భారత్‌, శ్రీలంక మధ్య భారీ సముద్ర వంతెన.. ఎక్కడ నిర్మాణం జరగనుందంటే..?

దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ లేదా అటల్‌ సేతును ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించారు. 21.8 కి.మీ పొడవునా రూ.17,840 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. సముద్రం పైన 16.50 కి.మీ, మిగిలిన భాగాన్ని భూమిపై నిర్మాణం చేపట్టారు. ఈ వంతెన మహారాష్ట్రలోని రాయగడ జిల్లాలోని సెవ్రి మరియు నవాషెవా ప్రాంతాలను కలుపుతుంది.

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలను పరిశీలిస్తోందని తెలుస్తోంది. భారత్‌, శ్రీలంక మధ్య సముద్ర వంతెన నిర్మాణం (Sea Bridge Between India and Srilanka) చేపట్టే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ఆర్థిక వ్యవస్థ సహా పర్యాటకానికి మంచి బూస్టింగ్‌ను ఇస్తుందని భావిస్తున్నట్లు సమాచారం.

sea bridge between india and srilanka

తమిళనాడులోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌లను కలుపుతూ సముద్రం మీదుగా 23 కి.మీ పొడవున ఈ వంతెన నిర్మాణ అవకాశాలు, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది. పాక్‌ జల సంధి మీదుగా రోడ్డు/ రైలు మార్గాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. సేతు సముద్ర ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం, రవాణా ఖర్చులను 50 శాతం తగ్గించడం, భారత్‌ నుంచి శ్రీలంక భూభాగాన్ని ‌అనుసంధానం చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.

ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ సపోర్టుతో త్వరలో రోడ్డు/ రైలు మార్గాల సాధ్యాసాధ్యాల కోసం అధ్యయనం ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చు, ఇతర ప్రణాళికలు సహా మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అధికారిక సమాచారం బయటకు రావాల్సి ఉంది.

mumbai trans harbour link

జనవరి 12న.. ఈ అటల్‌ సేతు (Atal Setu) 21.8 కి.మీ పొడవున 6 లేన్లతో నిర్మించారు. సముద్రం పైన 16.50 కి.మీ, మిగిలిన భాగాన్ని భూమిపై నిర్మించారు. భూకంపాలను కూడా తట్టుకొనేలా పూర్తి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నిర్మించారు. ఈ సేతు నిర్మాణం 2018లోనే ప్రారంభం అయింది. అయితే కరోనా కారణాలతో నిర్మాణం ఆల‌స్యం అయింది.

అటల్‌ సేతుపై కార్లు, ట్యాక్సీలు, తేలికపాటి మోటార్‌ వాహనాలు, మినీ బస్సులు, 2 యాక్సిల్‌ బస్సులు గరిష్ఠంగా 100 కి.మీ వేగంతో ప్రయాణం చేయవచ్చు. వంతెన ప్రారంభం, చివరలో వాహనాల వేగం గంటకు 40 కి.మీగా మాత్రమే ఉండాలి. ఈ వంతెనపై ప్రతిరోజు 70 వేలకు పైగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

atal setu

ఈ అటల్‌ వంతెనపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కెమెరాలను అమర్చాలని అధికారులు భావిస్తున్నారు. ఈ అటల్‌ సేతు బ్రిడ్జి ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నవీ ముంబైకు వెళ్లేందుకు వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. ముంబయి నుంచి గోవా సహా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ బ్రిడ్జి అత్యంత అనుకూలంగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 23, 2024, 13:53 [IST]
English summary
Government likely to study feasibility for sea bridge between india and srilanka
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+