ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎంతో మంది ఈ వైరస్ ప్రభావానికి గురై ప్రాణాలు వదిలేస్తున్నారు. కరోనా రోగుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్న కారణంగా దేశంలో మౌలిక సదుపాయాల కొరత చాలా వుంది. ఈ కారణంగా హాస్పిటల్స్ లో బెడ్లు మరియు ఆక్సిజన్ ఎక్కువ కొరతగా ఉంది.

ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

ఆక్సిజన్ కొరత ఎక్కువ కావడం వల్ల లెక్కకుమించిన ప్రజలు మరణిస్తున్నారు. ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడానికి ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే చాలా కంపెనీల భాగస్వామ్యంతో ఆక్సిజన్ తయారీకి తగిన సన్నాహాలు చేస్తున్నాయి.

ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

ప్రస్తుతం దేశంలో ఉన్న చాలా హాస్పిటల్స్ ఇప్పుడు కరోనా రోగులతో నిండిపోయాయి. దీనివల్ల హాస్పిటల్స్ లో బెడ్లు చాలా కొరతగా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రజలు శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇప్పుడు ఆక్సిజన్ చాలా అవసరం.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ ఉపయోగిస్తున్న వ్యక్తి ఇతడే..

ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

దేశంలో ఆక్సిజన్ కొరత వల్ల ఇప్పటి వరకు వేలాది మంది మరణించారు. అంతే కాకుండా హాస్పిటల్ లో సరిపడా బెడ్లు లేకపోవడం వల్ల ఎక్కువ సమయం అంబులెన్స్ లోనే గడపాల్సి వస్తోంది. ప్రస్తుతం కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. తమిళనాడులో ప్రతి రోజూ సగటున 3 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

కరోనా వైరస్ సోకిన వారిలో చాలా మంది పేద ప్రజలు చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్స్ పై ఆధార పడుతున్నారు. కరోనా సోకిన వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం మరియు కొన్ని ప్రైవేటు సంస్థలు వివిధ చర్యలు తీసుకున్నాయి. కరోనా వైరస్ ఎక్కువగా ప్రభావితమైన కోయంబత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేట్ కంపెనీలు ఆక్సిజన్‌తో కూడిన రెండు బస్సులను విరాళంగా ఇచ్చాయి.

MOST READ:మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించనున్న మారుతి సుజుకి; వివరాలు

ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

ఈ బస్సులు ఆక్సిజన్ అవసరమైన కరోనా సోకిన వారికి చికిత్స చేయడానికి ఉపయోగపడతాయి. ఈ బస్సుల్లో 12 సీట్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. ప్రతి బస్సులో 7 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన 6 సిలిండర్లు ఉంటాయి. ఈ రెండు బస్సుల ద్వారా మొత్తం 24 మంది రోగులు లబ్ధి పొందవచ్చు.

ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

ఈ బస్సులు రోజుకు 24 గంటలు తగినంత ఆక్సిజన్ అందించడానికి తగిన సదుపాయాలు అందుబాటులో ఉంటాయని కూడా తెలిపింది. కోయంబత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడేవారికి ఈ రెండు బస్సులు నిజంగా ఒక వరం. ఇటీవల కర్ణాటకలో కూడా కర్ణాటక ముఖ్యమంత్రి ఆక్సిజన్ బస్సులను ప్రవేశపెట్టారు.

MOST READ:'తౌక్టే' తుఫాను వల్ల భారీగా దెబ్బతిన్న లగ్జరీ కార్[వీడియో]

Most Read Articles

English summary
Government Hospital In Coimbatore Gets Two Buses With Oxygen Facility. Read in Telugu.
Story first published: Thursday, May 20, 2021, 11:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X