు ఇస్తుందని కంపెనీ తెలిపింది.
ఇంకా ఈ కొత్త కెమెరాలో ఇంటర్వెల్ ఫొటో అనే ఆప్షన్‌ను కూడా తీసుకువచ్చింది. దీని ద్వారా మీరు డిఫరెంట్‌గా వీడియో మరియు ఫోటోలను క్యాప్చర్ చేయడానికి పవర్ టూల్స్‌లో దీనిని యాడ్ చేశారు. ఇంటర్వెల్ ఫొటో ప్రతి 0.5 సెకన్ల నుంచి ప్రతి 120 సెకన్ల వరకు నిర్ణీత వ్యవధిలో ఫొటో క్యాప్చర్‌ చేస్తుంది.

ఇంకా హీరో 12 బ్లాక్ కెమెరాలో వైర్‌లెస్ ఆడియో రికార్డింగ్‌ను కూడా ఉంది. ఇది బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లను GoProకి కనెక్ట్ చేయడానికి, ఆడియోను రికార్డ్ చేయడానికి, వాయిస్ ఆదేశాలను వైర్‌లెస్‌గా ఉపయోగించడానికి మరియు కెమెరా వార్నింగ్స్‌ను తెలుసుకోవడానికి దోహదపడుతుంది.

GoPro Hero 12 Black ఒకేసారి నాలుగు బ్లూటూత్ పరికరాలకు సపోర్ట్ ఇవ్వడం ఇందులో మరో ప్రత్యేకత. ఈ మోడల్‌లో GP2 ప్రాసెసర్‌ను అమర్చారు. హీరో 12 బ్లాక్ 8:7 యాస్పెక్ట్ రేషియోతో 1/1.9-అంగుళాల సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. కెమెరా వెనుక 2.27-అంగుళాల టచ్ డిస్‌ప్లే మరియు ముందు భాగంలో 1.4 అంగుళాల నాన్-టచ్ డిస్‌ప్లే ఉంది.

హీరో బ్లాక్ 12 కెమెరా 10 మీటర్లు లేదా 33 అడుగుల వరకు వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. అయితే, కొత్త హీరో 12 బ్లాక్ మోడల్ కొత్త యూనివర్సల్ ట్రైపాడ్ థ్రెడ్ మౌంట్‌తో వస్తుంది. ఈ యాక్షన్ కెమెరా 1,720 mAh ఎండ్యూరో బ్యాటరీతో వస్తుంది. ప్రస్తుత వెర్షన్‌తో పోలిస్తే ఇది రెట్టింపు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.

Hero 12 Black కోసం Max Lens Mod 2.0 ఇప్పుడు 4K 60fps రిజల్యూషన్‌లో వైడ్ 177 డిగ్రీస్ వ్యూను అందిస్తుంది. మ్యాక్స్ లెన్స్ మోడ్ 2.0 వెర్షన్ 3 ఫీల్డ్ ఆఫ్ వ్యూ సెట్టింగ్‌లలో వీడియో మరియు ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. మాక్స్ వైడ్, మాక్స్ సూపర్‌వ్యూ మరియు హైపర్ ఇమ్మర్సివ్ మ్యాక్స్ హైపర్‌వ్యూలలో అందుబాటులో ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 7, 2023, 13:07 [IST]
English summary
Gopro hero 12 black camera launched in india price features specs details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+