ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్లకు తప్పకుండా వీటిని అందించాలి; కేంద్ర ప్రభుత్వం

భారతదేశంలో కరోనా రక్కసి కోరలు చాస్తూ ఎంతోమంది ప్రాణాలు తీస్తూ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి భారీ నుంచి ప్రజలను కాపాడటానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు గురవుతున్నారు.

ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్లకు తప్పకుండా వీటిని అందించాలి; కేంద్ర ప్రభుత్వం

ఈ విధంగా శ్వాసకోశ సమస్యలకు గురవుతున్న ప్రజలకు తప్పనిసరిగా ఇప్పుడు మెడికల్ ఆక్సిజన్ అవసరం. కావున ప్రభుత్వం కరోనా బాధితులకు కావలసిన ఆక్సిజన్ అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. దీని కోసం ఆటో మొబైల్ పరిశ్రమల సహాయం కూడా తీసుకుంటోంది.

ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్లకు తప్పకుండా వీటిని అందించాలి; కేంద్ర ప్రభుత్వం

అయితే ఈ ఆక్సిజన్ అవసరమైన ప్రాంతానికి తరలించడానికి డ్రైవర్లు అవసరం. కావున డ్రైవర్లు ఆక్సిజన్ ట్యాంకర్లను చాలా దూరం తరలిస్తూ ఉంటారు. కావున ఆక్సిజన్ తరలించే డ్రైవర్ల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి వ్యాక్సిన్లు వేయాలని మరియు కరోనా వైరస్ సంక్రమణ సంభవించినప్పుడు ఆసుపత్రిలో చేరడానికి మరియు చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను కోరింది.

MOST READ:అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్లకు తప్పకుండా వీటిని అందించాలి; కేంద్ర ప్రభుత్వం

అంతే కాకుండా ఆక్సిజన్ మరియు రసాయనాలను రవాణా చేసే డ్రైవర్లకు కొన్ని చిన్న కార్యక్రమాల ద్వారా దీని గురించి శిక్షణ ఇవ్వాలని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. దీని కోసం మంత్రిత్వ శాఖ ట్వీట్లలో, ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్ల కోసం ప్రత్యేక యాంటీ కోవిడ్ 19 వ్యాక్సిన్ ప్రచారం నిర్వహించాలని మరియు కరోనా వైరస్ సంక్రమణ విషయంలో ఆసుపత్రిలో మరియు చికిత్స విషయంలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్లకు తప్పకుండా వీటిని అందించాలి; కేంద్ర ప్రభుత్వం

ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ రవాణాకు డిమాండ్ పెరగడం వల్ల ఈ ఆక్సిజన్ రవాణా చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లను ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. రాబోయే కొద్ది వారాల్లో 500 మంది డ్రైవర్లను వెంటనే అందుబాటులో ఉంచాలని, అలాంటి డ్రైవర్ల సంఖ్యను రాబోయే రెండు నెలల్లో 2,500 కు పెంచాలని మంత్రిత్వ శాఖ తెలిపింది.

MOST READ:కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్లకు తప్పకుండా వీటిని అందించాలి; కేంద్ర ప్రభుత్వం

శిక్షణ పొందిన డ్రైవర్ల డిజిటల్ డేటాబేస్ ను సృష్టించడం ద్వారా వారి సర్వీసులను ఎక్కడైనా పొందవచ్చని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. లాజిస్టిక్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్, ఇండియన్ కెమికల్ కౌన్సిల్, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మరియు మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిదారుల సహాయంతో ఈ శిక్షణా కార్యక్రమాన్ని సిద్ధం చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్లకు తప్పకుండా వీటిని అందించాలి; కేంద్ర ప్రభుత్వం

ప్రస్తుతం కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందటం వల్ల డ్రైవర్లు కూడా సురక్షితంగా ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే కొంతమంది డ్రైవర్లు రాష్ట్రాలు దాటి రావాల్సి వస్తుంది. ఈ సమయంలో డ్రైవర్ కి కరోనా సోకితే అతని వల్ల మరింతమందికి కరోనా సంక్రమించే అవకాశం ఉంది. కావున ఈ కార్యక్రమం వల్ల వ్యాక్సిన్లు మొదలైనవి ఇవ్వడం వల్ల వారు కొంత సురక్షితంగా ఉండవచ్చు.

MOST READ:ఒకే వ్యక్తి 20 క్రూయిజర్ బైక్స్ కలిగి ఉన్నాడు, వాటి విలువ అక్షరాలా 3.5 కోట్లు

Most Read Articles

English summary
Government Passed Orders For Priority Vaccination To Drivers Of Oxygen Tankers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X