బస్సు బ్రేకులు పడకపోవడంతో విసిగిన డ్రైవర్‌.. ఏకంగా ఆర్టీవో కార్యాలయానికి తీసుకెళ్లి..

ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన బస్సు బ్రేకులు పనిచేయకపోవడంతో బస్సు డ్రైవర్ ప్రయాణికులను మార్గమధ్యలో దించి బస్సును ఆర్టీఓ కార్యాలయానికి తీసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. బ్రేకులు పడని బస్సును నడపాలని డిపో అధికారులు పట్టుబట్టినట్లు బస్సు డ్రైవర్ పేర్కొన్నారు. దాని గురించిన పూర్తి వివరాలు ఈ కథనంలో చదవండి.

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా మేళా శంకరన్ చూలికి చెందిన జ్ఞాన బెర్క్‌మన్స్ ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన బస్సులో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం నాగర్‌కోయిల్‌ పక్కన వడస్సేరి నుంచి తిరునెల్వేలి మార్గంలో బస్సును నడిపించారు. అయితే బస్సు నడుపుతుండగా బ్రేకులు సరిగా పనిచేయలేదు. ఇంతకుముందు కూడా ఈ బస్సులో సమస్య ఉన్నట్లు సమాచారం.

Bus-Brakes-Fail

అయితే ఈ సమయంలో ఎలాగో అలా బస్సును నడిపించగలిగాడు. ప్రయాణికులకు, ఇతర వాహనదారులకు హాని కలిగించకుండా వీలైనంత నెమ్మదిగా బస్సును నడిపాడు. కానీ అలా ఎక్కువ సేపు బస్సును నడిపించలేకపోయాడు. బస్సు వల్లియూర్ బస్టాండ్‌కు చేరుకోగానే ఇక ప్రయాణం కొనసాగించలేమని గ్రహించి వల్లియూర్ బస్టాండ్‌లో బస్సును ఆపేశాడు.

బస్సు బ్రేకులు సరిగా పడటం లేదని, అందుకే ప్రయాణం కొనసాగిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రయాణికులతో చెప్పి వారందరినీ బస్సు నుంచి దించి మరో తిరునల్వేలి బస్సులో ఎక్కించారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా మరో బస్సులోకి తరలించిన అనంతరం.. బస్సు డ్రైవర్ స్థానిక ఆర్టీఓ కార్యాలయానికి బస్సును తీసుకెళ్లాడు.

అక్కడికి వెళ్లి బస్సును ఆర్టీఓ అధికారికి అప్పగించారు. బస్సుకు సరిగా బ్రేకులు లేవని, అంతేకాకుండా అందులో చాలా మరమ్మతులు ఉన్నాయని తెలిపారు. దీనిపై పలు మార్లు డిపో అధికారులకు ఫిర్యాదు చేసిన బస్సును నడపాలని డిపో అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు ఆర్టీవో అధికారికి చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవడం లేదని వెల్లడించారు.

కాగా బస్సు డ్రైవర్‌ మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా బస్సుకు బ్రేక్‌ సమస్య ఉందని, కుడివైపు తిరిగినప్పుడు ఎడమవైపు, ఎడమవైపు తిరిగితే కుడివైపు తిరుగుతుందని, దీన్ని సరిచేయాలని చాలాసార్లు అధికారులకు మొరపెట్టుకున్నట్లు అధికారులకు తెలిపారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. నిరంతర సమస్యలతో ఈ బస్సు నడుపుతున్నట్లు వెల్లడించారు.

ఇలాగే ప్రయాణాలు కొనసాగిస్తే ప్రయాణికులను సురక్షితంగా తరలించలేమనే విషయాన్ని అధికారులు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు నోట్‌లో డ్రైవర్‌ పేర్కొన్నారు. బస్సు పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో ప్రయాణికులను సురక్షితంగా దించి వేరే బస్సులో ఎక్కించినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఫిర్యాదుకు స్పందించిన రవాణా సంస్థ అధికారులు ఈ బస్సుకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు, రవాణా సంస్థ అధికారుల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఈ బస్సును బాగు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బస్సును రాష్ట్ర రవాణా సంస్థ వర్క్‌షాప్‌కు తరలించారు. కాగా తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థల్లో బస్సులు ఎక్కువగా చెడిపోతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది జిల్లాల్లో ప్రభుత్వ బస్సులు మార్గమధ్యలో ఆగిపోవడం, సడన్ బ్రేక్ ఫెయిల్ కావడం వంటి పలు గందరగోళాలు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 19, 2023, 16:02 [IST]
English summary
Government bus driver refuses to drive due to brake failure
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+