కొత్త కార్లు కొనుగోలు చేస్తున్నారా... BNCAP రేటింగ్‌ వ్యవస్థ గురించి తెలుసా?

భారత్‌లో కార్లను కొనుగోలు చేస్తున్న సమయంలో కస్టమర్లు ఏ ప్రాతిపదికన వాహనాలను కొనుగోలు చేస్తున్నారనే అంశంపై ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కార్ల తయారీ సంస్థ స్కోడా ఈ అంశంపై సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. పది మందిలో తొమ్మిది మంది భారతీయులు కార్లను కొనుగోలు చేస్తున్న సమయంలో మైలేజ్‌ కంటే సేఫ్టీ ఫీచర్ల ప్రాతిపదికనే నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.

కార్ల సేఫ్టీపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కీలక వ్యవస్థను రూపొందించినట్లు సమాచారం. BNCAP- భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రాం పేరిట రూపొందిన ఈ వ్యవస్థ కార్లకు సేఫ్టీ రేటింగ్‌ ఇవ్వనుంది. ఈ వ్యవస్థ అక్టోబర్‌ 1 నుంచి భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

car safety rating system BNCAP

కార్లలో వినియోగించిన సేఫ్టీ ఫీచర్ల ఫలితాల ఆధారంగా వాహనాలకు రేటింగ్ ఇవ్వనుంది. 1 నుంచి 5 వరకు స్టార్‌ రేటింగ్ ఇవ్వనుంది. దీంతో కార్లలో భద్రతా ప్రమాణాలను పెంచేందుకు ఉపయోగపడుతుందని మరియు వినియోగదారులకు సురక్షితమైన కార్లు అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్‌ కమిటీ BNCAP రేటింగ్‌ ఫలితాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురిస్తుంది. నూతన కార్లను కొనుగోలు చేయాలనుకొనే ప్రజలు ఈ వెబ్‌సైట్‌ ద్వారా కార్ల రేటింగ్‌ను తెలుసుకొని, ఏ కార్లను కొనుగోలు చేయాలనే అంచనాకు రావచ్చు.

car safety rating system BNCAP

అయితే ప్రారంభంలో ఈ BNCAP వ్యవస్థ ఐచ్ఛికంగా (Optinal) ఉండనుందని తెలుస్తోంది. లేదా OEM (Orinal Equipment Manufactures)లకు ఈ వ్యవస్థ శాంపిల్‌ను అందించే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ వల్ల దేశీయ కార్ల ఉత్పత్తిదారులకు ఉపయోగం కలిగే అవకాశం ఉంటుంది. స్టార్‌ రేటింగ్‌ కోసం విదేశాలకు తమ కార్ల శాంపిల్‌లను పంపాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా డబ్బు, సమయం ఆదా కానుంది.

అయితే ప్రస్తుతం భారత్‌లో కార్లకు క్రాష్‌ టెస్ట్‌ను తప్పనిసరి చేశారు. దీంతో వాహనాలు అత్యంత మెరుగైన నిర్మాణ భద్రతను కలిగి ఉంటాయి. ఈ ‌స్టార్‌ రేటింగ్‌ ఉన్నతస్థాయి ప్రమాణాలను కలిగి ఉంటుంది. పెద్దలు, చిన్నారుల భద్రతా మంరియు భద్రతా ఫీచర్ల ఆధారంగా రేటింగ్ ఇవ్వబడుతుంది.

car safety rating system BNCAP

భారత్‌లో వాహనాల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా BNCAP వ్యవస్థ ముందడుగా భావించవచ్చు. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని చాలా వరకు నియంత్రించవచ్చు. మరియు భారత్‌ రోడ్లను భద్రంగా మార్చవచ్చు. BNCAP వ్యవస్థ తన నిబంధనలను GNCAP (గ్లోబల్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రాం) నుంచి తీసుకుంది. GNCAP వ్యవస్థ ఇప్పటికే అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలను కలిగి ఉంది.

car safety rating system BNCAP

స్కోడా సంస్థ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 92 శాతం మందిలో 22.2 శాతం మంది 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ను క్రాష్‌ టెస్ట్‌ కార్లను ఇష్టపడుతున్నారని వివరించింది. 21.3 శాతం మంది 4 స్టార్‌ రేటింగ్‌ను ఇష్టపడుతున్నారు. అయితే ఎటువంటి రేటింగ్‌ లేని కార్లను కేవలం 6.8 శాతం మంది మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఈ సర్వే పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Saturday, July 1, 2023, 13:11 [IST]
English summary
Government of india to introduce car safety rating system bncap from october 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+