రష్యా నుండి 39,000 కోట్లు విలువైన మిస్సైల్స్‌ను కొనుగోలు చేయనున్న భారత్

By Anil

భారత దేశపు రక్షణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 3,900 కోట్ల రుపాయలు విలువైన రష్యాకు చెందిన మిస్సైల్స్‌ను కొనుగోలు చేయనుంది. దీనికి సంభందించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటించారు. ఇవి దేశ సరిహద్దుల్లో పని చేస్ మిలిటరీ దళాలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అయితే భారత్ పెద్ద మొత్తంలో ఇలా మిస్సైల్స్‌ను కొనుగోలు చేయడాన్ని పాకిస్తాన్ కేంద్ర రక్షణ విభాగం తప్పుపట్టింది.

భారత్‌లోకి ప్రవేశించే శత్రువులను, టెర్రరిస్ట్‌లను, మిస్సైల్స్, ప్లేన్స్, డ్రోన్స్ వంటి వాటిని ఈ మిస్సైల్ ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోగలదు. రష్యాకు చెందిన ఈ యస్-400 అత్యాధునిక మిస్సైల్స్ గురించి మరింత సమాచారం క్రింది కథనం ద్వారా తెలుసుకుందా రండి.

1. రష్యా ముఖ్య లక్ష్యం

1. రష్యా ముఖ్య లక్ష్యం

రష్యా ఈ మధ్యనే టర్కీ మీద తమ యుద్ద విమానాల ద్వారా దాడులకు యత్నించింది. అయితే టర్కీ తెలివిగా వాటిని తిప్పికొట్టింది. కాని రష్యా ఇలాంటి వాటి విషయంలో మంచి పట్టు కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే రష్యా, సిరియాకు ఆయుధ సహకారం చేస్తోంది. త్వరలో తమ యస్-400 మిస్సైల్స్‌ను సిరియాకు సరఫరా చేయడానికి నిర్ణయించింది. అయితే దీని శత్రు దేశాలను ఇది సమూలంగా నాశనం చేయాలనే బలమైన కోరికతో ఉంది.

Picture credit: Соколрус / Wiki Commons

2. రేంజ్ మిస్సైల్స్

2. రేంజ్ మిస్సైల్స్

రష్యా వారి అత్యాధునిక మిస్సైల్స్ దాదాపుగా 400 కిలోమీటర్ల వరకు సునాయాసంగా దూసుకుపోగలవు, ఇవి ఖచ్చితంగా శత్రుమూకలను, లక్ష్యాలను సమూలంగా నాశనం చేయగలవు.ఇవి 185 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా నాశనం చేయగలవు.

Picture credit: Goodvint / Wiki Commons

 3. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్

3. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్

యస్-400 మిస్సైల్స్ లో మరియు వీటి లాంఛర్‌లో రాడార్ సిస్టమ్ కలదు. వీటికి చెందిన కమ్యూనికేషన్స్ అన్ని కూడా ఆంగ్ల భాషలో ఉండేట్లు రూపొందించారు. అయితే భారత్ ఐదు యస్-400 మిస్సైల్స్‌ను కొనుగోలు చేస్తోంది.

Picture credit: UMNICK / Wiki Commons

మిస్సైల్స్ కోసం రష్యాతో చేతులు కలిపిన భారత్

ప్రస్తుతం భారత్ ఐదు యస్-400 మిస్సైల్స్‌ను కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్‌‌కి వణుకుపుడుతోందని చెప్పవచ్చు. అయితే పాకిస్తాన్‌కు కేవలం మూడు యస్-400 మిస్సైల్స్‌ను మాత్రమే నిర్వహించే సామర్థ్యం మాత్రమే కలదు.

