ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుదారులకు షాక్‌ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!!

ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఈ వాహనాలపై ఇప్పటి వరకు ఇస్తున్న సబ్సిడీని భారీగా తగ్గించింది. అలాగే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై kWhకు రూ.15,000 ఉన్న సబ్సిడిని రూ.10,000కు తగ్గించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

2019 ఏప్రిల్‌ 1న ఫేమ్‌ (FAME) - ఫాస్టర్‌ అడాప్షన్ మరియు మానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌.. స్కీమ్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. మూడేళ్ల కాలానికి సుమారు 10,000 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్‌ వాహనాలపై 40 శాతం రాయితీ ఇచ్చింది.

government slashed FAME subsidy

తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఉన్న 40 శాతం సబ్సిడిని కేవలం 15 శాతానికి పరిమితం చేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై kWhకు రూ.15,000 ఉన్న సబ్సిడి రూ.10,000కు తగ్గించింది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జాన్‌ 1, 2023 నుంచి ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని వెల్లడించింది. జూన్‌ 1 లేదా ఆ తర్వాత రిజిస్టర్‌ చేయబడిన ఎలక్ట్రిక్‌ వాహనాలకు కేవలం 15 శాతం మాత్రమే సబ్సిడీ లభించనుంది.

ఎలక్ట్రికల్‌ వాహన రంగంలో సుస్థిర అభివృద్ధి సాధించడం మరియు కర్భన ఉద్గారాలను తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం నిబద్దతగా ఉందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహీంద్రానాథ్‌ పాండే తెలిపారు. ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్లకు డిమాండ్‌ అధికంగా ఉన్న సమయంలో తాము తీసుకున్న నిర్ణయం వాతావరణ మరియు ఆర్థిక పరిస్థితిపై సానుకూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.

అయితే ఎలక్ట్రిక్‌ వాహనాలపై సబ్సిడీలో కోతపెట్టడం కారణంగా ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాల విక్రయాల్లో కొద్దిమేర తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో OEM (ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మానుఫ్యాక్టరర్‌) మార్కెట్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు మరియ స్ట్రిప్డ్‌డౌన్‌ వెర్షన్‌లను త్వరగా విడుదల చేసేలా నిర్ణయాలు తీసుకోనే అవకాశం ఉండవచ్చు.

జేఎంకే రీసెర్చ్‌ మరియు అనలిటిక్స్‌ ప్రకారం భారతదేశంలో ఏప్రిల్‌లో 5 ఎలక్ట్రిక్‌ వాహనాలు లాంచ్‌ అయ్యాయి. ఇందులో ఎలక్ట్రిక్‌ సైకిల్‌, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌, ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ కార్గో, మరియు ఎలక్ట్రిక్‌ త్రీవీలర్‌ కార్గో, ఎలక్ట్రిక్‌ కారు విడుదల అయ్యాయి.

ఏప్రిల్‌ నెల నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలు 21 శాతం తగ్గి, 1,10,503 వాహనాలకు చేరుకున్నాయి. ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాలు, ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ (ప్యాసింజర్‌) తరహా వాహనాల రిజిస్ట్రేషన్లు గణనీయంగా జరిగాయి. ఏప్రిల్‌ నెలలో జరిన మొత్తం రిజిస్ట్రేషన్లలో 90.48 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

ఏప్రిల్‌ నెలలో ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక మరియు గుజరాత్‌ రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంలో దేశంలోనే అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్టాల్లో 21,845 ఎలక్ట్రిక్‌ వాహన విక్రయాలు జరిగాయి. ఈ విక్రయాల్లో ఓలా ఎలక్ట్రిక్‌ టాప్‌లో ఉంది. టీవీఎస్‌ రెండో స్థానంలో ఉంది. latter మరియు Ather మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి. వాహన్‌ వెబ్‌సైట్‌ లెక్కల ప్రకారం మే నెలలో ఇప్పటి వరకు 39000 యూనిట్ల ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ వాహనాలు విక్రయాలు జరిగాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 23, 2023, 13:15 [IST]
English summary
Government of india reduced fame subsidy on electric vehicles applicable from june 1 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+