గుడ్‌న్యూస్: టోల్ ఛార్జీ లేకుండా అపరిమితంగా వెళ్ళొచ్చు.. ఏడాది, లైఫ్‌టైమ్ పాస్‌లు వచ్చేస్తున్నాయ్..!
దేశంలో జాతీయ రహదారుల్లో టోల్ ప్లాజా నుంచి తరుచుగా ప్రయాణించే ప్రైవేట్ కార్ల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతుంది. బస్సులు, రైళ్లలో ఇచ్చినట్టుగానే ప్రైవేట్ కార్ల ఓనర్లకు ఆర్థికంగా ఉపయోగకరంగా ఉండటానికి టోల్ గేట్ నుంచి రెగ్యులర్‌గా ప్రయాణించే వారికోసం వార్షిక, జీవిత కాలపు పాస్‌లను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రముఖ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఏడాది పాస్‌కు రూ.3000, అదే 15 సంవత్సరాలు లేదా జీవిత కాల పాస్‌కు రూ.30,000 ఫీజును వసూలు చేయనున్నారని తెలస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనల గురించి చర్చలు జరుపుతుందని సమాచారం ఉంది. ఇప్పటికే ప్రతి కారులో ఫాస్ట్‌ట్యాగ్‌లను ఇచ్చినందు వలన కొత్తగా పాస్‌లు జారీ చేయాల్సిన అవసరం లేకుండా వీటిమీదే పాస్‌లను ఇచ్చే అవకాశం ఉంది.
జాతీయ రహదారులను(నేషనల్ హైవే) రెగ్యులర్‌గా ఉపయోగించే ప్రైవేట్ కార్ల యజమానులు ఇది బాగా తోడ్పాటు అందిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పాస్ పథకాన్ని అతి త్వరలోనే ప్రవేశపెట్టాలని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలు తుది దశలో ఉన్నాయి, ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారనే దానిపై ఇంకా అధికారికంగా కేంద్రం ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న దానితో పోలిస్తే బాగా ఉపయోగపడుతుంది.

దేశంలో కార్లు టోల్ గేట్ దాటిన ప్రతిసారి కూడా రూ.100 నుంచి రూ.150 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కార్ల వినియోగదారులకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొస్తున్న పాస్ ద్వారా రూ.3000 చెల్లించి ఏడాది పాటు ఎన్ని సార్లైనా కూడా టోల్ గేట్ నుంచి ప్రయాణించవచ్చు. ప్రతి రోజూ టోల్ గేట్ ద్వారా ప్రయాణించే ప్రైవేట్ కార్ల వినియోగదారులకు డబ్బు ఆదా అవుతుంది.
అలాగే జీవిత కాల పాస్ ద్వారా కూడా 15 ఏళ్లు టోల్ గేట్ నుంచి ఎన్ని సార్లైనా దాటవచ్చు. ఇది క్యాబ్ ఓనర్లకు, ఇతర ప్రైవేటు కార్ల వినియోగదారులు సంతోషించే విషయం. పేద, మధ్య తరగతి వారు ఎక్కువగా క్యాబ్ వంటి ఇతర సేవల ద్వారా ఆదాయం సంపాదిస్తుంటారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనలు చేసింది.
ఇది అమల్లోకి వచ్చిన తరువాత ఒకేసారి ఏడాది పాస్, లేదంటే జీవిత కాల పాస్‌ను ఏది అనువుగా ఉంటే దాన్ని ఎంచకుని అపరిమితంగా టోల్ గేట్ నుంచి ప్రయాణాలు సాగించవచ్చు. ఇదే సమయంలో ప్రస్తుతం కిలోమీటరుకు ప్రైవేట్ కార్లకు వసూలు చేస్తున్న అమౌంట్‌ను కూడా తగ్గించడానికి మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని సమాచారం. దీనిపై ఇప్పటికే పలు దఫాలుగా ఉన్నతాధికారులు చర్చలు కూడా జరిపారు.
ప్రస్తుతం, స్థానికంగా ఉండే వారు, తరుచుగా ప్రయాణించే వారికి నెలవారీ పాస్‌లు ఇస్తున్నారు. దీని కోసం స్థానిక అడ్రస్, ఇతర వివరాలు ఇవ్వాలి. దీని ధర రూ.340. ఈ లెక్కన ఏడాదికి ఇది రూ.4080 అవుతుంది. అదే కొత్త పాస్ వచ్చినట్లయితే ఏడాదికి రూ.3 వేలు చెల్లిస్తే అపరిమితంగా ప్రయాణాలు చేయవచ్చు. ప్రభుత్వానికి కూడా టోల్ గేట్ పాస్‌ల ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