Picture credit: Vitaly V. Kuzmin / Wiki Commons

5. మూడు రకాల మిస్సైల్స్

5. మూడు రకాల మిస్సైల్స్

ఈ యస్-400 మిస్సైల్స్‌లో మూడు రకాలు కలవు. అందులో దూర ప్రాంతాల్లోని కక్ష్యల కోసం 40ఎన్6 మరియు 48ఎన్6 లను ఉపయోగిస్తారు మరియు తక్కువ దూరంలోని లక్ష్యాలను నాశనం చేయడానికి 9ఎమ్96 మిస్సైల్స్ 2ను ఉపయోగిస్తారు. అయితే తక్కువ దూరంలో గల లక్ష్యాల కోసం ఈ యస్-400 మిస్సైల్స్ కూడా ఉపయోగిస్తారు.

Picture credit: Vitaly V. Kuzmin / Wiki Commons

6. లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం

6. లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం

యస్-400 లో గల 40ఎన్6 మరియు 48ఎన్6 మిస్సైల్స్ దాదాపుగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేరుకుంటాయి. మరియు యస్-400 లోని9ఎమ్96 మిస్సైల్ ను తక్కువ దూరంలోని లక్ష్యాలను నాశనం చేయడానికి ఉపయోగపడతాయి.

Picture credit: Vitaly V. Kuzmin / Wiki Commons

7. వేగం

7. వేగం

యస్-400 మిస్సైల్స్ అత్యంత భయకరంగా సెకన్‌కు 4.8 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలవు. అంతే కాకుండా ఇవి ఖచ్చింతంగా లక్ష్యాలను గుర్తించి మరీ నాశనం చేయగలదు.

Picture credit: Vitaly V. Kuzmin / Wiki Commons

8. గుర్తించడం

8. గుర్తించడం

ఇందులో ఉన్న రాడార్ సిస్టమ్ ముందుగా లక్ష్యాలను, శత్రుమూకలను మరియు టార్గెట్‌లను గుర్తిస్తుంది. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే మిస్సైల్స‌ను లాంచ్ చేయమని లాంఛర్‌కు సమాచారం అందుతుంది. ఈ మొత్తం సందేశం రాడార్ ద్వారా అందుతుంది.

Picture credit: Соколрус / Wiki Commons

9. డీల్ ఎప్పుడు ?

9. డీల్ ఎప్పుడు ?

దీనికి సంభందించిన నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని, ఇరు దేశ ప్రధానులు ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసినట్లయితే ఈ మిస్సైల్స్‌ను భారత్‌కు తీసుకు రావచ్చని ఒక సీనియర్ అధికారి తెలిపాడు.

Picture credit: Goodvint / Wiki Commons

10. చైనా ఆరు....

10. చైనా ఆరు....

భారత్ యస్-400 మిస్సైల్స్‌ను సమకూర్చుకుంటున్న సమయంలో, చైనా ఈ యస్-400 మిస్సైల్స్‌ను దాదాపుగా ఆరు వరకు సమకూర్చుకుంటున్నట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే సరిహద్దు భద్రత విశయంలో అన్ని దేశాలు తీవ్రంగా ఆయుధాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అయితే ఈ ధోరణి ఏ పరిణామానికి దారి తీస్తుందో వేచి చూడాలి మరి.

Picture credit: UMNICK / Wiki Commons

మిస్సైల్స్ కోసం రష్యాతో చేతులు కలిపిన భారత్
  1. భారతీయ ఆర్మీ యొక్క శక్తివంతమైన యుద్ద వాహనాలు మరియు ఆయుధాలు.
  2. ఐయస్‌ఐయస్ తీవ్రవాదుల నాశనానికి బ్రహ్మాస్త్రం ప్రయాగించనున్న రష్యా ప్రధాని పుతిన్
  3. అగ్ని మిస్సైల్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు...
  4. మా బలం, మాకు గర్వకారణం..... ఇండియాలో తయారైన మిలిటరీ వాహనాలు!!

More from DriveSpark

Article Published On: Monday, December 21, 2015, 17:41 [IST]
English summary
The Central government has approved the Rs 39,000-crore acquisition of five advanced Russian S-400 Triumf air defence missile systems, which have even rattled NATO countries.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+