జాతీయ రహదారుల మీద ప్రమాద ప్రాంతాలను గుర్తించమంటున్న కేంద్ర ప్రభుత్వం
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారుల మీద ప్రమాద ప్రాంతాలను మరియు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆస్కారమున్న ప్రాంతాలను గుర్తించమంటూ కేంద్ర ప్రభుత్వం జాతీయ రోడ్లను నిర్విహిస్తున్న ఆయా ఏజెన్సీలకు సూచించింది. ప్రమాదాలకు నిలయమైన ప్రాతాలను బ్లాక్ స్పార్ట్స్ గా గుర్తించమని ఆదేశాలు ఇచ్చింది.

ఫ్యాటిలిటి డాటా వారి ప్రకారం 2011, 2012, 2013 సంవత్సరాలకు గాను దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులలో దాదాపుగా 726 అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలను గుర్తించినట్లు వెల్లడియ్యింది. ఈ సందర్భంగా కేంద్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ మరియు జాతీయ రహదారుల మంత్రి మాట్లాడుతూ. అన్ని జాతీయ రహదారుల మీద బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి వాటిని జాతీయ రహదారుల అభివృద్దిలో భాగంగా బాగుచేస్తామని తెలిపారు.
Also Read: ఊహలకందని అమీర్ ఖాన్ వ్యక్తిత్వం మరియు కార్ల ప్రపంచం
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారుల నిర్వహణా ఏజెన్సీలు రహదారుల పొడవునా బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి నివేదికలు ఇవ్వాలని తెలిపారు. జాతీయ రహదారుల మీద ప్రమాదా ప్రాంతాల నిర్మూలనకు 11,000 కోట్ల రుపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ప్రతి ఏడాది కూడా రోడ్డు ప్రమాదాల మూలంగా 55,000 నుండి 60,000 కోట్ల వరకు సంవత్సర ఆదాయాన్ని కోల్పోతున్నట్లు తెలిపారు.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ యుద్ద హెలికాఫ్టర్‌ను కలిగిన భారత్


Click it and Unblock the Notifications